Jiohotstar Crime Thriller: మైండ్ బ్లాంక్ ట్విస్టులు.. ఒకటి కాదు రెండు హత్యలు.. ఓటీటీలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

Jiohotstar Thriller: ఓటీటీలో మలయాళం థ్రిల్లర్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణే దక్కుతుంది. ఈ మధ్యే వచ్చిన ఉయిర్ మూవీ కూడా ప్రస్తుతం ఓటీటీలో టాప్ గేర్ లో దూసుకెళ్తోంది. ప్రముఖ నటుడు రోషన్ మాథ్యూ నటించిన ఈ సినిమా స్టోరీ ఏంటి? ఎందుకు చూడాలో తెలుసుకోండి.

Published on: Aug 14, 2026, 15:23:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jiohotstar Thriller: మలయాళం థ్రిల్లర్, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగులో ఉన్న డిమాండ్ తెలుసు కదా? అలాంటిదే ఓ సినిమా గురించి ఇప్పుడు చెప్పబోతున్నాం. ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లో తెలుగులోనూ స్ట్రీమింగ్ కు వచ్చిన ఈ సినిమా మైంబ్ బ్లోయింగ్ ట్విస్టులతో సాగుతుంది. ఒక హత్య అనుకునేలోపే చివరికి అది రెండు హత్యల మిస్టరీగా ఎలా మారిందన్నది ఈ మూవీలో చూడొచ్చు.

Jiohotstar Crime Thriller: మైండ్ బ్లాంక్ ట్విస్టులు.. ఒకటి కాదు రెండు హత్యలు.. ఓటీటీలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
Jiohotstar Crime Thriller: మైండ్ బ్లాంక్ ట్విస్టులు.. ఒకటి కాదు రెండు హత్యలు.. ఓటీటీలోని ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?

క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఉయిర్

జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న మలయాళ క్రైమ్ థ్రిల్లర్ 'ఉయిర్' (Uyir) సినిమా చూసేవారికి మైండ్ బ్లాక్ అవ్వడం గ్యారెంటీ. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి నిమిషం టెన్షన్ పుట్టిస్తూ సస్పెన్స్‌తో కట్టిపడేస్తుంది. క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ఆడియన్స్‌కి ఈ వీకెండ్‌లో ఇది పర్ఫెక్ట్ వాచ్.

నిజ జీవిత ఘటనల ఆధారంగా పవర్‌ఫుల్ స్టోరీ

పోలీస్ ఆఫీసర్ అన్షాద్ ఎస్. రియల్ లైఫ్ అనుభవాల నుంచి ఈ కథను తీసుకున్నారు. ట్రైన్ జర్నీలో ఓ ఫ్యామిలీకి ఎదురైన అనుకోని సంఘటనతో ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ప్రయాణం మధ్యలో చిన్న పాప అదృశ్యం కావడంతో కథ మరో లెవెల్‌కి మారుతుంది. అసలు ఆ పాప ఎవరు? ఏంటి అన్నది మూవీ చివరికిగానీ మనకు క్లారిటీ రాదు.

సూసైడ్ లేదా మర్డర్? ఊహించని ట్విస్టులు

కొంత కాలం తర్వాత ఒక పాడుబడిన బావిలో ఓ మహిళ కుళ్ళిన శవం దొరుకుతుంది. ముందుగా చూసేవారికిదో సూసైడ్ కేసులా అనిపిస్తుంది. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్లే కొద్దీ అది కచ్చితంగా ప్లాన్ చేసిన మర్డర్ అని తేలుతుంది. అసలు ఆ హత్య చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఈ కేసును పోలీసులు ఎలా ఛేదించారన్నది ఈ మూవీలో చూడొచ్చు.

నటీనటుల అద్భుతమైన పెర్ఫార్మెన్స్

ఈ చిత్రంలో సయామి ఖేర్, రోషన్ మాథ్యూ, దివ్య ఎం. నాయర్, వినీత్ తట్టిల్ డేవిడ్ తమ నటనతో అదరగొట్టేశారు. ప్రతి క్యారెక్టర్ చాలా నేచురల్‌గా అనిపిస్తుంది. దర్శకుడు ఎం. పద్మకుమార్ టేకింగ్ ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా మూడ్‌ని ఎలివేట్ చేస్తుంది.

క్లైమాక్స్ వరకు అంతుచిక్కని సస్పెన్స్

ఈ ఉయిర్ మూవీలో క్లైమాక్స్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఉంటుంది. కేసు పరిష్కారం అయిపోయిందని ఆడియన్స్ అనుకునే లోపే డైరెక్టర్ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఇస్తాడు. ఆ ట్విస్ట్ చూశాకే మూవీలోని అసలు థ్రిల్ ఏంటో అర్థమవుతుంది. ఒక ఆత్మహత్య కేసులో మొదలై హత్య కేసుగా మారి.. అది కాస్తా రెండు హత్యలు ఎలా అయ్యాయన్నది ఈ సినిమాలో చాలా ఆసక్తికరంగా చూపించారు.

ఉయిర్ మూవీ విశేషాలు

మూవీ పేరు : ఉయిర్

జానర్ : క్రైమ్ థ్రిల్లర్ / సస్పెన్స్ డ్రామా

దర్శకత్వం : ఎం. పద్మకుమార్

ప్రధాన నటులు : సయామి ఖేర్, రోషన్ మాథ్యూ, దివ్య ఎం. నాయర్

ఓటీటీ వేదిక : జియోహాట్‌స్టార్ (మలయాళం, తెలుగు, హిందీ,కన్నడ, తమిళం)

ఐఎండీబీ రేటింగ్ : 6.5 / 10

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More