Sign in

Ram Charan: రామ్ చరణ్ లాంగ్ హెయిర్ లుక్ వైరల్.. గ్లోబల్ స్టార్ చేతికి అసలు ఏమైంది?

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతికి సపోర్ట్ బ్రేస్ (రిస్ట్ బ్యాండేజ్) కట్టుకుని ముంబైలో కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన చేతికి గాయమైందా అంటూ మెగా అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Published on: May 16, 2026, 11:26:26 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Ram Charan: ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కుడి చేతికి రిస్ట్ బ్యాండేజ్ ధరించి కనిపించడం ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చరణ్ తన తదుపరి పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' సినిమా ప్రమోషన్స్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ముంబైలో సందడి చేశారు.

Ram Charan: రామ్ చరణ్ లాంగ్ హెయిర్ లుక్ వైరల్.. గ్లోబల్ స్టార్ చేతికి అసలు ఏమైంది?
Ram Charan: రామ్ చరణ్ లాంగ్ హెయిర్ లుక్ వైరల్.. గ్లోబల్ స్టార్ చేతికి అసలు ఏమైంది?

కొత్త లుక్‌లో రామ్ చరణ్

ముంబైలోని బాంద్రాలో ఉన్న ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలిమ్ సెలూన్‌కు రామ్ చరణ్ వెళ్లారు. అక్కడ తన సరికొత్త మేకోవర్ పూర్తి చేసుకుని బయటకు వస్తుండగా మీడియా కంటికి చిక్కారు. ఎప్పటిలాగే ఎంతో స్టైలిష్ లుక్‌లో మెరిసిపోయిన చరణ్.. అక్కడ వేచి ఉన్న మీడియా ప్రతినిధులను, ఫోటోగ్రాఫర్లను నవ్వుతూ పలకరించారు.

కెమెరాలకు చేతులెత్తి అభివాదం చేశారు. అయితే ఆ సమయంలో అందరి దృష్టి ఆయన కుడి చేతి మణికట్టుపైకి వెళ్లింది. చరణ్ కుడి చేతికి గట్టిగా హ్యాండ్ సపోర్ట్ బ్రేస్ కట్టుకుని ఉండటాన్ని మీడియా కెమెరాలు క్లిక్ మనిపించాయి.

ఈ విజువల్స్ కాస్తా సోషల్ మీడియాలోకి రావడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి. దీంతో మెగా అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గ్లోబల్ స్టార్ చేతికి ఏమైంది? షూటింగ్‌లో ఏమైనా ప్రమాదం జరిగిందా? అంటూ ఎక్స్, ఇన్ స్టాగ్రామ్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడం మొదలుపెట్టారు. చరణ్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

గాయం చిన్నదే

పెద్ది మూవీ యూనిట్, సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. అభిమానులు కంగారుపడాల్సిన పనిలేదు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పెద్ది' సినిమాకు సంబంధించిన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో చరణ్ కుడి చేతి మణికట్టుకు చిన్నపాటి నరాల నొప్సి లేదా చిన్న గాయం అయింది.

అంతకు మించి ఎలాంటి పెద్ద ప్రమాదం జరగలేదని తెలుస్తోంది. నొప్పి మరింత ఎక్కువ కాకుండా, త్వరగా కోలుకోవడానికి ముందుజాగ్రత్త చర్యగా మాత్రమే వైద్యుల సలహా మేరకు ఆయన ఈ సపోర్ట్ బ్యాండేజ్ ధరించారని సమాచారం.

ఈ చిన్న గాయం వల్ల 'పెద్ది' సినిమా షెడ్యూల్స్‌కు ఎలాంటి ఆటంకం కలగడం లేదు. మే 18న ముంబైలో జరగబోయే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో రామ్ చరణ్ పూర్తి ఎనర్జీతో పాల్గొనబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)

ప్రశ్న: ముంబైలో రామ్ చరణ్ చేతికి ఎందుకు పట్టీ కనిపించింది?

జవాబు: రామ్ చరణ్ కుడి చేతి మణికట్టుకు ఒక చిన్న గాయం అయింది. ఆ నొప్పి పెరగకుండా, మణికట్టుకు విశ్రాంతినిచ్చేందుకు డాక్టర్ల సూచనతో ఆయన హ్యాండ్ సపోర్ట్ బ్రేస్ ధరించారు. పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదు.

ప్రశ్న: చరణ్ ముంబైకి ఎందుకు వెళ్లారు? అక్కడ ఎవరిని కలిశారు?

జవాబు: చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లారు. అక్కడ బాలీవుడ్ స్టార్ హెయిర్ స్టైలిస్ట్ హకీమ్ ఆలిమ్ సెలూన్‌ను సందర్శించి, కొత్త మేకోవర్ తీసుకున్నారు.

ప్రశ్న: రామ్ చరణ్ కొత్త సినిమా 'పెద్ది' ఎప్పుడు విడుదలవుతుంది?

జవాబు: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో, ఏఆర్ రెహమాన్ సంగీతంలో వస్తున్న 'పెద్ది' సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను మే 18న ముంబైలో విడుదల చేయనున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More