Kajal Aggarwal: విడాకులకు కారణం చెప్పిన కాజల్ అగర్వాల్.. డిన్నర్‌కి వెళ్లినా అదే పనంటూ సంచలన వ్యాఖ్యలు.. తన భర్తతో ఇలా!
Kajal Aggarwal: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియా అడిక్షన్, సహనం తగ్గడమే నేటితరం జంటలలో విడాకులు పెరగడానికి ప్రధాన కారణమని పేర్కొంది. తన భర్త గౌతమ్ కిచ్లూతో ఆమె ఎలా క్వాలిటీ టైమ్ స్పెండ్ చేస్తుందో చెప్పుకొచ్చింది.
Kajal Aggarwal: నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం మనుషుల బంధాలపై విపరీతంగా పడుతోందని కాజల్ అగర్వాల్ ఆవేదన వ్యక్తం చేసింది. "చాలామంది జంటలు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి కూడా సమయం కేటాయించడం లేదు. డిన్నర్ డేట్స్‌కి వెళ్లినా కూడా చేతుల్లో ఫోన్లు పట్టుకుని స్క్రోలింగ్ చేయడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు" అని కాజల్ గుర్తుచేసింది.

కాజల్ అగర్వాల్ కామెంట్స్
నేటి టెక్నాలజీ యుగంలో బంధాలు చాలా వీక్ గా మారిపోయాయి. ఈ విషయాన్ని కాజల్ అగర్వాల్ మరోసారి ప్రస్తావించింది. ఒకరి అభిప్రాయాలను మరొకరు వినే ఓపిక లేకపోవడం, సోషల్ మీడియా అడిక్షన్ వల్ల కపుల్స్ మధ్య బంధం ఉండట్లేదని కాజల్ చెప్పింది. దంపతుల మధ్య అసలు మాటలే ఉండటం లేదని, ఇది చివరికి విడాకులకు దారితీస్తోందని కాజల్ కుండబద్దలు కొట్టింది.
కాజల్ పర్సనల్ సీక్రెట్
ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితం, పెళ్లి బంధం గురించి కూడా కాజల్ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. తాను, తన భర్త గౌతమ్ కిచ్లూ ప్రతి వారంలో కచ్చితంగా ఒక రోజు డిన్నర్‌కి బయటకు వెళ్తామని కాజల్ తెలిపింది. ఆ సమయంలో ఫోన్‌లను పక్కనపెట్టి కేవలం ఒకరితో ఒకరు క్వాలిటీ టైమ్ గడుపుతామని చెప్పింది. ఎంత బిజీగా ఉన్నా సరే భాగస్వామితో మాట్లాడటం, వారి ఆలోచనలను పంచుకోవడం అనేది ప్రతి ఒక్కరూ పాటించాలని కాజల్ సూచించింది.
బలమైన అనుబంధానికి, సుదీర్ఘ వైవాహిక జీవితానికి ఓపెన్ కమ్యూనికేషనే అసలైన పిల్లర్ అని కాజల్ ఇచ్చిన మెసేజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
కాజల్ ట్రెండీ మెసేజ్
నేటి డిజిటల్ లైఫ్‌స్టైల్‌లో చాలామంది దాచుకునే చేదు నిజాన్ని కాజల్ అగర్వాల్ చాలా బోల్డ్‌గా బయటపెట్టింది. సాధారణంగా సెలబ్రిటీల విడాకులు, బ్రేకప్ వార్తలు తరచూ వార్తల్లో నిలుస్తుంటాయి. అయితే, కేవలం గ్లామర్ వరల్డ్ మాత్రమే కాకుండా ప్రతీ సగటు కామన్ మ్యాన్ లైఫ్‌లోనూ ఈ 'డిజిటల్ డిస్ట్రాక్షన్' పెను ముప్పుగా మారిందని కాజల్ ఎత్తిచూపడంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్‌కి కేవలం సినిమాల పరంగానే కాకుండా, పర్సనల్ లైఫ్‌లో డిజిటల్ డిటాక్స్ అవసరమని చెప్పడం నేటి యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యే అంశం. వీక్లీ డిన్నర్ డేట్స్ అండ్ స్క్రీన్-ఫ్రీ టైమ్ వంటి సింపుల్ రూల్స్ పాటించడం ద్వారా డివోర్స్ రేట్స్‌ని, కమ్యూనికేషన్ గ్యాప్‌ని తగ్గించవచ్చన్న కాజల్ ప్రాక్టికల్ విస్డమ్ ప్రస్తుతం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.
ఓటీటీలో మూవీ
కాజల్ అగర్వాల్ రీసెంట్ గా నటించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లో ఈ సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పుడు జియోహాట్ స్టార్ లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇందులో కాజల్ అగర్వాల్ లాయర్ గా నటించింది. ఆహార కల్తీ, వ్యవసాయంలో పురుగు మందుల వినియోగం వంటి అంశాల చుట్టూ ఈ మూవీ కథ సాగుతుంది.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


