Vismaya Mohanlal: రక్తంలోనే యాక్టింగ్.. క్రైమ్ థ్రిల్లర్‌తో హీరోయిన్‌గా మోహన్‌లాల్ కూతురు.. అదిరిపోయిన ట్రైలర్
Vismaya Mohanlal: మోహన్‌లాల్ కూతురా.. మజాకా! ఈ సూపర్ స్టార్ కూతురు విస్మయ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. అది కూడా కమర్షియల్ మూవీతో కాదు. తండ్రి బాటలోనే సాగుతూ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ ను ఎంచుకుంది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ అదిరిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vismaya Mohanlal: డిఫరెంట్ స్టోరీస్ ను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాలు చేస్తూ మలయాళం మెగాస్టార్ గా ఎదిగారు మోహన్‌లాల్. ఇప్పుడు అతని కుటుంబం నుంచి మరొకరు సినిమాల్లోకి అడుగుపెట్టారు. ఇప్పటికే కొడుకు ప్రణవ్ హీరోగా ప్రూవ్ చేసుకోగా.. ఇప్పుడు కూతురు విస్మయ హీరోయిన్ గా మారింది. తన ఫస్ట్ మూవీతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

మోహన్‌లాల్ కూతురు
దక్షిణాది చిత్రసీమలో అత్యంత ఆదరణ పొందిన కుటుంబాల్లో మోహన్‌లాల్ కుటుంబం ఒకటి. ఇప్పటికే ఆయన కుమారుడు ప్రణవ్ మోహన్‌లాల్ 'హృదయం', 'వర్షంగళ్క్కు శేషం' వంటి చిత్రాలతో మలయాళంలో క్రేజీ స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే దారిలో మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ (Vismaya Mohanlal) కూడా హీరోయిన్ గా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించింది.
తుడక్కమ్ ట్రైలర్
విస్మయ మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తొలి చిత్రం ‘తుడక్కమ్’ (Thudakkam). ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. మలయాళంలో 'తుడక్కమ్' అంటే "ప్రారంభం" (The Beginning) అని అర్థం.
విస్మయ ప్రయోగం
సాధారణంగా స్టార్ కిడ్స్ ఎంట్రీ అనగానే భారీ గ్లామర్, లవ్ స్టోరీలు లేదా కమర్షియల్ హంగులతో ఆరంగేట్రం చేస్తుంటారు. కానీ విస్మయ మాత్రం దానికి పూర్తి భిన్నమైన దారిని ఎంచుకుంది. తుడక్కమ్ ట్రైలర్ విజువల్స్ పరిశీలిస్తే.. విస్మయ కేవలం గ్లామర్ పాత్రకే పరిమితం కాకుండా, ఇంటెన్స్ ఎమోషన్స్ అండ్ మిస్టరీ ఎలిమెంట్స్ ఉన్న ప్రాధాన్యత కలిగిన పాత్రను ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది.
తుడక్కమ్ మూవీ ఫీమేల్ సెంట్రిక్ క్రైమ్ థ్రిల్లర్ గా కనిపిస్తోంది. ఇందులో విస్మయ చాలా నేచురల్ గా యాక్ట్ చేసినట్లు, ట్రైలర్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తోంది.
మోహన్‌లాల్ ఆనందం
తన కుమార్తె నటిగా మారుతున్న సందర్భంలో మోహన్‌లాల్ ప్రత్యేకంగా స్పందించారు. "నా కుమార్తె విస్మయ 'తుడక్కమ్' చిత్రంతో తన మొదటి అడుగు వేస్తోంది. మీ అందరి ప్రేమ, ఆశీస్సులు ఆమెకు ఉంటాయని ఆశిస్తున్నాను" అని పంచుకున్నారు.
ట్రెండ్ వర్కౌట్ అవుతుందా?
టాలీవుడ్ లేదా బాలీవుడ్‌లతో పోలిస్తే మలయాళంలో కేవలం 'స్టార్ కిడ్' బ్యాక్‌గ్రౌండ్ ఉంటే ప్రేక్షకులు ఆదరించడం కష్టమే. దుల్కర్ సల్మాన్, ఫహద్ ఫాజిల్, ప్రణవ్ మోహన్‌లాల్ వంటి నటులందరూ కేవలం సరైన కథల ఎంపిక, స్వయంకృషితోనే తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడు విస్మయ కూడా రొటీన్ కమర్షియల్ ఫార్మాట్‌కు దూరంగా 'తుడక్కమ్' వంటి ప్రయోగాత్మక కాన్సెప్ట్ చిత్రంతో రావడం ఆమె పరిణతికి నిదర్శనం. ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీల కారణంగా మలయాళ డబ్బింగ్ కంటెంట్‌కు తెలుగులో భారీ డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. ఈ చిత్రం తెలుగు డిజిటల్ వీక్షకులలో కూడా ఆసక్తి రేకెత్తించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


