ఓటీటీలోకి సూపర్ సిరీస్.. ఇస్రో చంద్రయాన్ సక్సెస్ స్టోరీపై డాక్యుమెంటరీ.. ఇక్కడ చూడండి

ఇస్రో చంద్రయాన్ సక్సెస్ స్టోరీపై ఓ అదిరిపోయే డాక్యుమెంటరీ రాబోతోంది. స్పేస్ సైన్స్ అంటే ఇష్టపడే ప్రేక్షకులకు ఇది సూపర్ సిరీస్ కానుంది. జియోహాట్‌స్టార్ లో దీనిని చూడొచ్చు.

Published on: Dec 24, 2025, 16:04:41 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇండియా గర్వించదగ్గ చంద్రయాన్ ప్రయోగాలు ఇప్పుడు వెబ్ సిరీస్ రూపంలో రాబోతున్నాయి. ది వైరల్ ఫీవర్ (TVF) నిర్మాణంలో 'స్పేస్ జెన్ - చంద్రయాన్' (Space Gen – Chandrayaan) అనే సిరీస్ త్వరలో జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇస్రో శాస్త్రవేత్తల కృషి, చంద్రయాన్ 1, 2, 3 మిషన్ల వెనుక ఉన్న అలుపెరగని పోరాటాన్ని ఇందులో చూపించనున్నారు.

ఓటీటీలోకి సూపర్ సిరీస్.. ఇస్రో చంద్రయాన్ సక్సెస్ స్టోరీపై డాక్యుమెంటరీ.. ఇక్కడ చూడండి
ఓటీటీలోకి సూపర్ సిరీస్.. ఇస్రో చంద్రయాన్ సక్సెస్ స్టోరీపై డాక్యుమెంటరీ.. ఇక్కడ చూడండి

స్పేస్ జెన్ చంద్రయాన్ వెబ్ సిరీస్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చంద్రునిపై జరిపిన అద్భుత ప్రయోగాల చరిత్రను కళ్లకు కట్టేందుకు జియోహాట్‌స్టార్ సిద్ధమైంది. ప్రముఖ కంటెంట్ క్రియేటర్స్ టీవీఎఫ్ (The Viral Fever) ఈ సిరీస్‌ను నిర్మిస్తోంది. ఇది చంద్రయాన్ మిషన్ పై తెరవెనుక జరిగిన తతంగాన్ని కళ్లకు కట్టనుంది.

ఈ సిరీస్ గురించి అనౌన్స్ చేస్తూ.. మేకర్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "కలలు కనేవారి కోసం.. వాటిని నిజం చేసేవారి కోసం.. చంద్రుడి వైపు చూసే ప్రతి భారతీయుడి కోసం.. 'స్పేస్ జెన్ - చంద్రయాన్' త్వరలో జియోహాట్‌స్టార్‌లో ల్యాండ్ అవుతోంది" అని క్యాప్షన్ ఇచ్చారు.

చంద్రయాన్ జర్నీ గురించి తెలుసా?

చంద్రయాన్ అనేది ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక లూనార్ ప్రోగ్రామ్. చంద్రుడిపై నీరు, ఖనిజాలు, రసాయనాలను అధ్యయనం చేయడం దీని లక్ష్యం. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ మొత్తంగా మూడు ప్రయోగాలు చేశారు. వీటిలో ఒకటి మాత్రం విఫలం కాగా.. మూడో ప్రయోగంతో ఇస్రో చరిత్ర సృష్టించింది.

1. చంద్రయాన్-1 (2008)

అక్టోబర్ 22, 2008న శ్రీహరికోట నుంచి చంద్రయాన్ 1ను ప్రయోగించారు. ఇది భారత్ చేపట్టిన తొలి లూనార్ ప్రోగ్రామ్. చంద్రుడి ఉపరితలంపై నీటి అణువులు ఉన్నాయని ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత ఈ మిషన్‌దే. ఆగస్టు 2009లో కమ్యూనికేషన్ తెగిపోయినప్పటికీ, ఇది తన ప్రధాన లక్ష్యాలను చేరుకుంది.

2. చంద్రయాన్-2 (2019)

ఇందులో ఆర్బిటర్, విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ఉన్నాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగడం దీని లక్ష్యం. దురదృష్టవశాత్తు ల్యాండింగ్‌కు కాస్త ముందు విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోయాయి. కానీ ఆర్బిటర్ మాత్రం విజయవంతంగా కక్ష్యలోకి చేరి, అమూల్యమైన సమాచారాన్ని అందించింది. అది చంద్రయాన్-3కి పునాది వేసింది.

3. చంద్రయాన్-3 (2023)

ఆగస్టు 23, 2023న భారత్ చరిత్ర సృష్టించింది. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం (South Pole) పై సాఫ్ట్ ల్యాండింగ్ జరిపింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొట్టమొదటి దేశంగా భారత్ అవతరించింది. అక్కడ సల్ఫర్, ఆక్సిజన్, అల్యూమినియం వంటి మూలకాలను రోవర్ గుర్తించింది.

ఈ అద్భుతమైన ప్రయాణంపై సిరీస్ రానుండటంతో సైన్స్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. స్ట్రీమింగ్ తేదీని జియోహాట్‌స్టార్ త్వరలోనే అనౌన్స్ చేయనుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More