Janhvi Kapoor: అచ్చియమ్మ అదుర్స్.. భోపాల్‌లో బ్లూ కలర్ డ్రెస్‌లో మెరిసిన జాన్వీ.. పెద్దితో ఫొటోలు వైరల్
Janhvi Kapoor: అచ్చియమ్మగా తెలుగు ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అయింది జాన్వీ కపూర్. రామ్ చరణ్ తో ఆమె చేసిన పెద్ది మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో భోపాల్ లో నిర్వహించిన ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్లో జాన్వీ బ్లూ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది.
Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటోంది. అటు యాక్టింగ్ లో, ఇటు అందంలోనూ దివంగత తన తల్లికి ఏ మాత్రం తగ్గకుండా జాన్వీ సాగిపోతోంది. తాజాగా ‘పెద్ది కి ఆవాజ్’ ఈవెంట్లో జాన్వీ కపూర్ మెరిసిపోయింది. ఆమె ఫొటోలు, వైరల్ తెగ వైరల్ గా మారాయి.

జాన్వీ కపూర్ వైరల్
రామ్ చరణ్ హీరోగా నటించిన పెద్ది మూవీ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్లను పరుగెత్తిస్తోంది. ఈ క్రమంలోనే ఇవాళ (మే 23) మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో ‘పెద్ది కి ఆవాజ్’ పేరుతో ఈవెంట్ నిర్వహించారు. ఇందులో జాన్వీ కపూర్ పార్టిసిపేట్ చేసింది.
బ్లూ కలర్ డ్రెస్ లో
పెద్ది కి ఆవాజ్ ఈవెంట్ కోసం జాన్వీ కపూర్ బ్లూ డ్రెస్ వేసుకొని వచ్చింది. ఆమె ఎంట్రీ టైమ్ లో ఫ్యాన్స్ కేకలు పెట్టారు. ఈ స్పెషల్ ప్లేస్ లో పెద్ది ఈవెంట్ జరగడం హ్యాపీగా ఉందని జాన్వీ తెలిపింది. పెద్ది మూవీలో జాన్వీ కపూర్.. అచ్చియమ్మ క్యారెక్టర్ ప్లే చేసింది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే అమ్మాయిగా ఆమె నటించింది.
అప్పట్లొ ఆ జోడీ
అప్పట్లో చిరంజీవి, శ్రీదేవి జోడీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీలో వీళ్ల మ్యాజిక్ అదిరిపోయింది. ఇప్పుడు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ జత కట్టారు. పెద్ది సినిమాతో ఫస్ట్ టైమ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఈ జోడీ కూడా మ్యాజిక్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు భారీగానే ఉన్నాయి.
రామ్ చరణ్ కష్టం
పెద్ది మూవీలో రామ్ చరణ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు. క్రికెటర్ గా, రన్నర్ గా, రెజ్లర్ గా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన పెద్ది ట్రైలర్ లో చరణ్ కష్టం కనిపించింది. ఈ మూవీ కోసం అతను ఎంతలా కష్టపడ్డాడో తెలిసొచ్చింది.
జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న పెద్ది మూవీకి బుచ్చిబాబు సాన డైరెక్టర్. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. ఆస్కార్ ఆవార్డ్ విన్నర్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటికే చికిరి, రయ్ రయ్ రారా సాంగ్స్ కు అదిరే రెస్పాన్స్ దక్కింది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


