టైటిల్: ఇట్లు మీ ఎదవ

నటీనటులు: త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్ తదితరులు
రచన, దర్శకత్వం: త్రినాధ్ కటారి
సంగీతం: ఆర్పీ పట్నాయక్
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి
ఎడిటింగ్: ఉద్ధవ్ ఎస్‌బీ
బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్
నిర్మాత: బళ్లారి శంకర్
విడుదల తేది: 21 నవంబర్ 2025
తెలుగులో వచ్చిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ ఇట్లు మీ ఎదవ. త్రినాధ్ కటారి హీరోగా, స్వీయ దర్శకత్వం వహించిన ఇట్లు మీ ఎదవ మూవీలో సాహితీ అవాంచ హీరోయిన్‌గా చేసింది.
థియేటర్లలో ఇవాళ (నవంబర్ 21) విడుదలైన ఇట్లు మీ ఎదవ ప్రీమియర్స్ ఒకరోజు ముందుగానే పడిపోయాయి. వెయ్యేళ్లు వర్ధిళ్లు అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో నేటి ఇట్లు మీ ఎదవ రివ్యూలో తెలుసుకుందాం.
కథ:
ఆవారాగా తిరిగే శ్రీను (త్రినాధ్ కఠారి) ఆరేళ్లుగా పీజీ చేస్తూనే ఉంటాడు. తన కాలేజీలో చేరిన మనస్విని (సాహితీ అవాంచ)ను చూసి లవ్‌లో పడతాడు. తన బిహేవియర్ మార్చుకుని మనస్విని ప్రేమ పొందుతాడు. కొడుకు మార్పు చూసిన శ్రీను తండ్రి (గోపరాజు రమణ) ప్రేమించిన అమ్మాయితోనే పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకుంటాడు.
అందుకు మనస్విని తండ్రి (దేవి ప్రసాద్)తో సంబంధం మాట్లాడేందుకు శ్రీను తండ్రి వెళ్తాడు. అక్కడ శ్రీను ఎదవ ప్రవర్తన తెలిసి తిరస్కరిస్తాడు మనస్విని తండ్రి. ఈ విషయం డాక్టర్ (తనికెళ్ల భరణి) దగ్గరికి వెళ్తుంది. దాంతో 30 రోజులు శ్రీనును మనస్విని తండ్రితో ఉండాలని, ఈ టైమ్‌లో శ్రీను నిజంగా ఎదవ అని తేలితే ప్రేమను వదులుకోవాలని ఛాలేంజ్ చేస్తాడు డాక్టర్.
ఆ ఛాలెంజ్‌కు అంతా ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? ప్రేమించిన అమ్మాయి తండ్రితో 30 రోజులు శ్రీను ఎలా గడిపాడు? తన ప్రేమను నిరూపించుకున్నాడా? శ్రీను ఎదవ అనే తేలిందా? మరి వీరి ప్రేమ ఏమైంది? అనేది తెలియాలంటే ఇట్లు మీ ఎదవ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఆ ఛాలెంజ్‌కు అంతా ఒప్పుకుంటారు. ఆ తర్వాత ఏమైంది? ప్రేమించిన అమ్మాయి తండ్రితో 30 రోజులు శ్రీను ఎలా గడిపాడు? తన ప్రేమను నిరూపించుకున్నాడా? శ్రీను ఎదవ అనే తేలిందా? మరి వీరి ప్రేమ ఏమైంది? అనేది తెలియాలంటే ఇట్లు మీ ఎదవ మూవీ చూడాల్సిందే.
విశ్లేషణ:
{{/usCountry}}ఇట్లు మీ ఎదవ మూవీ కథ కాస్తా బొమ్మరిల్లు సినిమాను తలపిస్తుంది. అయితే, ఇక్కడ హీరోయిన్ తండ్రితో హీరో ఉంటాడు. రెగ్యులర్ స్టోరీని కామెడీతో వడ్డించారు డైరెక్టర్ అండ్ హీరో. ఫస్టాఫ్ అంతా కాలేజ్, లవ్ సీన్స్, హీరోయిన్ హీరో లవ్ ఒప్పుకోవడంతో సాగిపోతుంది.
ఇంటర్వెల్ దగ్గర వచ్చే 30 రోజుల ఛాలెంజ్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక సెకండాఫ్ కథ ఏంటో తెలిసినప్పటికి సన్నివేశాలు ఎలా ఉంటాయనే ఆసక్తి అయితే ప్రేక్షకుడిలో మెదులుతాయి. దానికి తగినట్లుగానే సీన్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల అనవసరంగా అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ తండ్రి ట్రాక్ బాగానే మలిచారు.
ఊహించని క్లైమాక్స్
ఎమోషనల్‌గా వర్కౌట్ అయింది. ఊహించని విధంగా క్లైమాక్స్ ఉండి సర్‌ప్రైజ్ చేస్తుంది. కథకు భిన్నంగా క్లైమాక్స్ డిజైన్ చేయడం మూవీకి ప్లస్ పాయింట్‌లా, హైలెట్‌గా నిలిచింది. కామెడీ ట్రాక్ బాగుంది. హీరోగా ఎదవ పాత్రలో త్రినాధ్ మెప్పించాడు. దర్శుకుడిగా ఇంకాస్తా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది.
ఫైనల్‌గా చెప్పాలంటే
హీరోయిన్ సాహితీ అవాంచ పర్వాలేదు. మిగతా పాత్రలు తమ అనుభవంతో ఆకట్టుకన్నారు. సినిమా నిర్మాణ విలువలు బాగున్నాయి. విజువల్స్, ఎడిటింగ్ ఓకే. సంగీతం, బీజీఎమ్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే ఎదవల కామెడీ పండించి చివరికి మెసేజ్ ఇచ్చే ఇట్లు మీ ఎదవ.