Peddi: పెద్ది పవర్ ప్లే టూర్.. సర్‌ప్రైజ్‌తో మూవీ టీమ్ రెడీ.. ఆర్సీబీ, సన్‌రైజర్స్ మ్యాచ్‌లో ఉప్పల్‌లో మోత
Peddi: పెద్ది టీమ్ గ్రాండ్ లెవల్ ప్రమోషన్స్ కు రెడీ అవుతోంది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమాను ఇండియా వైడ్ గా జనాలకు దగ్గర చేసేందుకు పవర్ ప్లే టూర్ ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియంలో పెద్ది టీమ్ సందడి చేయనుంది.
Peddi: సినీ అభిమానుల గుండెల్లో బలమైన ముద్ర వేయడానికి 'పెద్ది' (PEDDI) చిత్రం సిద్ధమైంది. కేవలం సినిమాగానే కాకుండా, ప్రేక్షకులను కుదిపేసే ఒక తుపానులా, గుండెకు హత్తుకునే కథలా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతోంది. సినిమా పై ఉన్న అంచనాలను నిజం చేస్తూ, చిత్ర బృందం ప్రమోషన్ల విషయంలో దూకుడు పెంచింది.

పెద్ది పవర్ ప్లే టూర్
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది సినిమాను జనాలకు చేరువ చేసేందుకు మూవీ టీమ్ భారీ ప్లాన్ వేసింది. భారీ కలలను సాకారం చేసుకునే క్రమంలో బాధ్యత కూడా అంతే ఉంటుందని భావించి, 'పెద్ది పవర్‌ప్లే టూర్' (PEDDI POWERPLAY TOUR) పేరిట భారీ దేశవ్యాప్త పర్యటనకు మూవీ టీమ్ శ్రీకారం చుట్టనుంది.
దేశవ్యాప్తంగా 'పెద్ది' సందడి
మే 18 నుంచి ప్రారంభం కానున్న ఈ ప్రమోషనల్ టూర్ దేశంలోని ప్రధాన నగరాలను చుట్టేయనుంది. ముంబైలో మొదలై హైదరాబాద్ వరకు సాగే ఈ పర్యటనలో చిత్ర యూనిట్ ప్రేక్షకులతో నేరుగా ముచ్చటించనుంది.
పూర్తి షెడ్యూల్ ఇలా ఉంది:
మే 18: ముంబై
మే 22: ఉప్పల్ స్టేడియం (హైదరాబాద్)
మే 23: భోపాల్
మే 24: బెంగళూరు
మే 28: ఢిల్లీ
మే 30: చెన్నై
జూన్ 1: విజయనగరం
జూన్ 2: హైదరాబాద్
సర్ ప్రైజ్ లు
ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయని పెద్ది చిత్ర బృందం స్పష్టం చేసింది. సినిమాపై అంచనాలను పెంచుతూ అభిమానులకు ఊహించని విశేషాలను అందించేందుకు టీమ్ సిద్ధంగా ఉంది. మే 18న ముంబైలో జరిగే ఈవెంట్ లో పెద్ది ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. మే 23న భోపాల్ స్పెషల్ సాంగ్ లాంఛ్ ఉంటుంది. ఇంకా మూవీ టీమ్ ఏం ప్లాన్ చేసిందో చూడాలి.
ఉప్పల్ లో మోత
ఐపీఎల్ 2026లో భాగంగా మే 22న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఆర్సీబీ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పెద్ది టీమ్ సందడి చేయనుంది. పెద్ది మూవీలో రామ్ చరణ్ క్రికెటర్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
జూన్ 4న వినోదం
వేసవి సెలవులను దృష్టిలో ఉంచుకుని, ప్రేక్షకులకు వినోదాన్ని ముందుగానే పంచాలనే ఉద్దేశంతో పెద్ది సినిమా విడుదలను జూన్ 4వ తేదీకి ఖరారు చేశారు. ఈ సినిమాను వీలైనంత త్వరగా వెండితెరపైకి తీసుకురావడానికి చిత్ర బృందం అహర్నిశలు శ్రమించింది. ప్రతి ఫ్రేమ్‌లోనూ ఎంతో శ్రద్ధను, మనసును పెట్టి ఈ చిత్రాన్ని మలిచినట్లు వారు పేర్కొన్నారు.
సినిమా పట్ల ఉన్న అమితమైన ప్రేమతో రూపొందించిన ఈ 'పెద్ది' ప్రపంచాన్ని థియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెలవుల్లో ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌ను ఆస్వాదించాలనుకునే వారికి 'పెద్ది' ఒక అల్టిమేట్ ట్రీట్‌గా నిలవనుంది.
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
ప్రశ్న: 'పెద్ది' సినిమా విడుదల తేదీ ఎప్పుడు?
జవాబు: జూన్ 4వ తేదీన 'పెద్ది' చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రశ్న: 'పెద్ది పవర్‌ప్లే టూర్' విశేషాలేంటి?
జవాబు: మే 18 నుంచి జూన్ 2 వరకు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో చిత్ర బృందం ప్రమోషన్లలో పాల్గొంటుంది.
ప్రశ్న: ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటి?
జవాబు: పెద్ది సినిమాలో రామ్ చరణ్ రూరల్ స్పోర్ట్స్ మన్ గా నటిస్తున్నాడు. ఇది కేవలం యాక్షన్ డ్రామా మాత్రమే కాకుండా, ప్రేక్షకులకు బలమైన భావోద్వేగాలను పంచుతూ సమ్మర్ హాలిడేస్‌లో పూర్తిస్థాయి వినోదాన్ని ఇచ్చే చిత్రమని మేకర్స్ చెబుతున్నారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


