ప్రైమ్ వీడియోలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన 4 సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే.. ఈ వెబ్ సిరీస్ కోసమే రూ.3860 కోట్లు
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎన్నో ఒరిజినల్ మూవీస్, వెబ్ సిరీస్ ఉన్నాయి. అయితే ఈ మధ్య వాటిని అత్యంత భారీ బడ్జెట్ తో ఆ ఓటీటీ రూపొందిస్తోంది. వీటిలో ఒక వెబ్ సిరీస్ కోసం అయితే ఏకంగా రూ.3860 కోట్లు ఖర్చు పెట్టడం విశేషం.
ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) తరచూ కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలవుతూనే ఉంటాయి. వీటిలో చాలా వరకు అమెజాన్ ప్రైమ్ సొంతంగా రూపొందించే ఒరిజినల్స్ ఉంటాయి. ఈ సినిమాలు, సిరీస్‌లు మీకు మరే ఇతర ప్లాట్‌ఫామ్స్ లోనూ కనిపించవు. అయితే ఈ కేటగిరీలో అత్యంత ఖరీదైన ప్రాజెక్టుల గురించి మీకు తెలుసా? వీటిని రూపొందించడానికి వందల కోట్లు ఖర్చు చేసింది. ప్రైమ్ వీడియోలో ఉన్న ఈ 3 అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ గురించి తెలుసుకోండి.

1. ది టుమారో వార్ (The Tomorrow War)
ఇది భవిష్యత్తులో జరిగే యుద్ధం కథ. ఈ యుద్ధంలో మనుషులు ఓడిపోతే.. మొత్తం మానవాళి అంతమైపోతుంది. భవిష్యత్తులో ఏలియన్స్‌తో జరుగుతున్న ఈ యుద్ధంలో మనుషులు తక్కువ అవుతుండడంతో, ఒక టైమ్ ట్రావెల్ టెక్నిక్‌ను ఉపయోగించి గతం నుంచి ప్రజలను తీసుకువస్తారు. ఈ సినిమాను నిర్మించడానికి అమెజాన్ ప్రైమ్‌కు రూ.1660 కోట్లు ఖర్చు కావడం విశేషం. 2021లోనే ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టింది. దీనికి ఐఎండీబీలో 6.6 రేటింగ్ ఉంది.
2. హెడ్స్ ఆఫ్ స్టేట్ (Heads of State)
మన ఇండియన్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటించిన మూవీ ఇది. ఈ కథ బ్రిటన్ ప్రధానమంత్రి, అమెరికా అధ్యక్షుడి చుట్టూ తిరుగుతుంది. వీరు వివిధ అంశాలపై ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. కానీ వారి వైమానిక దళంపై అకస్మాత్తుగా దాడి జరిగినప్పుడు.. విషయం తీవ్రంగా ఉందని వారికి అర్థమవుతుంది. ప్రపంచంలో ఉన్న ఈ సంక్షోభం కారణంగా ఇద్దరూ కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటారు. ఈ సినిమాను నిర్మించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో రూ.1110 కోట్లు ఖర్చు చేసింది. ఇది ఈ ఏడాది జులై 2న ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. దీనికి ఐఎండీబీ రేటింగ్ 6.4గా ఉంది.
3. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ (The Lord of the Rings)
ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ అనేది ఓ వెబ్ సిరీస్. ఇది 2022 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. అద్భుతమైన వీఎఫ్‌ఎక్స్, పవర్‌ఫుల్ కథనం ఉన్న ఈ వెబ్ సిరీస్‌ను రూపొందించడానికి అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.3860 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఖర్చు కేవలం ఈ సిరీస్ మొదటి సీజన్‌కు మాత్రమే అయింది. దీని కథ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చింది. ఈ సిరీస్ ఐఎండీబీ రేటింగ్ 6.4గా ఉంది. మరో సీజన్ కూడా రానుంది.
4. సిటడెల్ (Citadel)
ప్రియాంకా చోప్రానే నటించిన మరో వెబ్ సిరీస్ ఈ సిటడెల్. ఈ సిరీస్ కోసం ప్రైమ్ వీడియో సుమారు రూ.2600 కోట్లు ఖర్చు చేసింది. ఆరు ఎపిసోడ్ల ఈ వెబ్ సిరీస్ 2023లో వచ్చింది. అయితే దీనికి ఆశించిన మేర రెస్పాన్స్ రాలేదు. దీనికి ఇండియన్ వెర్షన్ సిటడెల్: హనీ బన్నీ కూడా ప్రైమ్ వీడియోలోనే వచ్చింది. ఇందులో సమంత నటించింది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


