Kajal Aggarwal: కార‌వాన్‌లోకి స‌డెన్‌గా వ‌చ్చి ష‌ర్ట్ విప్పేశాడు.. భ‌యంతో నా కాళ్లు, చేతులు వ‌ణికిపోయాయి: కాజల్ అగర్వాల్

Kajal Aggarwal: టాలీవుడ్ ‘చందమామ’ కాజల్ అగర్వాల్ షూటింగ్ కారవాన్‌లో తనకు ఎదురైన ఒక షాకింగ్ సంఘటనను బయటపెట్టింది. ఎలాంటి పర్మిషన్ లేకుండా ఓ వ్యక్తి తన కారవాన్ లోకి వచ్చి షర్ట్ విప్పేశాడని చెప్పింది. కాజల్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఏం జరిగిందో ఇక్కడ చదివేయండి.

Published on: Jul 28, 2026, 11:22:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kajal Aggarwal: టాలీవుడ్ లో తనదైన అందం, అభినయంతో ‘చందమామ’గా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్. తాజాగా ‘ది ఇండియా స్టోరీ’ మూవీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది ఈ భామ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాజల్ ఓ షాకింగ్ సంఘటన గురించి చెప్పుకొచ్చంది.

కార‌వాన్‌లోకి స‌డెన్‌గా వ‌చ్చి ష‌ర్ట్ విప్పేశాడు.. భ‌యంతో నా కాళ్లు, చేతులు వ‌ణికిపోయాయి: కాజల్ అగర్వాల్
కార‌వాన్‌లోకి స‌డెన్‌గా వ‌చ్చి ష‌ర్ట్ విప్పేశాడు.. భ‌యంతో నా కాళ్లు, చేతులు వ‌ణికిపోయాయి: కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్ కు భయం

ఒక సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత తన కారవాన్‌లో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగిందని కాజల్ అగర్వాల్ వెల్లడించింది. "ఏలాంటి పర్మిషన్ లేకుండా ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఒక వ్యక్తి హఠాత్తుగా నా కారవాన్‌లోకి వచ్చాడు. లోపలికి రాగానే అతడు తన షర్ట్ తీసేశాడు’’ అని కాజల్ అగర్వాల్ తెలిపింది.

కాళ్లు, చేతులు వణికాయి

‘‘ఆ వ్యక్తి తన ఛాతీపై వేయించుకున్న నా పేరు టాటూను చూపించాడు. ఆ క్షణంలో తీవ్ర భయాందోళనకు గురయ్యా. నా కాళ్లు చేతులు వణికిపోయాయి" అని కాజల్ ఆ భయణాక క్షణాలను గుర్తుచేసుకుంది.

వార్నింగ్ ఇచ్చి

"నటిగా నాపై అభిమానులు చూపించే ప్రేమాభిమానాలను నేను ఎప్పుడూ గౌరవిస్తాను. నా పేరు పచ్చబొట్టు పొడిపించుకోవడం ఆనందమే కావచ్చు, కానీ ఒక మహిళ ఒంటరిగా ఉన్న ప్రైవేట్ స్పేస్‌లోకి అనుమతి లేకుండా రావడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.

అందుకే ఆ వ్యక్తికి పరిస్థితిని అర్థమయ్యేలా చెప్పా. కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చి పంపించా’’ అని కాజల్ అగర్వాల్ పేర్కొంది.

వ్యక్తిగత స్వేచ్ఛపై చర్చ

ఈ ఘటన కేవలం ఒక అభిమాని లేదా సాంకేతిక నిపుణుడి అతి ప్రవర్తన మాత్రమే కాదు. చిత్ర పరిశ్రమలో నటీనటులకు, ముఖ్యంగా మహిళా ఆర్టిస్టులకు కారవాన్ల వద్ద ఉండే భద్రతా ప్రమాణాల తీవ్రతను మరోసారి తెరపైకి తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది.

సాధారణంగా కారవాన్‌ను నటీనటులు తమ వ్యక్తిగత అడ్డాగా భావిస్తారు. అక్కడ కూడా ఇలా పర్మిషన్ లేకుండా లోపలికి వెళ్లడం, భయపెట్టడం లాంటివి జరగడం భద్రతా సిబ్బంది వైఫల్యాన్నే ఎత్తిచూపుతోంది.

బాలయ్య మూవీలో

ప్రస్తుతం బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఎన్‌బీకే111 (వర్కింగ్ టైటిల్) చిత్రంలో కాజల్ నటిస్తోంది. మరోవైపు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ 'రామాయణ'లో మండోదరి పాత్ర పోషిస్తోంది.

కాజల్ రీసెంట్ ఫిల్మ్ ది ఇండియా స్టోరీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో కాజల్ యాక్టింగ్ కు మాత్రం ప్రశంసలు దక్కుతున్నాయి. తాజాగా వర్కింగ్ స్పేస్‌లో వ్యక్తిగత హద్దులు, ప్రైవసీని ప్రతీ ఒక్కరూ కాపాడాలని కాజల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More