Janhvi Kapoor: పెద్ద రౌడీ డైరెక్టర్.. పైకి కనిపించేంత అమాయకుడు కాడు.. నాతో అలా చేయించాడు: బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్

Janhvi Kapoor: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కాంబినేషన్‌లో వస్తున్న క్రేజీ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' ట్రైలర్ ముంబైలో గ్రాండ్‌గా విడుదలైంది. ఈ వేడుకలో దర్శకుడు బుచ్చిబాబు సానాపై, తన పాత్రపై జాన్వీ కపూర్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published on: May 18, 2026, 18:55:40 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Janhvi Kapoor: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా చిత్రం 'పెద్ది'. ఈ సినిమాపై టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను చిత్రయూనిట్ ముంబైలో ఘనంగా విడుదల చేసింది. ఈ వేడుకలో మాట్లాడిన హీరోయిన్ జాన్వీ కపూర్.. తన పాత్ర గురించి, రామ్ చరణ్‌తో ఉన్న అనుబంధం గురించి పంచుకున్న విశేషాలు అభిమానులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

Janhvi Kapoor: పెద్ద రౌడీ డైరెక్టర్.. పైకి కనిపించేంత అమాయకుడు కాడు.. నాతో అలా చేయించాడు: బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్
Janhvi Kapoor: పెద్ద రౌడీ డైరెక్టర్.. పైకి కనిపించేంత అమాయకుడు కాడు.. నాతో అలా చేయించాడు: బుచ్చిబాబుపై జాన్వీ కామెంట్స్

చిరంజీవి-శ్రీదేవి మ్యాజిక్ రిపీట్ అవుతుంది

తాను ముంబైలో ఉంటున్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాలే తన సొంత ఇల్లు అని జాన్వీ కపూర్ భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లి, అతిలోక సుందరి శ్రీదేవి, మెగాస్టార్ చిరంజీవి స్క్రీన్ కాంబినేషన్ తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయిందని గుర్తు చేశారు. 'జగదేకవీరుడు అతిలోకసుందరి' వంటి క్లాసిక్ చిత్రాల తర్వాత, మళ్లీ వారి వారసులుగా రామ్ చరణ్, తాను కలిసి నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అనుబంధం, అంచనాలు ఏర్పడ్డాయని ఆమె పేర్కొన్నారు.

"మా ఇద్దరి కలయిక వెనుక ఒక దైవిక బంధం (కాస్మిక్ కనెక్షన్) ఉన్నట్లు అనిపిస్తోంది. రామ్ చరణ్ చాలా అద్భుతమైన వ్యక్తి. ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవడం నా అదృష్టం" అని రామ్ చరణ్‌పై జాన్వీ ప్రశంసల వర్షం కురిపించారు.

బుచ్చిబాబు చాలా 'రౌడీ' డైరెక్టర్

పెద్ది మూవీ దర్శకుడు బుచ్చిబాబు సానా గురించి జాన్వీ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. పైకి చాలా అమాయకంగా కనిపించే బుచ్చిబాబు, నిజానికి ఇండియాలోనే మోస్ట్ రౌడీ డైరెక్టర్ అని సరదాగా వ్యాఖ్యానించారు.

"గత రెండేళ్లుగా మేము ఈ సినిమా కోసం కలిసి పనిచేస్తున్నాం. బుచ్చిబాబు నన్ను చాలా విషయాల్లో మార్చేశారు. ఆయన నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయారు. రోజూ కనీసం ఒక్కసారైనా ఆయనతో మాట్లాడి సోది వేయకపోతే నాకు రోజు గడవదు. సినిమా కోసం ఆయన పడే తపన అలాంటిది. పైకి అమాయకంగా కనిపిస్తాడు కానీ ఇండియాలోనే చాలా పెద్ద రౌడీ డైరెక్టర్ అతడు" అని చిత్ర దర్శకుడితో తనకున్న బాండింగ్‌ను పంచుకున్నారు.

నా నటనకు ఆయనే బాధ్యుడు

ఈ సినిమాలో తాను 'అచ్చియమ్మ' అనే ఎంతో వైవిధ్యమైన, మాస్ ఎనర్జీ ఉన్న పాత్రను పోషించానని జాన్వీ చెప్పారు. ఇంతవరకు తాను ఇంత కలర్‌ఫుల్ రోల్ ఎప్పుడూ చేయలేదన్నారు.

"బుచ్చిబాబు గారు చెప్పిన నమ్మకాన్ని నేను బ్లైండ్‌గా ఫాలో అయిపోయాను. నాలుక ఇలా తిప్పు, లంగా ఇలా పట్టుకో, ఇలా మాట్లాడు అని చాలా విభిన్నమైన డైరెక్షన్ ఇచ్చేవారు. ఈ క్యారెక్టర్ మేనరిజమ్స్ చాలా కొత్తగా, అల్లరిగా ఉంటాయి" అని తెలిపారు.

అక్కడే ఉన్న రివ్యూయర్లను ఉద్దేశించి నవ్వుతూ.. "సినిమా చూశాక నా నటన బాగున్నా, బాలేకపోయినా క్రెడిట్ మొత్తం బుచ్చిబాబుకే ఇవ్వండి. ఆయన్నే తిట్టండి లేదా పొగడండి" అని జోక్ చేశారు.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

ప్రశ్న: 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన నటిస్తున్న హీరోయిన్ ఎవరు?

జవాబు: 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ నటి, శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె 'అచ్చియమ్మ' అనే విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు.

ప్రశ్న: 'పెద్ది' చిత్ర దర్శకుడు ఎవరు?

జవాబు: 'ఉప్పెన' సినిమాతో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇది రామ్ చరణ్ కెరీర్‌లోనే ఒక వైవిధ్యమైన స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది.

ప్రశ్న: 'పెద్ది' సినిమా ఎప్పుడు విడుదలవుతోంది?

జవాబు: రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించిన 'పెద్ది' చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More