NTR Trivikram: అఫీషియల్.. త్రివిక్రమ్‌తో జూనియర్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్.. పోస్టర్,క్యాప్షన్ చూస్తే పూనకాలే..

NTR Trivikram: జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో నెక్ట్స్ మూవీ అఫీషియల్ గా అనౌన్స్ అయింది. తారక్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఓ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Published on: Jun 29, 2026, 17:31:25 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

NTR Trivikram: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన నెక్ట్స్ మూవీ గురించి వెల్లడించాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన నెక్స్ట్ భారీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేస్తూ తారక్ అఫీషియల్ ట్వీట్ చేయడంతో మొత్తం సోషల్ మీడియా ఒక్కసారిగా షేక్ అయిపోయింది.

NTR Trivikram: అఫీషియల్.. త్రివిక్రమ్‌తో జూనియర్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్.. పోస్టర్,క్యాప్షన్  చూస్తే పూనకాలే..
NTR Trivikram: అఫీషియల్.. త్రివిక్రమ్‌తో జూనియర్ ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్.. పోస్టర్,క్యాప్షన్ చూస్తే పూనకాలే..

"శివుడి పుత్రుడు.. పార్వతి గర్వకారణం.. ఎటర్నల్ కమాండర్.. మరోసారి త్రివిక్రమ్‌తో" అంటూ తారక్ పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో ఓ రేంజ్‌లో ట్రెండ్ అవుతోంది.

అరవింద సమేత తర్వాత మళ్లీ అదే క్రేజీ కాంబో

గతంలో జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఆ ఎమోషనల్ యాక్షన్ డ్రామా తారక్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. ఆ బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత ఈ ఇద్దరు టాప్ స్టార్స్ మళ్లీ చేతులు కలపడంతో ఈ నయా ప్రాజెక్ట్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తారక్ హింట్ ఇచ్చిన ఆ పవర్‌ఫుల్ లైన్స్ వెనుక కథ ఏంటి?

తారక్ తన ట్వీట్‌లో పెట్టిన లైన్స్ చూస్తుంటే ఈ సినిమా ఒక పవర్‌ఫుల్ మైథలాజికల్ టచ్ ఉన్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. శివుడి పుత్రుడు, పార్వతి గర్వకారణం, ఎటర్నల్ కమాండర్ అంటే అది ఖచ్చితంగా 'సుబ్రమణ్య స్వామి' (కార్తికేయుడు) క్యారెక్టర్‌ను స్ఫూర్తిగా తీసుకుని రాసుకున్న కథే అని నెటిజన్లు ఫిక్సయిపోయారు.

తాజాగా వచ్చిన పోస్టర్ లో ఓ త్రిశూలాన్ని చూడొచ్చు. బ్యాక్‌గ్రౌండ్ లో యుద్ధ వాతావరణం, శవాలు, మంటలు చూస్తుంటే.. చాలా ఇంటెన్స్ గా కనిపిస్తోంది. వన్ స్పియర్ వన్ పర్పస్ వన్ డివైన్ రెకనింగ్ (ఒక ఈటె, ఒక లక్ష్యం, ఒక దైవిక లెక్క) అనే పవర్ ఫుల్ లైన్స్ ఆ పోస్టర్ పై చూడొచ్చు.

త్రివిక్రమ్ మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్, ఎన్టీఆర్ రేంజ్ మాస్ పర్ఫార్మెన్స్ తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయం. ఈ సినిమాకు తాత్కాలికంగా NTRxTrivikram అనే టైటిల్ పెట్టారు. అయితే గాడ్ ఆఫ్ వార్ అంటూ చాలా రోజులుగా వస్తున్న టైటిలే ఖరారు చేస్తారా లేక మరేదైనా పెడతారా అన్నది చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More