Flop Star: కెరీర్‌లో 180 మూవీస్ డిజాస్టర్.. 30 ఏళ్లుగా ఒక్క హిట్ కూడా లేదు.. ఇండియాలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ స్టార్ ఈయనే

Flop Star: ఇండియాలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ స్టార్ గా పేరుగాంచాడు బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి. ఆయన 50 ఏళ్ల కెరీర్లో ఏకంగా 180 సినిమాలు డిజాస్టర్ కాగా.. 45 అల్ట్రా డిజాస్టర్లుగా ఉన్నాయి. అయినా ఇప్పటికే ఇమేజ్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది.

Published on: Sep 2, 2026, 15:19:10 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Flop Star: ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక నటుడి సక్సెస్ గ్రాఫ్‌ను అతను సాధించే బాక్సాఫీస్ హిట్‌లే డిసైడ్ చేస్తాయి. వరుసగా ఫ్లాప్‌లు వస్తే ఏ స్టార్ హీరో కెరీర్ అయినా డేంజర్‌లో పడటం సహజం. కానీ ఇండియన్ సినిమాలో ఒక లెజెండరీ యాక్టర్ మాత్రం ఈ లాజిక్‌ను పూర్తిగా మార్చేశారు. ఏకంగా 50 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో 180 ఫ్లాప్ సినిమాలు ఇచ్చి ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌సక్సెస్‌ఫుల్ లీడ్ యాక్టర్‌గా నిలిచారు. ఆయనే బాలీవుడ్ డిస్కో డాన్సర్ మిథున్ చక్రవర్తి.

Flop Star: కెరీర్‌లో 180 మూవీస్ డిజాస్టర్.. 30 ఏళ్లుగా ఒక్క హిట్ కూడా లేదు.. ఇండియాలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ స్టార్ ఈయనే
Flop Star: కెరీర్‌లో 180 మూవీస్ డిజాస్టర్.. 30 ఏళ్లుగా ఒక్క హిట్ కూడా లేదు.. ఇండియాలోనే అతిపెద్ద ఫెయిల్యూర్ స్టార్ ఈయనే

నేషనల్ అవార్డుతో ఎంట్రీ.. 'డిస్కో డాన్సర్'తో గ్లోబల్ సెన్సేషన్

1976లో ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ తీసిన 'మృగయా' సినిమాతో మిథున్ చక్రవర్తి తన నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు. ఫస్ట్ సినిమాతోనే బెస్ట్ యాక్టర్‌గా నేషనల్ ఫిల్మ్ అవార్డు గెలుచుకుని అందరి దృష్టినీ ఆకర్షించారు. 1980ల ప్రారంభంలో 'షౌకీన్', 'అశాంతి' లాంటి హిట్‌లతో మంచి ట్రాక్ సాధించారు.

ఆ తర్వాత 1982లో వచ్చిన 'డిస్కో డాన్సర్' సినిమా మిథున్ కెరీర్‌నే మార్చేసింది. ఈ సినిమా ఇండియాలోనే కాకుండా రష్యాలో కూడా పెను సంచలనం క్రియేట్ చేసింది. 1985లో రష్యా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచి 'షోలే' రికార్డులను బద్దలు కొట్టింది. 1994 వరకు ఈ గ్లోబల్ రికార్డు చెక్కుచెదరకుండా ఉండిపోయింది.

ఏడాదికి 12 సినిమాలు.. క్వాలిటీ వదిలేసి..

1980ల చివర్లో స్టార్‌డమ్ పీక్స్‌లో ఉన్న సమయంలో మిథున్ చక్రవర్తి క్వాలిటీ కంటే క్వాంటిటీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతీ ఏటా 8 నుంచి 12 సినిమాలు ఒప్పుకుంటూ బిజీగా మారిపోయారు. దీంతో ఆయన నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా మిగిలిపోయాయి.

1990ల నాటికి కొత్త తరం హీరోలు బాలీవుడ్‌ను ఏలుతున్న టైమ్‌లో మిథున్ తక్కువ బడ్జెట్ యాక్షన్ సినిమాలను ఎంచుకున్నారు. కేవలం నెల రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసుకునే బి-గ్రేడ్ యాక్షన్ సినిమాలలో వరుసగా నటించారు. ఆ పదేళ్లలో ఆయన దాదాపు 100 సినిమాల్లో నటించగా, అందులో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.

30 ఏళ్లుగా సోలో హిట్ లేదు.. ధర్మేంద్ర, జితేంద్రలను మించిన రికార్డు

1995లో వచ్చిన 'రావణ్ రాజ్' సినిమానే హీరోగా మిథున్ చక్రవర్తి సాధించిన చివరి సోలో హిట్. అంటే గత 30 ఏళ్లలో ఆయన లీడ్ రోల్‌లో నటించిన ఏ సినిమా కూడా సోలో హిట్‌గా నిలవలేదు. ఇప్పటివరకు 270కి పైగా సినిమాల్లో నటించిన మిథున్, అందులో 180 ఫ్లాప్‌లు ఖాతాలో వేసుకున్నారు. ఇందులో 45 సినిమాలు అల్ట్రా డిజాస్టర్లు కావడం విశేషం.

బాలీవుడ్ దిగ్గజాలు ధర్మేంద్ర, జితేంద్ర లాంటి వారు కూడా మిథున్ ఫ్లాప్‌లలో సగం సంఖ్యను కూడా తాకలేకపోయారు. చాలామంది టాప్ స్టార్ల కెరీర్‌లో ఫ్లాప్‌ల సంఖ్య 50 దాటదు. కానీ మిథున్ మాత్రం 180 ఫ్లాప్‌లు ఉన్నప్పటికీ తనదైన క్రేజ్‌ను కాపాడుకోవడం ఒక విచిత్రమైన రికార్డ్.

72 ఏళ్ల వయసులో రూ.350 కోట్ల ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్

2000వ సంవత్సరం నుంచి మిథున్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ రోల్స్ వైపు రూట్ మార్చారు. బిగ్ బడ్జెట్ సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరించారు.

ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ కంబ్యాక్ 2022లో వచ్చింది. 72 ఏళ్ల వయసులో వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో వచ్చిన 'ది కశ్మీర్ ఫైల్స్' సినిమాలో మిథున్ కీలక పాత్రలో నటించారు. ఈ స్లీపర్ హిట్ సినిమా వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.350 కోట్ల కలెక్షన్లు సాధించి మిథున్ చక్రవర్తి కెరీర్‌లోనే హైయెస్ట్ గ్రాసర్‌గా చరిత్ర సృష్టించింది. 180 ఫ్లాప్‌లు ఉన్నా సరే ప్రేక్షకుల గుండెల్లో లెజెండరీ నటుడిగా ఆయన స్థానం చెక్కుచెదరలేదు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More