Shefali Shah: పిల్లలను కనే కంటే కుక్కలను పెంచుకోవడం బెటర్.. పెళ్లి ఆలోచించి చేసుకోండి: బాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Shefali Shah: బాలీవుడ్ సీనియర్ నటి షెఫాలీ షా పెళ్లి, పిల్లలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. పిల్లలను కనడం కంటే కుక్కులను పెంచుకోవడం బెటర్ అని ఆమె అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఆమె ఎందుకు ఈ కామెంట్స్ చేసిందో చూడండి.
Shefali Shah: విలక్షణ నటిగా పేరుగాంచిన షెఫాలీ షా ఇటీవల పెళ్లి, పిల్లలు, రిలేషన్‌షిప్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మనుషుల కంటే కుక్కలే ఎక్కువ ప్రేమను పంచుతాయని, పిల్లల కంటే పెంపుడు జంతువులే మేలని ఆమె అభిప్రాయపడ్డారు.

"తొందరపడి పెళ్లిళ్లు చేసుకోవద్దు"
ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్‌తో జరిగిన చిట్ చాట్‌లో బాలీవుడ్ నటి షెఫాలీ షా మాట్లాడుతూ.. నేటి యువతకు కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా అమ్మాయిలు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవద్దని ఆమె కోరారు.
"దయచేసి చెప్పేది వినండి.. మీరు ఇంకా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పెళ్లి అనే పెద్ద నిర్ణయం తీసుకోవద్దు. మీకు మీ గురించి, మీ ఇష్టాయిష్టాల గురించి కనీసం అవగాహన రాకముందే పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. మొదట వ్యక్తుల్ని కలవండి, ప్రపంచాన్ని చూడండి. అసలు మీకు వివాహ వ్యవస్థపై నమ్మకం ఉందో లేదో తెలుసుకోండి. ఎందుకంటే పెళ్లి అనేది ఒక బాధ్యత.. అది మేనేజ్ చాలా కష్టమైన పని" అని షెఫాలీ కుండబద్దలు కొట్టారు.
పిల్లల కంటే కుక్కలే ముద్దు
ఇదే ఇంటర్వ్యూలో లిల్లీ సింగ్ తనకి 37 ఏళ్లు అని, ఇంకా పెళ్లి చేసుకోలేదని చెప్పగా.. షెఫాలీ నవ్వుతూ ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
"నేను ఇది చెబితే నన్ను దారుణంగా ట్రోల్ చేస్తారని తెలుసు. కానీ నిజం చెబుతున్నాను.. పిల్లల్ని కనకండి, కుక్కలనే పెంచుకోండి. నిజమైన, నిస్వార్థమైన, షరతులు లేని ప్రేమ కేవలం కుక్కల దగ్గరే దొరుకుతుంది" అని ఆమె అనడం గమనార్హం.
షెఫాలీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. కొంతమంది ఆమె మాటలతో ఏకీభవిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు.
షెఫాలీ వ్యక్తిగత జీవితం, కెరీర్
షెఫాలీ షా కేవలం మాటలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో కూడా యానిమల్ లవర్. ఆమెకు యాష్, సింబా అనే రెండు సైబీరియన్ హస్కీ (Siberian Huskies) కుక్కలు ఉన్నాయి. షూటింగ్ నుంచి ఇంటికి రాగానే అవి తనపై చూపించే ప్రేమను ఆమె తరచుగా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఉంటారు.
షెఫాలీ మొదట హర్ష్ ఛాయాను వివాహం చేసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో దర్శకుడు విపుల్ అమృత్‌లాల్ షాను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆర్యమన్, మౌర్య అనే ఇద్దరు కుమారులు ఉన్నారు.
ఇటీవల ఆమె నెట్‌ఫ్లిక్స్ సిరీస్ 'ఢిల్లీ క్రైమ్' (Delhi Crime) సీజన్ 3లో డీఐజీ వర్తికా చతుర్వేదిగా అద్భుతమైన నటనను కనబరిచారు.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. షెఫాలీ షా వివాహం గురించి యువతకు ఇచ్చిన సలహా ఏంటి?
మీరు ఎమోషనల్‌గా మెచ్యూర్ అయ్యే వరకు, మీకు ఏం కావాలో క్లారిటీ వచ్చే వరకు పెళ్లి చేసుకోకండి అని ఆమె సూచించారు.
2. షెఫాలీ షా పిల్లల గురించి ఏమన్నారు?
పిల్లల కంటే కుక్కలే మేలని, అవి ఇచ్చే ప్రేమ స్వచ్ఛమైనదని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు.
3. 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 3 ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది?
షెఫాలీ షా నటించిన 'ఢిల్లీ క్రైమ్' సీజన్ 3 ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులో ఉంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


