Sam Neill: 'జురాసిక్ పార్క్' సినిమాలో డాక్టర్ అలన్ గ్రాంట్ క్యారెక్టర్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్ లెజెండరీ యాక్టర్ సామ్ నీల్ సోమవారం (జులై 13) కన్నుమూశారు. 78 ఏళ్ల వయసున్న ఆయన ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్న తన నివాసంలో చివరి శ్వాస విడిచారు. ఈ విషాద వార్తను సామ్ నీల్ ఫ్యామిలీ మెంబర్స్ ఆయన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా కన్ఫర్మ్ చేశారు.
క్యాన్సర్‌పై ఐదేళ్ల సుదీర్ఘ పోరాటం

ఆయన మరణం చాలా అకస్మాత్తుగా జరిగిందని కుటుంబ సభ్యులు తెలిపారు. సిడ్నీలోని సెయింట్ విన్సెంట్స్ ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ ఆయనకు అందించిన సేవలకు థాంక్స్ చెప్పారు. ఈ కష్ట సమయంలో తమ ప్రైవసీని గౌరవించాలని ఫ్యామిలీ కోరింది.
హాలీవుడ్ సీనియర్ నటుడు అయిన సామ్ నీల్ గత ఐదేళ్లుగా నాన్-హాడ్జ్కిన్ లింఫోమా అనే ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఒకానొక దశలో ఆయనకు కీమోథెరపీ కూడా పనిచేయడం మానేసింది. అయితే ఇమ్యూన్ సిస్టమ్‌ను మార్చే ఒక జెనెటిక్ థెరపీ వల్ల ఆయన క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆస్ట్రేలియా ఛానెల్ సెవెన్ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తాను క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకొని బాగానే ఉన్నానని సామ్ నీల్ స్వయంగా ప్రకటించారు. వైరస్ సాయంతో టీ-సెల్స్‌ను రీప్రోగ్రామ్ చేసే 'CAR T-సెల్ థెరపీ' వల్ల తన బాడీలో క్యాన్సర్ కణాలు పూర్తిగా నశించాయని, స్కాన్ రిపోర్ట్స్‌లో అంతా నార్మల్‌గా వచ్చిందని చెప్పారు. కానీ ఇంతలోనే ఈ హఠాన్మరణం ఫ్యాన్స్‌ను షాక్‌కు గురిచేసింది.
'అలన్ గ్రాంట్' క్యారెక్టర్‌తో గ్లోబల్ స్టార్‌డమ్
1977లో వచ్చిన 'స్లీపింగ్ డాగ్స్' సినిమాతో సామ్ నీల్ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎటాక్ ఫోర్స్ Z (1982), డెడ్ కామ్ (1989), ద పియానో (1993) లాంటి క్లాసిక్ సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేశారు. అయితే 1993లో లెజెండరీ డైరెక్టర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్ విజువల్ వండర్ 'జురాసిక్ పార్క్' సినిమాలో డాక్టర్ అలన్ గ్రాంట్ క్యారెక్టర్‌తో ఆయన గ్లోబల్ స్టార్ అయిపోయారు.
డైనోసార్ల ప్రపంచాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ స్పీల్‌బర్గ్ క్రియేట్ చేసిన ఆ వండర్‌లో సామ్ నీల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఆ తర్వాత జురాసిక్ పార్క్ III (2001), జురాసిక్ వరల్డ్ డొమినియన్ (2022) సినిమాల్లోనూ అదే క్యారెక్టర్‌ను కొనసాగించి మెప్పించారు. ఆయన మరణంతో హాలీవుడ్ ఒక గొప్ప వర్సటైల్ యాక్టర్‌ను కోల్పోయింది.
{{/usCountry}}డైనోసార్ల ప్రపంచాన్ని స్క్రీన్ మీద చూపిస్తూ స్పీల్‌బర్గ్ క్రియేట్ చేసిన ఆ వండర్‌లో సామ్ నీల్ యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అని చెప్పాలి. ఆ తర్వాత జురాసిక్ పార్క్ III (2001), జురాసిక్ వరల్డ్ డొమినియన్ (2022) సినిమాల్లోనూ అదే క్యారెక్టర్‌ను కొనసాగించి మెప్పించారు. ఆయన మరణంతో హాలీవుడ్ ఒక గొప్ప వర్సటైల్ యాక్టర్‌ను కోల్పోయింది.
{{/usCountry}}