వీడియోలో దొరికిన ప్రేమ పక్షులు.. ఫారెన్ టూర్‌లో అనిరుధ్, కావ్య మారన్.. లవ్ కన్ఫామ్ చేసినట్లేనా? వీడియో వైరల్
కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ రిలేషన్ షిప్ కన్ఫాయి అయినట్లేనా? ఈ ఇద్దరూ ఫారెన్ టూర్ లో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.
సెన్సేషనల్ మ్యూజిక్ డైెరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓనర్ కావ్య మారన్ రిలేషన్ షిప్ పై క్లారిటీ వచ్చేసిట్లేనా? వీళ్ల లవ్ పుకార్లు నిజమేనా? ఇప్పుడు నెటిజన్లు ఈ విషయం గురించే డిస్కస్ చేస్తున్నారు. అనిరుధ్, కావ్య జంటగా ఫారెన్ ట్రిప్ లో కనిపించడమే ఇందుకు కారణం. అనిరుధ్, కావ్యతో పాటు మరో అమ్మాయి కనిపించినట్లుగా ఉన్న వీడియో వైరల్ గా మారింది.

కావ్య, అనిరుధ్ లవ్
గత కొంతకాలంగా అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ల రిలేషన్ షిప్ పై పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీళ్లిద్దరు లవ్ లో ఉన్నారనే రూమర్లు వేగంగా వ్యాప్తి చెందాయి. అనిరుధ్, కావ్య పెళ్లి చేసుకుంటారనే వార్తలూ వచ్చాయి. గతంలో అనిరుధ్ ఈ వార్తలను ఖండించాడు. కానీ ఇప్పుడు ఈ జోడీ ఫారెన్ టూర్ లో ఎంజాయ్ చేస్తున్నారనే వీడియో హల్చల్ చేస్తోంది. దీంతో వీళ్లు లవ్ లో ఉన్నారనేది నిజమేననే కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైరల్ వీడియో
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ ప్లేస్ లో ఎవరో వ్లాగర్ వీడియో తీస్తూ వెళ్తున్నారు. అటు వైపు నుంచి కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్, మరో అమ్మాయి నడుచుకుంటూ వస్తున్నట్లు కనిపించారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోలో ఉన్నది తామేనని కానీ, తమ రిలేషన్ షిప్ పై కానీ కావ్య, అనిరుధ్ లో ఎవరూ రియాక్టవలేదు. ఈ వీడియో ఎక్కడ తీశారన్నది కూడా క్లారిటీ లేదు. న్యూయార్క్ అని, యూకే అని అంటున్నారు.
రూమర్లు స్ప్రెడ్ చేయొద్దంటూ
ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ గతంలో కావ్య మారన్ ను వివాహం చేసుకోబోతున్నాడని వచ్చిన వార్తలను ఖండించాడు. అనిరుధ్, కావ్య రిలేషన్ షిప్ లో ఉన్నారని, పెళ్లి చేసుకోవాలని యోచిస్తున్నారని రెడ్డిట్ పోస్ట్ పేర్కొన్న తరువాత ఈ ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో త్వరగా అట్రాక్షన్ గా మారిన ఈ పోస్ట్ లో రజనీకాంత్.. కళానిధి మారన్ తో వ్యక్తిగతంగా ఈ సంబంధం గురించి మాట్లాడారని పేర్కొంది. అయితే దీన్ని అనిరుధ్ ఖండించాడు.
"వివాహం ఆహ్? లాల్.. గాయ్స్ చిల్. దయచేసి పుకార్లను వ్యాప్తి చేయడం ఆపండి" అని ఎక్స్ లో జూన్ లో పోస్టు చేశాడు. ఓ వైపు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో అనిరుధ్ దూకుడు కొనసాగిస్తున్నాడు. మరోవైపు ఐపీఎల్ టైమ్ లో సన్ రైజర్స్ టీమ్ మ్యాచ్ లప్పుడు కావ్య పాప రియాక్షన్స్ వైరల్ గా మారుతూనే ఉంటాయని తెలిసిందే.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


