Mahesh Babu: రామ్ చరణ్, అల్లు అర్జున్, నాకు అది లక్కీ బ్యానర్.. నా అభిమానులు ఈ సినిమా చూడాలి: మహేష్ బాబు స్పెషల్ వీడియో

Mahesh Babu: ఘట్టమనేని వారసుడు జయకృష్ణ డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం'కు సూపర్‌స్టార్ మహేష్ బాబు సపోర్ట్ గా నిలిచాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న నేపథ్యంలో స్పెషల్ వీడియోను సూపర్ స్టార్ రిలీజ్ చేశాడు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు మహేష్.

Published on: Jul 26, 2026, 14:40:22 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mahesh Babu: సూపర్‌స్టార్ కృష్ణ వారసత్వాన్ని, దివంగత రమేష్ బాబు జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్తూ ఘట్టమనేని కుటుంబం నుంచి మరో కొత్త వారసుడు వెండితెరకు పరిచయమవుతున్నాడు. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా నటిస్తున్న తొలి చిత్రం 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ మూవీ జూలై 30న రిలీజ్ కానుంది.

రామ్ చరణ్, అల్లు అర్జున్, నాకు అది లక్కీ బ్యానర్.. నా అభిమానులు ఈ సినిమా చూడాలి: మహేష్ బాబు స్పెషల్ వీడియో
రామ్ చరణ్, అల్లు అర్జున్, నాకు అది లక్కీ బ్యానర్.. నా అభిమానులు ఈ సినిమా చూడాలి: మహేష్ బాబు స్పెషల్ వీడియో

మహేష్ బాబు వీడియో

అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన శ్రీనివాస మంగాపురం సినిమాను వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్విని దత్ సమర్పిస్తున్నారు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ సీనియర్ భామ రవీనా టండన్ కుమార్తె రాషా తడానీ (Rasha Thadani) హీరోయిన్‌గా పరిచయమవుతోంది. తాజాగా తన అన్న కొడుకు సినిమా కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా వీడియో మెసేజ్ విడుదల చేస్తూ మేకర్స్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.

వైజయంతీ మూవీస్ సెంటిమెంట్

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ వైజయంతీ మూవీస్ బ్యానర్‌తో తమ కుటుంబానికి ఉన్న ప్రత్యేక బంధాన్ని గుర్తుచేసుకున్నారు. "నాకు, అల్లు అర్జున్‌కు, రామ్ చరణ్‌కు వైజయంతీ మూవీస్ లక్కీ బ్యానర్‌గా మారింది. మేమంతా ఈ బ్యానర్‌లోనే డెబ్యూ చేశాం.

అదే లక్ జయకృష్ణకు, రాషా తడానీకి కూడా దక్కాలని కోరుకుంటున్నాను. మా కుటుంబమంతా ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది" అని మహేష్ బాబు తెలిపాడు.

రాజకుమారుడు రిలీజ్ డేట్

అంతేకాకుండా, తన తొలి చిత్రం 'రాజాకుమారుడు' విడుదలైన జూలై 30వ తేదీనే 'శ్రీనివాస మంగాపురం' కూడా ప్రేక్షకుల ముందుకు వస్తుందని మహేష్ బాబు తెలిపాడు. ఈ చిత్ర టీజర్లు, ట్రైలర్లు, పాటలు తనకు ఎంతగానో నచ్చాయని, జీవి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన 'అల్లెల్లె' సాంగ్ తన ఫేవరెట్ సాంగ్ అని చెప్పాడు.

జయకృష్ణ కాన్ఫిడెన్స్

కెమెరా ముందు జయకృష్ణ చాలా కాన్ఫిడెంట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తున్నాడని మహేష్ బాబు ప్రశంసించాడు. కొత్త నటీనటులతో దర్శకుడు అజయ్ భూపతి ఎంతో రియలిస్టిక్, గ్రాండెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను తీర్చిదిద్దారని, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లలో చూసి డెబ్యూ టీమ్‌ను ఆశీర్వదించాలని కోరాడు. నాన్నగారి అభిమానులు, తన అభిమానులు ఈ సినిమాను ఆదరించాలని రిక్వెస్ట్ చేశాడు.

భారీ ఓపెనింగ్స్ ఖాయం!

టాలీవుడ్ ట్రేడ్ విశ్లేషణ ప్రకారం, పెద్ద బ్యానర్ల నుంచి వస్తున్న స్టార్ కిడ్స్ డెబ్యూ సినిమాలకు సరైన కమర్షియల్ హంగులు తోడైతే బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశాలు ఉంటాయి. వైజయంతీ మూవీస్ నిర్మాణ విలువలు, అజయ్ భూపతి టేకింగ్, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కాంబినేషన్ కలసిరావడం 'శ్రీనివాస మంగాపురం' బిజినెస్‌కు మార్కెట్‌లో మంచి హైప్‌ను తెచ్చిపెట్టింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More