ఓటీటీలోకి రూ.7600 కోట్ల హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ.. నాలుగు నెలల తర్వాత స్ట్రీమింగ్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి ఓ హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ కు వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.7600 కోట్లకుపైగా వసూలు చేసిన ఈ సినిమా తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుండటం విశేషం.
హాలీవుడ్‌లో ఇప్పటికే ఎన్నో సంచలనాలు సృష్టించిన జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన మరో మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ సినిమా జులై 2న థియేటర్లలో రిలీజ్ కాగా.. మొత్తానికి నాలుగు నెలల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వస్తోంది. ఇప్పటికే ప్రైమ్ వీడియోలో రెంట్ విధానంలో అందుబాటులోకి రాగా.. ఇప్పుడు ఫ్రీగా మరో ఓటీటీలోకి వస్తోంది.

జురాసిక్ వరల్డ్ రీబర్త్ ఓటీటీ రిలీజ్ డేట్
జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఏడో సినిమా, జురాసిక్ వరల్డ్ నుంచి వచ్చిన నాలుగో మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.7600 కోట్లు వసూలు చేసింది. అలాంటి మూవీ ఇప్పుడు నవంబర్ 14 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మంగళవారం (అక్టోబర్ 28) ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాను ఇంగ్లిష్ తోపాటు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో చూడొచ్చు. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో, బుక్ మై షో స్ట్రీమ్ లలో రెంట్ విధానంలో అందుబాటులో ఉన్నా.. ఇప్పుడు జియోహాట్‌స్టార్ లోకి ఫ్రీగా వస్తోంది. అంటే సబ్‌స్క్రైబర్లందరూ నాలుగు భాషల్లో ఈ సినిమా చూడొచ్చు.
జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీ గురించి..
జురాసిక్ వరల్డ్ రీబర్త్ మూవీని గారెత్ ఎడ్వర్డ్స్ డైరెక్ట్ చేశాడు. ఈ మూవీలో స్కార్లెట్ జాన్సన్, మహర్షల అలీ, జొనాథన్ బెయిలీ, రూపర్ట్ ఫ్రెండ్, మాన్యుయెల్ గార్సియాలాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా జులై 2న థియేటర్లలో రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 86 కోట్ల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.7600 కోట్లు వసూలు చేసింది.
మూడు దశాబ్దాలకుపైగా ప్రేక్షకులను అలరిస్తున్న జురాసిక్ పార్క్ ఫ్రాంఛైజీ నుంచి వచ్చిన ఏడో సినిమా ఇది. దీనికి ఐఎండీబీలో 5.9 రేటింగ్ నమోదైంది. 1993లో తొలిసారి జురాసిక్ పార్క్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత మరో ఆరు మూవీస్ ఈ ఫ్రాంఛైజీ నుంచి వచ్చాయి. అయితే తొలి సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో పోలిస్తే తర్వాతి సినిమాలకు ఆ స్థాయి రెస్పాన్స్ రాలేదనే చెప్పాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


