Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్‌గా అదరగొట్టేసిన రామ్ చరణ్.. గూస్‌బంప్స్ గ్యారెంటీ
Peddi Trailer: పెద్ది ట్రైలర్ వచ్చేసింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా నుంచి వచ్చిన ఈ ట్రైలర్ అదిరిపోయేలా ఉంది. జూన్ 4న మూవీ థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Peddi Trailer: రామ్ చరణ్ పెద్ది మూవీ ట్రైలర్ వచ్చేసింది. 3 నిమిషాలకుపైగా ఉన్న ఈ ట్రైలర్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఓ క్రికెటర్ గా, రెజ్లర్ గా, రన్నర్ గా చరణ్ ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఆటే నా పొగరు అంటూ ఎంట్రీ ఇచ్చిన అతడు.. ట్రైలర్ మొత్తం అదరగొట్టాడు.

పెద్ది ట్రైలర్ ఎలా ఉందంటే?
పెద్ది ట్రైలర్ సోమవారం (మే 18) సాయంత్రం 4.05 గంటలకు రిలీజ్ అయింది. ముంబైలో జరిగిన ఓ స్పెషల్ ఈవెంట్ లో ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు. అభిమానుల అంచనాలకు తగినట్లుగానే ఈ ట్రైలర్ సాగింది. ఇప్పటి వరకూ ఈ మూవీలో చరణ్ కు సంబంధించి క్రికెటర్, రెజ్లర్ లుక్స్ రిలీజ్ కాగా.. తాజా ట్రైలర్ లో అతన్ని ఓ రన్నర్ గానూ చూపించారు.
ఇక చరణ్ తోపాటు ఈ ట్రైలర్ లో జాన్వీ కపూర్, జగపతి బాబు, శివరాజ్‌కుమార్, విలన్ గా వస్తున్న దివ్యేందు శర్మ పాత్రలను కూడా చూపించారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తోపాటు ఎమోషనల్ గానూ ఈ ట్రైలర్ సాగింది.
ఇక్కడ ఏ కుర్రాడిని అడిగినా ఫేవరెట్ ప్లే మారుతుంది కానీ.. ఫేవరెట్ ప్లేయర్ మారడం లేదు అని చెప్పే బొమన్ ఇరానీ డైలాగుతో ట్రైలర్లో చరణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ కుర్రాళ్లకు పెద్ది గుళ్లో దేవుడు కాదు.. గ్రౌండ్ లో దేవుడు అనే మరో పవర్‌ఫుల్ డైలాగ్ కూడా ఇందులో ఉంది.
ఆటే నా పొగరు
ఇక చరణ్ నోట ఈ ట్రైలర్లో వినిపించిన తొలి డైలాగ్ ఆటే నా పొగరు. క్రికెట్, రెజ్లింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ పై చరణ్ చేసే విన్యాసాలు ఈ ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. మాటలతో కాదు.. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను అనే మరో డైలాగ్ కూడా చరణ్ నోట వినిపించింది.
నేను ఆడాననుకుంటున్నాను.. పోరాడాను సారూ అనే మరో డైలాగ్ కూడా ఆకట్టుకుంది. ఈ ట్రైలర్ ద్వారా మూవీ స్టోరీని పెద్దగా రివీల్ చేయలేదు. అయితే ఇందులో ఢిల్లీ వీధుల్లోనూ పెద్ది కూలీనాలీ చేసుకుంటూ కనిపించడం ఆసక్తి రేపుతోంది.
చిరంజీవి లీక్
నిజానికి అంతకుముందే ఈ పెద్ది మూవీ ట్రైలర్ చూసి ఓ డైలాగ్ కూడా లీక్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. 3 నిమిషాల ఫైర్ పవర్ అంటూ ఆకాశానికెత్తారు. "పెద్ది ట్రైలర్ చూశాను. జస్ట్ వావ్! 3 నిమిషాల ప్యూర్ ఫైర్‌పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ఇది. చరణ్, బుచ్చిబాబు, రెహమాన్.. ఒక్కొక్కరు తమ బెస్ట్ ఇచ్చారు. అందరూ కలిసి రఫ్ఫాడించేశారు. మీరు ఎంత ఊహించుకున్నా, ఈ ట్రైలర్ ఆ అంచనాలను మించి ఉంటుంది. ఎమోషన్, ఎలివేషన్, మ్యాడ్నెస్.. అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి," అంటూ చిరంజీవి ప్రశంసల జల్లు కురిపించారు.
పెద్ది రిలీజ్ డేట్
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పల్లెటూరి నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆస్కార్ అవార్డు విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి అద్భుతమైన మ్యూజిక్ అందించారు. పలు భారతీయ భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'పెద్ది' సినిమా జూన్ 4, 2026 నుంచి థియేటర్లలో ఆడియన్స్ తో కేకలు పెట్టించనుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


