...
...
Next Story

Jayanth and The Jingo Pen: బంపర్ ఆఫర్.. ఈ సినిమాకు టికెట్ల రేట్లు భారీగా తగ్గింపు.. చిల్డ్రెన్స్ డే రోజే రిలీజ్

Jayanth and The Jingo Pen: చిల్డ్రెన్స్ డే సందర్భంగా చిన్నారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చక్కటి సందేశాన్ని అందించేందుకు 'జయంత్ & ది జింగో పెన్' (Jayannth & The Jingo Pen) చిత్రం సిద్ధమైంది. ఈ సందర్భంగా పిల్లల కోసం టికెట్ ధరను రూ. 250 నుండి 150కి తగ్గిస్తూ చిత్రబృందం అద్భుతమైన నిర్ణయం తీసుకుంది.

Published on: Nov 12, 2026, 20:57:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Jayanth and The Jingo Pen: కమర్షియల్ సినిమాల హవా నడుస్తున్న తరుణంలో, పిల్లల మనస్తత్వాన్ని, వారి ఆలోచనలను ప్రతిబింబించే కథలు రావడం చాలా అరుదు. ఆ లోటును భర్తీ చేస్తూ జాతీయ అవార్డు విజేత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రమే ‘జయంత్ & ది జింగో పెన్’.

Jayanth and The Jingo Pen: బంపర్ ఆఫర్.. ఈ సినిమాకు టికెట్ల రేట్లు భారీగా తగ్గింపు.. చిల్డ్రెన్స్ డే రోజే రిలీజ్
Jayanth and The Jingo Pen: బంపర్ ఆఫర్.. ఈ సినిమాకు టికెట్ల రేట్లు భారీగా తగ్గింపు.. చిల్డ్రెన్స్ డే రోజే రిలీజ్

నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని విడుదల చేస్తుండగా, చిన్నారులందరికీ సినిమా చేరువ కావాలనే ఉద్దేశంతో టికెట్ ధరను రూ. 250 నుంచి ఏకంగా రూ. 150కి తగ్గిస్తున్నట్లు నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ప్రకటించారు.

'పిల్లల మార్కులు కాదు.. వారి మనసులను చూడండి': నిర్మాతల ఎమోషనల్ అప్పీల్

సినిమా విడుదల నేపథ్యంలో చిత్రబృందం పంచుకున్న ఆసక్తికర విషయాలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తున్నాయి. నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. "ఈ సినిమాలోని భావోద్వేగాలు అన్ని వయసుల ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి. ముఖ్యంగా పిల్లల కోసం టికెట్ ధరలను తగ్గించాము. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పకుండా ఈ సినిమా చూడాలి. దయచేసి పిల్లల మార్కులను మాత్రమే కాకుండా, వారి మనసులను కూడా అర్థం చేసుకోండి" అని విజ్ఞప్తి చేశారు.

మాస్టర్ జయంత్ బొలిశెట్టి స్పందిస్తూ.. "బాలల దినోత్సవ ప్రత్యేక ఆకర్షణగా మా సినిమా వస్తోంది. పిల్లలకు బహుమతిగా టికెట్ ధర రూ. 150కి తగ్గించాం. పిల్లలు, పెద్దలు, టీచర్లకు ఒక అర్థవంతమైన సందేశం ఇందులో ఉంది. ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని నమ్ముతున్నాను" అని తెలిపాడు.

సంగీత దర్శకుడు, గీత రచయిత ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. "ఈ సినిమా కోసం నేను రాసిన పాటలకు, సంగీతానికి అద్భుతమైన స్పందన వస్తోంది. ఇప్పటికే పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు పెద్ద సంఖ్యలో థియేటర్లను బుక్ చేసుకుంటున్నారు" అని పేర్కొన్నారు.

‘కొందరు ఇప్పుడు చిల్డ్రన్స్ డే అంటున్నారు.. కన్ఫ్యూజ్ కావొద్దు’

"మేము ఈ సినిమాను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదు. అందుకే టికెట్ ధరను రూ. 150కి తగ్గించాము. ఇప్పటికే పలు పాఠశాలలు ప్రత్యేక షోల కోసం థియేటర్లను బుక్ చేసుకున్నాయి. కొందరు తమ సినిమాలను ఇప్పుడు హఠాత్తుగా 'చిల్డ్రన్స్ డే స్పెషల్స్' అంటూ ప్రమోట్ చేస్తున్నారు. ప్రేక్షకులు ఏమాత్రం కన్ఫ్యూజ్ కావొద్దు. మొదటి నుంచీ పిల్లల కోసమే రూపొందించిన మా 'జయంత్ & ది జింగో పెన్' నవంబర్ 14న వస్తోంది" అని దర్శకుడు నవీన్ దేశబోయిన స్పష్టం చేశారు.

సహ నిర్మాత షఫీ మాట్లాడుతూ.. చాలా చోట్ల ఇప్పటికే హౌస్‌ఫుల్ బుకింగ్స్ నమోదవుతున్నాయని, మొదటి నుంచీ పిల్లల కోసం నిజాయితీగా తీసిన ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలని కోరారు.

వినోదంతో పాటు విలువైన సందేశాన్ని అందిస్తూ, తక్కువ టికెట్ ధరతో వస్తున్న 'జయంత్ & ది జింగో పెన్' చిత్రం ఈ బాలల దినోత్సవాన కుటుంబ సమేతంగా థియేటర్లలో చూసి ఆనందించదగ్గ చక్కటి చిత్రంగా నిలవనుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks