Mohanlal Daughter: తండ్రికి తగ్గ కూతురు.. తొలి సినిమా తొలి రోజే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన విస్మయ మోహన్‌లాల్
Mohanlal Daughter: మలయాళం స్టార్ హీరో మోహన్ లాల్ కూతరు విస్మయ మోహన్ లాల్ తన తొలి సినిమా తొలి రోజు వసూళ్లతోనే రికార్డులు బ్రేక్ చేసింది. ఆమె నటించిన తుడక్కమ్ మూవీ.. గతంలో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా మూవీ రికార్డును తిరగరాసింది.
Mohanlal Daughter: మలయాళ చిత్ర పరిశ్రమలో మోహన్‌లాల్ కూతురు విస్మయ మోహన్‌లాల్ డెబ్యూ మూవీ 'తుడక్కమ్' (Thudakkam) బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డులతో బోణీ కొట్టింది. తొలిరోజే ఏకంగా రూ. 6.86 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసి, లేడీ ఓరియంటెడ్ మలయాళ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ప్రియదర్శన్ కూతురు కళ్యాణి ప్రియదర్శన్ పేరు మీద ఉన్న 'లోకా: ఛాప్టర్ 1' (Lokah) ఓపెనింగ్ రికార్డును విస్మయ దాటేసింది.

ఫస్ట్ డే రికార్డ్.. కలెక్షన్ల సునామీ
Sacnilk ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. విస్మయ మోహన్ లాల్ యాక్షన్ థ్రిల్లర్ 'తుడక్కమ్' మొదటి రోజు ఇండియాలో రూ. 2.55 కోట్ల నెట్, ప్రపంచవ్యాప్తంగా రూ. 6.86 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అంతకుముందు కళ్యాణి ప్రియదర్శన్ నటించిన 'లోకా' సినిమా తొలిరోజు రూ. 6.63 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేయగా, ఆ బెంచ్ మార్క్‌ను విస్మయ స్వల్ప తేడాతో అధిగమించింది.
అయితే వీకెండ్ కలెక్షన్ల విషయంలో మాత్రం 'లోకా' పైచేయి సాధించింది. తుడక్కమ్ చిత్రానికి మిక్స్‌డ్ రివ్యూలు రావడం వల్ల ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఇండియాలో రూ. 10.43 కోట్ల నెట్, వరల్డ్ వైడ్ గా రూ. 23.46 కోట్ల గ్రాస్ మాత్రమే రాబట్టగలిగింది. మరోవైపు లోకా సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుని తొలి వీకెండ్‌లోనే రూ. 40.87 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్‌తో రికార్డు క్రియేట్ చేసింది.
కూతురి గ్రాండ్ ఎంట్రీపై మోహన్ లాల్ ఎమోషనల్ పోస్ట్
తన ముద్దుల కూతురు విస్మయ వెండితెరపైకి అడుగుపెట్టిన సందర్భంగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. "ఒక తండ్రిగా నా హృదయం ఇంతకంటే ఏమీ కోరుకోలేదు. విస్మయ తన మొదటి సినిమా 'తుడక్కమ్' ద్వారా ప్రయాణం ప్రారంభించడం, ఆమెకు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమ చూస్తుంటే నా జన్మ ధన్యమైంది" అని రాసుకొచ్చారు.
చిన్నప్పటి నుంచి తనకు తెలిసిన దర్శకుడు ఆశిష్ జో ఆంటోనీ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. ఈ సినిమాలో మోహన్‌లాల్ ఒక పవర్ ఫుల్ ఎక్స్టెండెడ్ కేమియో రోల్‌లో కనిపించి ఫ్యాన్స్‌ని అలరించడం విశేషం.
రెండు దిగ్గజ కుటుంబాల వారసత్వం.. నేటి తరం పోటీ
మలయాళ ఇండస్ట్రీలో మోహన్‌లాల్, దర్శకుడు ప్రియదర్శన్ మధ్య దశాబ్దాల కాలంగా కొనసాగుతున్న స్నేహం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఇప్పుడు వారి వారసులుగా విస్మయ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్ లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్‌లతో ఇండస్ట్రీని రూల్ చేయడం విశేషం.
ఇటీవల '2018' సినిమాతో ఆస్కార్ రేసు వరకు వెళ్లి ఇండస్ట్రీ హిట్ కొట్టిన జూడ్ ఆంథోనీ జోసెఫ్ 'తుడక్కమ్' చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్‌పై ఆంటోనీ పెరుంబవూర్ ఈ విజువల్ యాక్షన్ థ్రిల్లర్‌ను నిర్మించారు. విస్మయ తన మొదటి సినిమాలోనే అద్భుతమైన ఫైట్స్, పవర్ ఫుల్ యాక్టింగ్‌తో విమర్శకుల ప్రశంసలు అందుకోవడం విశేషం.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


