హేమ మాలిని, మీనా కుమారి కాదు.. ధర్మేంద్ర ఫస్ట్ లవ్ ఈమెనే.. దేశ విభజనతో విడిపోయిన ఆ విషాద ప్రేమకథ మీకు తెలుసా?

బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మొదటి ప్రేయసి గురించి ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆయన తొలి ప్రేమ భారత్, పాకిస్థాన్ విభజన కారణంగా విషాదంగా మిగిలిపోయింది. ఆ కథ ఏమిటో ఇక్కడ చూసేయండి. 

Published on: Nov 12, 2025, 06:01:02 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రముఖ నటుడు ధర్మేంద్ర ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది హృదయాలను ఏలుతూనే ఉన్నారు. కానీ ఆయన మొదటి ప్రేమ ఎవరని ఎప్పుడైనా ఆలోచించారా? ఆమె మీనా కుమారి కాదు, మొదటి భార్య ప్రకాష్ కౌర్ లేదా రెండో భార్య హేమ మాలిని కూడా కాదు. 1947లో జరిగిన భారత్-పాకిస్థాన్ విభజన తర్వాత తాను కోల్పోయిన తన చిన్ననాటి క్రష్ గురించి 'షోలే' నటుడు ఒకసారి పంచుకున్నారు.

ధర్మేంద్ర ఫస్ట్ లవ్ (Reddit/ X)
ధర్మేంద్ర ఫస్ట్ లవ్ (Reddit/ X)

ధర్మేంద్ర ఫస్ట్ లవ్

సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన 'దస్ కా దమ్' షోలో ధర్మేంద్ర గతంలో తన ఫస్ట్ లవ్ హమీదా గురించి పంచుకున్నారు. బాబీ డియోల్‌తో కలిసి ఈ షోలో పాల్గొన్న ధర్మేంద్ర.. పంజాబ్‌లో తన పాఠశాల రోజులను గుర్తుచేసుకున్నారు. అప్పుడు తన టీచర్ కూతురు హమీదా ప్రేమలో పడ్డారు. అయితే హమీదా ఆయన కంటే వయసులో పెద్దది. వారి అమాయక ప్రేమ ధర్మేంద్ర 6వ తరగతిలో ఉన్నప్పుడు మొదలైంది. అప్పుడు హమీదా 8వ తరగతి చదువుతోంది.

మనసులోనే

హమీదాను చూసి తాను ఎంతగా మంత్రముగ్ధుడనయ్యానో ప్రముఖ నటుడు ధర్మేంద్ర వెల్లడించారు. ఆమె చదువులో సహాయం చేస్తుంటే ధర్మేంద్ర ఆమె వైపు చూడటానికి కూడా సంకోచించేవారట. "మేము మా మనసులోనే చెప్పుకునేవాళ్లం. చల్లని నిట్టూర్పులు విడుస్తూ ఉండేవాళ్లం. ఎదుటివారికి ఈ విషయం అస్సలు తెలియదు" అని తన ప్రేమ గురించి ధర్మేంద్ర పంచుకున్నారు. బాబీ డియోల్ ఒక 'చాలా అందమైన అమ్మాయి' కోసం ధర్మేంద్ర రాసిన ఒక ప్రత్యేక కవిత గురించి అడిగినప్పుడు, ధర్మేంద్ర దానిని కేవలం ఆకర్షణ అని అన్నారు.

ప్రేమ కవిత

"మై ఛోటా థా, మాసూమ్ థీ ఉమర్ మేరీ. వో క్యా థీ, పతా నహీ. పాస్ జానే కో జిస్కే, సాథ్ బైఠ్నే కో జిస్కే జీ చాహ్తా థా. వో తాలిబా థీ ఆఠ్వీ కీ, మై ఛఠీ కా థా. హమారే స్కూల్ టీచర్ కీ బేటీ థీ, నామ్ హమీదా థా (నేను చిన్నవాడిని, నా వయసు అమాయకమైనది. ఆమె నాకేమవుతుందో నాకు తెలియదు. కానీ ఆమె దగ్గరికి వెళ్లాలని, ఆమె పక్కన కూర్చోవాలని నా మనసు కోరుకునేది. ఆమె ఎనిమిదో తరగతి విద్యార్థిని, నేను ఆరో తరగతి. ఆమె మా స్కూల్ టీచర్ కూతురు—ఆమె పేరు హమీదా)" అంటూ ఆమె కోసం రాసిన కవితను కూడా ధర్మేంద్ర పంచుకున్నారు.

"యూహీ ముస్కురా దేతీ, మై పాస్ చలా జాతా. వో ఖామోష్ రెహతీ, మై సర్ ఝుకా దేతా. వో పూఛ్తీ కుఛ్ ఔర్ థీ, మై కెహ్ కుఛ్ ఔర్ జాతా థా. (ఆమె మెల్లగా నవ్వేది, నేను దగ్గరికి వెళ్లేవాడిని. ఆమె నిశ్శబ్దంగా ఉండేది, నేను తల దించుకునేవాడిని. ఆమె ఒకటి అడిగితే, నేను మరొకటి చెప్పేవాడిని)’’ అని ధర్మేంద్ర ప్రేమ కవిత రాశారు.

హమీదాకు ఏమైంది?

భారత్, పాకిస్థాన్ విభజన కారణంగా ధర్మేంద్ర ప్రేమ కథకు ఎండ్ కార్డు పడింది. "పాకిస్థాన్ బన్ గయా, హమీదా చలీ గయీ (పాకిస్థాన్ ఏర్పడిన తర్వాత హమీదా భారతదేశం విడిచి వెళ్లిపోయింది)" అని ధర్మేంద్ర వెల్లడించారు. ధర్మేంద్ర మళ్లీ హమీదాను ఎప్పుడూ చూడలేదు. అయితే ఆమె జ్ఞాపకాలు తన అమాయక ప్రేమను గుర్తుచేస్తాయని ఆయన అన్నారు.

ధర్మేంద్ర హెల్త్ అప్ డేట్

ముంబయిలోని ఓ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న ధర్మేంద్ర చనిపోయారనే వార్తలు వచ్చాయి. అయితే వీటిని కుటుంబ సభ్యులు ఖండించారు. ధర్మేంద్ర చాలా కాలంగా ముంబైలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబ సభ్యుల ప్రకారం ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారు. ధర్మేంద్రను చూసేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఆసుపత్రికి క్యూ కట్టారు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More