Jiohotstar Releases: హారర్, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈవారం రానున్న 7 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

Jiohotstar Releases: జియోహాట్‌స్టార్ ఓటీటీ ఈవారం 7 కొత్త మూవీస్, వెబ్ సిరీస్, రియాల్టీ షోలను తీసుకొస్తోంది. ప్రతివారంలాగే ఈ వారం కూడా ఫుల్ టైంపాస్ ఖాయంగా కనిపిస్తోంది. మరి ఆ కొత్త సినిమాలు, సిరీస్ ఏవో చూడండి.

Published on: Sep 7, 2026, 18:31:28 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jiohotstar Releases: సెప్టెంబర్ రెండో వారంలో ఓటీటీ ఆడియన్స్‌కు వినోదాన్ని పంచడానికి జియోహాట్‌స్టార్ మైండ్ బ్లోయింగ్ లైనప్‌తో సిద్ధమైంది. సెప్టెంబర్ 8 నుండి 13 వరకు ఒకే వారంలో ఏకంగా 7 కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు రాబోతున్నాయి. హారర్, థ్రిల్లర్, కామెడీ డ్రామా నుంచి మొదలుకొని రియాలిటీ షోస్, కిడ్స్ యానిమేషన్ వరకు అన్ని రకాల జోనర్ల కంటెంట్ ఓటీటీ ప్రియులను అలరించనుంది.

Jiohotstar Releases: హారర్, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈవారం రానున్న 7 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే
Jiohotstar Releases: హారర్, థ్రిల్లర్ నుంచి కామెడీ వరకు.. జియోహాట్‌స్టార్‌లో ఈవారం రానున్న 7 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే

జియోహాట్‌స్టార్ ఓటీటీ రిలీజెస్

• ది రియల్ హౌజ్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సీజన్ 16: సెప్టెంబర్ 8 (రియాల్టీ షో)

• ది పేపర్ సీజన్ 2: సెప్టెంబర్ 9 (థ్రిల్లర్ వెబ్ సిరీస్)

• ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్: సెప్టెంబర్ 11 (మలయాళం కామెడీ వెబ్ సిరీస్)

• అలీ బాబా ఔర్ 40 బూత్: సెప్టెంబర్ 11 (హారర్ కామెడీ వెబ్ సిరీస్)

• జంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ: సెప్టెంబర్ 12 (కిడ్స్ యానిమేటెడ్ సిరీస్)

• బిగ్ బాస్ తెలుగు 10: ప్రతి రోజూ స్ట్రీమింగ్

• చీకూ ఔర్ బంటి: కుస్తీ కీ జంగ్: సెప్టెంబర్ 13 (యానిమేటెడ్ రెజ్లింగ్ మూవీ)

డ్రామా, థ్రిల్లర్ లవర్స్ కోసం సూపర్ కంటెంట్

జియోహాట్‌స్టార్ లవర్స్ కోసం సెప్టెంబర్ 8న గ్లోబల్ పాపులర్ రియాలిటీ షో 'ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ న్యూయార్క్ సిటీ' సీజన్ 16 రిలీజ్ కానుంది. హై ప్రొఫైల్ లైఫ్‌స్టైల్, డ్రామాతో సాగే ఈ షోకు వరల్డ్‌వైడ్‌గా మంచి క్రేజ్ ఉంది.

అలాగే సెప్టెంబర్ 9న సూపర్ హిట్ వెబ్ సిరీస్ 'ది పేపర్' సీజన్ 2 రాబోతోంది. మొదటి సీజన్ ఎక్కడైతే సస్పెన్స్ ట్విస్ట్‌తో ముగిసిందో, అక్కడి నుంచే రెండో సీజన్ కథ ప్రారంభం కానుంది. ఇన్వెస్టిగేటివ్ డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇష్టపడే వారికి ఈ సిరీస్ పర్ఫెక్ట్ ఛాయిస్.

మాలీవుడ్ కామెడీ అండ్ హారర్ ట్విస్టులు

సెప్టెంబర్ 11న ఓటీటీ ప్రేక్షకులకు డబుల్ ధమాకా ఎదురుచూస్తోంది. మలయాళం కామెడీ డ్రామా సిరీస్ 'ప్రిన్స్ ఆఫ్ మాలీవుడ్' స్ట్రీమింగ్ కానుంది. సినిమాలో పెద్ద స్టార్ కావాలని కలలు కనే ఫిరోజ్ అనే కుర్రాడి లైఫ్‌లోకి అనుకోకుండా ఒక రియల్ లైఫ్ విలన్ ఎంట్రీ ఇస్తే ఎలాంటి గందరగోళం జరిగింది అనేది నవ్వులు పూయించేలా తెరకెక్కించారు.

అదే రోజు అనగా సెప్టెంబర్ 11న 'అలీ బాబా అవుర్ 40 భూత్' అనే హారర్ కామెడీ సస్పెన్స్ సిరీస్ కూడా రాబోతోంది. హారర్ ట్విస్టులు, కామెడీ కాంబినేషన్‌తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్స్ ఇష్టపడే ఆడియన్స్‌ను బాగా ఆకట్టుకోనుంది.

బిగ్ బాస్ 10 హంగామా, చిన్నారుల కోసం స్పెషల్ యానిమేషన్

టాలీవుడ్ కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 టీవీతో పాటు జియోహాట్‌స్టార్‌లో సందడి చేస్తోంది. ప్రతీ రోజు కొత్త ఎపిసోడ్లు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండటంతో బిగ్ బాస్ లవర్స్ హౌస్ డ్రామాను ఎప్పటికప్పుడు ఎంజాయ్ చేయవచ్చు.

ఇక చిన్నారుల కోసం ఈ వారం స్పెషల్ వినోదం అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబర్ 12న మౌగ్లీ, అడవి జంతువుల స్నేహం నేపథ్యంలో సాగే 'జంగిల్ టేల్స్ విత్ మౌగ్లీ' డిజిటల్ ప్రీమియర్ కానుంది. దాంతో పాటు సెప్టెంబర్ 13న 'చీకూ అవుర్ బంటీ: కుష్తీ కీ జంగ్' అనే అనిమేటెడ్ మూవీ రాబోతోంది. రెజ్లింగ్ ఛాంపియన్ వీరాను చీకూ, బంటీ ఎలా నిరూపించారు అనే సరదా కథతో ఈ కిడ్స్ మూవీ రానుంది. ఈ వీకెండ్‌లో ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయడానికి ఈ లైనప్ బెస్ట్ ఆప్షన్‌గా మారనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More