Malayalam OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళం బ్లాక్ బస్టర్ సర్వైవల్ థ్రిల్లర్.. మోహన్ లాల్ కూతురి డెబ్యూ.. ఎప్పుడంటే?
Malayalam OTT Thriller: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ డెబ్యూ మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సర్వైవల్ థ్రిల్లర్ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను ఇవాళ మేకర్స్ ప్రకటించారు. థియేటర్లో అదరగొట్టిన ఈ మూవీ ఏ ఓటీటీలోకి రాబోతుందో చూసేయండి.
Malayalam OTT Thriller: మలయాళ సీనియర్ నటుడు మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ డెబ్యూ మూవీ 'తుడక్కం' (Thudakkam) ఓటీటీలోకి రాబోతుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్, ఇప్పుడు డిజిటల్ ప్రిమియర్ కోసం సిద్ధమైంది. ఆగస్టు 7, 2026న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

ఓటీటీలోకి తుడక్కం
పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'జియోహాట్‌స్టార్' (JioHotstar)లోకి తుడక్కం మూవీ వచ్చేస్తోంది. సెప్టెంబర్ 18, 2026 నుంచి ఈ మలయాళం సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సంస్థ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పష్టం చేసింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
స్టోరీ ఏమిటంటే?
'తుడక్కం' సినిమా కథ 'మీను' (విస్మయ మోహన్‌లాల్) అనే ధైర్యవంతురాలైన యువతి చుట్టూ తిరుగుతుంది. మీను 'ముయ్ థాయ్' (Muay Thai) అనే కఠినమైన మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందుతూ ఉంటుంది. ఆమె తండ్రి రవి ఒక విలేజ్ ఆఫీసర్. ఆయన శారీరక వైకల్యంతో బాధపడుతుంటారు.
ఒక రోజు పాఠశాల ముగిసిన తర్వాత భయపడుతున్న ఇద్దరు చిన్న పిల్లలను మీను సురక్షితంగా వారి ఇళ్లకు చేరుస్తుంది. అయితే ఆమె చేసిన ఈ చిన్న సాయం, ఆమె జీవితాన్ని అనూహ్యమైన ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఒక భయంకరమైన గతం ఉన్న క్రూరమైన సైకో స్టాకర్ చూపు మీనుపై పడుతుంది. అతడు ఆమె ప్రతి అడుగునూ రహస్యంగా గమనించడం ప్రారంభిస్తాడు.
మిస్సింగ్ తో ట్విస్ట్
ఒకవైపు మార్షల్ ఆర్ట్స్ సాధనలో ఎదురయ్యే సవాళ్లు, మరోవైపు వ్యక్తిగత జీవితంలో మానసిక ఒత్తిడి, ఇంకోవైపు స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య మీను తీవ్ర భయాందోళనలకు గురవుతుంది. ఒకానొక దశలో ఆమె మిస్సింగ్ కావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతారు. పోలీసులు విచారణ ప్రారంభించే లోపే, ఆ స్టాకర్ నేరుగా మీను ఇంటిపైనే దాడికి దిగుతాడు.
చివరికి తనను, తన తండ్రిని కాపాడుకోవడానికి మీను తన 'ముయ్ థాయ్'ను నమ్ముకుంటుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మీను తన ప్రాణాలను ఎలా దక్కించుకుంది? అనేది మూవీ మిగతా స్టోరీ.
విస్మయ డెబ్యూ
తుడక్కం చిత్రంతో విస్మయ మోహన్‌లాల్ హీరోయిన్ గా డెబ్యూ చేసింది. ప్రముఖ నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ కుమారుడు ఆశిష్ జో ఆంటోనీ ఈ మూవీతోనే అరంగేట్రం చేశాడు. మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఈ సినిమాలో ఒక ప్రత్యేక అతిథి (కామియో) పాత్రలో మెరిశారు.
వీరితో పాటు బాబీ కురియన్, సాయి కుమార్, మనోజ్ కే జయన్, కేబీ గణేష్ కుమార్, చిప్పి రంజిత్, కొట్టాయం రమేష్, జయ కురుప్, జాఫర్ ఇడుక్కి, టీజీ రవి, మియా జార్జ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
బ్లాక్‌బస్టర్ సినిమా '2018'తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. లినిష్ నెల్లిక్కల్ కథను అందించగా, ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


