Peddi: పెద్ది నుంచి గౌరనాయుడు వచ్చేశాడు.. స్టార్ హీరో శివరాజ్‌కుమార్ పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియో రిలీజ్..
Peddi: పెద్ది మూవీ నుంచి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియో రిలీజ్ అయింది. ట్రైలర్ కు మరో నాలుగు రోజుల కౌంట్‌డౌన్ చెబుతూ.. ఓ బీటీఎస్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు 'పెద్ది' (Peddi) టీమ్ అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చింది. మే 18న సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూనే.. మరోవైపు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ పాత్రకు సంబంధించిన ఒక పవర్‌ఫుల్ గ్లింప్స్‌ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

క్రికెటర్ నుంచి రెజ్లర్‌గా.. 'గౌరనాయుడు' ట్రైనింగ్
స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా అయిన పెద్ది మూవీలో శివరాజ్‌కుమార్ 'గౌరనాయుడు' అనే రెజ్లింగ్ ట్రైనర్ పాత్రను పోషిస్తున్నారు. సినిమాలో ఒక సాధారణ క్రికెటర్‌గా ఉన్న రామ్ చరణ్‌ను.. అత్యంత శక్తివంతమైన మట్టి కుస్తీ వీరుడిగా మార్చే గురువుగా ఆయన కనిపించనున్నారు.
తాజాగా విడుదలైన వీడియోలో శివ రాజ్‌కుమార్ తన శిష్యుడికి ఇచ్చే కఠినమైన శిక్షణతో పాటు సెట్స్‌లోని కొన్ని ఆసక్తికరమైన బిహైండ్ ద సీన్స్ (BTS) క్షణాలను కూడా చూడవచ్చు. చరణ్-శివన్న కాంబినేషన్ స్క్రీన్ మీద చూస్తుంటేనే మెగా అభిమానులకు పూనకాలు రావడం ఖాయమనిపిస్తోంది.
మే 18న అసలైన ఆట.. ట్రైలర్ లాంచ్
సినిమాపై అంచనాలను భారీగా పెంచుతూ మే 18న 'పెద్ది' ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు. 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. రామ్ చరణ్ కెరీర్‌లో ఒక విభిన్నమైన ప్రయోగంగా నిలవనుంది.
'పెద్ది' చిత్ర విశేషాలు
పెద్ది మూవీలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. వీళ్లు కాకుండా శివరాజ్‌కుమార్ (గౌరనాయుడు), జగపతి బాబు, బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో వెంకట సతీష్ కిలారు మూవీని నిర్మిస్తున్నారు. ఈ మచ్ అవేటెడ్ మూవీ జూన్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఢీలా పడిన టాలీవుడ్ ను మళ్లీ పట్టాలెక్కిస్తుందన్న నమ్మకంతో ఇండస్ట్రీ, అభిమానులు ఉన్నారు. ఒక్కో ప్రమోషనల్ కంటెంట్ తో పెద్ది సినిమాపై అంచనాలు పెంచేస్తున్న మేకర్స్.. మరి మూవీతో ఎలా మ్యాజిక్ చేస్తారో చూడాలి.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)
1. 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ పాత్ర ఎలా ఉండబోతోంది?
రామ్ చరణ్ ఈ సినిమాలో మొదట క్రికెటర్‌గా, ఆ తర్వాత శివరాజ్‌కుమార్ శిక్షణలో రెజ్లర్‌గా మారే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ పర్సన్ పాత్రలో కనిపిస్తున్నారు.
2. పెద్ది మూవీలో శివరాజ్‌కుమార్ పాత్ర ఏంటి?
పెద్ది సినిమాలో శివరాజ్‌కుమార్ గౌరనాయుడు అనే పాత్రలో కనిపిస్తున్నాడు. తాజాగా ఈ పాత్ర పవర్‌ఫుల్ గ్లింప్స్ వీడియో లాంచ్ అయింది.
3. పెద్ది సినిమాలో హీరోయిన్ ఎవరు?
అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు.
4. పెద్ది ట్రైలర్ ఎప్పుడు విడుదల కానుంది?
ఈ సినిమా అధికారిక ట్రైలర్ మే 18, 2026న విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


