...
...
Next Story

షాకింగ్ న్యూస్.. 43 ఏళ్ల వయసులోనే కన్ను మూసిన ఇండియన్ ఐడల్ విన్నర్..

ఇండియన్ ఐడల్ సీజన్ 3 విజేతగా ఎంతో ఆదరణ పొందిన సింగర్ ప్రశాంత్ తమంగ్ కన్నుమూశాడు. 43 ఏళ్ల వయసులో ఆదివారం (జనవరి 11) అతడు తుది శ్వాస విడిచాడు. ఇది అభిమానులను షాక్‌కు గురి చేసింది.

Published on: Jan 11, 2026, 14:00:36 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

సంగీత ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ గాయకుడు, ఇండియన్ ఐడల్ సీజన్-3 విజేత ప్రశాంత్ తమాంగ్ (Prashant Tamang) కన్ను మూశాడు. ఆదివారం (జనవరి 11) ఉదయం గుండెపోటు రావడంతో అతడు మరణించాడు. కేవలం 43 ఏళ్ల వయసులో, అదీ కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమయంలో అతడు ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం అభిమానులను కలచివేస్తోంది. ప్రశాంత్ సన్నిహితుడు, మ్యూజిక్ కంపోజర్ రాజేష్ ఘటానీ ఈ విషాద వార్తను ధృవీకరించాడు.

షో చేసి ఇంటికొచ్చిన కాసేపటికే..

షాకింగ్ న్యూస్.. 43 ఏళ్ల వయసులోనే కన్ను మూసిన ఇండియన్ ఐడల్ విన్నర్..
షాకింగ్ న్యూస్.. 43 ఏళ్ల వయసులోనే కన్ను మూసిన ఇండియన్ ఐడల్ విన్నర్..

వివిధ రిపోర్టుల ప్రకారం.. ప్రశాంత్ తమాంగ్ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక లైవ్ షోలో పాల్గొన్నాడు. అక్కడి నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన తర్వాత, ఆదివారం ఉదయం తన నివాసంలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ద్వారకాలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అతనికి అంతకుముందు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని, ఇది ఆకస్మాత్తుగా జరిగిన ఘోరమని సన్నిహితులు చెబుతున్నారు.

పోలీస్ కానిస్టేబుల్ నుంచి పాప్ స్టార్ దాకా..

పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో 1983, జనవరి 4న జన్మించిన ప్రశాంత్ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. తండ్రి మరణం తర్వాత అతడు కోల్‌కతా పోలీసులో కానిస్టేబుల్‌గా చేరాడు. అక్కడ పోలీస్ ఆర్కెస్ట్రాలో పాటలు పాడుతూ తనలోని గాయకుడికి మెరుగుపెట్టాడు. 2007లో ‘ఇండియన్ ఐడల్ సీజన్ 3’లో పాల్గొని సంచలనం సృష్టించాడు. తన గాత్రంతో దేశ ప్రజలను మెప్పించి, ఏకంగా 7 కోట్ల ఓట్లు సాధించి విజేతగా నిలిచాడు. ఆ తర్వాత ‘ధన్యవాద్’ అనే ఆల్బమ్‌తో ఆకట్టుకున్నాడు. ‘మన్ సైన్లీ’, ‘గోర్ఖా పల్టన్’ వంటి పాటలు అతనికి మంచి పేరు తెచ్చాయి.

సల్మాన్ ఖాన్ సినిమాలోనూ..

కేవలం గాయకుడిగానే కాకుండా నటుడిగానూ ప్రశాంత్ తనదైన ముద్ర వేశాడు. పలు నేపాలీ చిత్రాల్లో నటించిన అతడు.. అమెజాన్ ప్రైమ్ హిట్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్ 2’ (Paatal Lok 2)లో డేనియల్ అచో అనే కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘బాటిల్ ఆఫ్ గల్వాన్’ (Battle of Galwan) సినిమాలోనూ ప్రశాంత్ నటిస్తున్నట్లు సమాచారం. ఇంతలోనే అతని మరణవార్త వినాల్సి రావడం బాధాకరం.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe