Ram Charan: నా చెయ్యి బాగానే ఉంది.. ఇది బుచ్చి ఇచ్చిన గిఫ్ట్.. మంచి జ్ఞాపకం.. తన గుర్తింపు కోసం పెద్ది చేసే జర్నీ: చరణ్

Ram Charan: రామ్ చరణ్ పెద్ది మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన చేతికి పట్టీ ఉండటం చూసి ఏమైందని అడిగిన అభిమానులకు తాను బాగానే ఉన్నానని చెప్పాడు. ఇది బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ అని సరదాగా చెప్పాడు.

Published on: May 18, 2026, 17:45:01 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటించిన పెద్ది మూవీ ట్రైలర్ సోమవారం (మే 18) రిలీజైన విషయం తెలిసిందే. ఇందులో ఓ క్రికెటర్, రెజ్లర్, రన్నర్ పాత్రల్లో కనిపించిన చరణ్.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Ram Charan: నా చెయ్యి బాగానే ఉంది.. ఇది బుచ్చి ఇచ్చిన గిఫ్ట్.. మంచి జ్ఞాపకం.. తన గుర్తింపు కోసం పెద్ది చేసే జర్నీ: చరణ్
Ram Charan: నా చెయ్యి బాగానే ఉంది.. ఇది బుచ్చి ఇచ్చిన గిఫ్ట్.. మంచి జ్ఞాపకం.. తన గుర్తింపు కోసం పెద్ది చేసే జర్నీ: చరణ్

ఇది బుచ్చి ఇచ్చిన గిఫ్ట్

పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతుండగా.. అతని చేతికి తగిలిన గాయం గురించి అభిమానులు అడిగారు. దీనికి చరణ్ స్పందిస్తూ.. “నా చేయి బాగానే ఉంది. ఇది బుచ్చిబాబు ఇచ్చిన చిన్న గిఫ్ట్. చివరి 25, 30 రోజులుగా కుస్తీ షూటింగ్ చేస్తున్నాం. పెహల్వాన్ లు షూటింగ్ సమయంలో చాలా గట్టిగా చేయి పట్టుకున్నారు. దీంతో కాస్త గాయమైంది. ఇది పెద్ది ఇచ్చిన ఓ మరుపురాని జ్ఙాపకం” అని చరణ్ అనడం విశేషం.

సల్మాన్, ఆమిర్‌లకు థ్యాంక్స్

ఇక పెద్ది సినిమా కోసం తాను చేసిన బాడీ ట్రాన్స్‌ఫార్మేషన్ గురించి కూడా చరణ్ స్పందించాడు. ఈ సందర్భంగా సుల్తాన్, దంగల్ వంటి రెజ్లింగ్ నేపథ్యంలో సాగే సినిమాలను ఇచ్చిన సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ లకు అతడు థ్యాంక్స్ చెప్పాడు. ఇలాంటి సినిమాలు చేసేందుకు తమలాంటి వాళ్లకు వాళ్లే ఓ దారి చూపించారని అతడు అనడం విశేషం. అయితే ఇది అంత సులువుగా జరగలేదని, చాలా కష్టపడాల్సి వచ్చిందని, చాలా గాయాలు కూడా అయ్యాయని చరణ్ తెలిపాడు.

తన గుర్తింపు కోసం చేసే ప్రయాణం

ఇక పెద్ది మూవీ స్టోరీ గురించి కూడా చరణ్ రివీల్ చేశాడు. తాను రెండేళ్లుగా పడిన కష్టమంతా బుచ్చిబాబు రాసిన కథ ముందు చిన్నదే అని అన్నాడు. ఈ సినిమా పెద్ది అనే వ్యక్తి తన గుర్తింపు కోసం సాగించే ప్రయాణం చుట్టూ తిరుగుతుందని తెలిపాడు. ప్రతి ఒక్కరికీ ఓ గుర్తింపు ఉండాలని కోరుకుంటారని, పెద్ది కూడా అలాంటివాడే అని, ఈ సినిమాలో అతడు ఎందుకు ఓ క్రాస్ ఓవర్ అథ్లెట్ గా మారాడో చూడొచ్చని రామ్ చరణ్ అన్నాడు.

ఇంత శ్రద్ధ ఉన్న వ్యక్తిని చూడలేదు

పెద్ది మూవీలో హీరోయిన్ గా చేసిన జాన్వీ కపూర్ పైనా చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జీవితంలో ఇంత శ్రద్ధ ఉన్న వ్యక్తిని చూడలేదని, ముంబైలో ఉంటూనే మూవీలో ప్రతి సీన్ ను పక్కాగా రిహార్స్ చేసేదని చరణ్ చెప్పాడు. చివరి రోజు ఓ పాట షూటింగ్ చేశామని, అందులో తనకంటే జాన్వీయే బాగా చేసిందని అనడం విశేషం.

పెద్ది ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగిన విషయం తెలిసిందే. ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కానుండగా.. మే 23న మధ్యప్రదేశ్ లో మరో మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More