...
...
Next Story

జియోహాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్, షోస్ ఇవే.. లిస్టులో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ

మీరు మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడాలనుకుంటున్నారా? అయితే జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న టాప్ 10 కంటెంట్ జాబితా ఇక్కడ ఉంది. ఐఎండీబీ రేటింగ్ ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో రియాలిటీ షోల నుంచి పాత క్లాసిక్ సినిమాల వరకు అన్నీ ఉన్నాయి.

Published on: Jan 28, 2026, 19:34:11 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

వీకెండ్‌లో ఇంట్లోనే కూర్చుని మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెతుకుతున్నారా? అయితే జియోహాట్‌స్టార్‌లో ప్రస్తుతం దూసుకుపోతున్న టాప్ 10 సినిమాలు, వెబ్ సిరీస్‌, షోస్ వివరాలు, వాటి రేటింగ్స్ ఇక్కడ ఉన్నాయి. వీటిలో లేటెస్ట్ గా వచ్చిన కంటెంట్ తోపాటు పాతవి కూడా ఉండటం విశేషం. మరి అవేంటో చూడండి.

లాఫర్ చెఫ్స్ (Laughter Chefs)

జియోహాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్, షోస్ ఇవే.. లిస్టులో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ (Jio Hotstar)
జియోహాట్‌స్టార్‌లో టాప్ 10 ట్రెండింగ్ మూవీస్, వెబ్ సిరీస్, షోస్ ఇవే.. లిస్టులో తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ (Jio Hotstar)

ఈ జాబితాలో మొదటి స్థానంలో కలర్స్ ఛానెల్ రియాలిటీ షో 'లాఫర్ చెఫ్స్' ఉంది. ఇటీవల సీజన్ 3 ఫినాలే ఎపిసోడ్ ప్రసారమైంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 8.5 ఉంది.

స్ప్లిట్స్‌విల్లా సీజన్ 16 (Splitsvilla Season 16)

రెండో స్థానంలో డేటింగ్ రియాలిటీ షో స్ప్లిట్స్‌విల్లా ఉంది. ఈసారి కరణ్ కుంద్రా, తేజస్వి ప్రకాష్ ఈ షోను హోస్ట్ చేస్తున్నారు. దీనికి ఐఎండీబీ రేటింగ్ 3.8 మాత్రమే.

గుస్తాఖ్ ఇష్క్ (Gustakh Ishq)

జాబితాలో మూడో స్థానంలో విజయ్ వర్మ, ఫాతిమా సనా షేక్ నటించిన రొమాంటిక్ మూవీ 'గుస్తాఖ్ ఇష్క్' నిలిచింది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 8గా ఉంది.

స్పేస్ జెన్: చంద్రయాన్ (Space Gen: Chandrayaan)

నకుల్ మెహతా నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ఈ స్పేస్ జెన్: చంద్రయాన్. ఇస్రో చంద్రయాన్ మిషన్ల చుట్టూ తిరిగే ఈ సిరీస్ నాలుగో స్థానంలో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 5గా ఉంది.

ఏ నైట్ ఆఫ్ ది సెవెన్త్ కింగ్‌డమ్ (A Knight of the Seven Kingdom)

ఇది గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్‌కు ప్రీక్వెల్ కావడం విశేషం. హెచ్‌బీఓ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ ఐదో స్థానంలో ఉంది. దీని ఐఎండీబీ రేటింగ్ 6.8.

బోర్డర్ (Border)

ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ఇది. మొత్తం 8 సీజన్లు ఉన్న ఈ సిరీస్ ఏడో స్థానంలో నిలిచింది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 9.2గా ఉండటం విశేషం.

లెవన్ (Eleven)

నవీన్ చంద్ర లీడ్ రోల్లో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'లెవన్' ఎనిమిదో స్థానంలో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 7.4గా ఉంది.

ది ట్రైన్ ఆఫ్ డెత్ (The Train of Death)

హారర్ మూవీ అయిన 'ది ట్రైన్ ఆఫ్ డెత్' తొమ్మిదో స్థానంలో ఉంది. దీనికి ఐఎండీబీ రేటింగ్ కేవలం 4.7.

బిగ్ బాస్ (Bigg Boss)

ప్రముఖ రియాలిటీ షో 'బిగ్ బాస్' ఈ జాబితాలో పదో స్థానంలో కొనసాగుతోంది. ఈ మధ్యే హిందీ 19వ సీజన్ పూర్తయిన విషయం తెలిసిందే.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe