Jayakrishna: నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్.. అసలైన యాక్టర్ ఆయన: మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ కామెంట్స్

Jayakrishna Ghattamaneni: రామ్ చరణ్ తన ఫేవరెట్ హీరో అని మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ ఘట్టమనేని చెప్పడం విశేషం. తన శ్రీనివాస మంగాపురం మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

Published on: Jul 22, 2026, 17:40:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Jayakrishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు అన్న రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ తన డెబ్యూ మూవీ 'శ్రీనివాస మంగాపురం' ప్రమోషన్లలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘట్టమనేని కాంపౌండ్ బయట తనకు అత్యంత ఇష్టమైన హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అని ఓపెన్‌గా చెప్పారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఒక బిగ్ స్టార్‌గా ఎదగడం సాధారణ విషయం కాదంటూ చరణ్ సాధించిన అచీవ్‌మెంట్‌ను జయకృష్ణ మనస్ఫూర్తిగా ప్రశంసించారు.

Jayakrishna: నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్.. అసలైన యాక్టర్ ఆయన: మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ కామెంట్స్
Jayakrishna: నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్.. అసలైన యాక్టర్ ఆయన: మహేష్ బాబు అన్న కొడుకు జయకృష్ణ కామెంట్స్

'ఆర్ఎక్స్ 100', 'మంగళవారం' సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ అజయ్ భూపతి ఈ రస్టిక్ అండ్ ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. జులై 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కూతురు రాషా తడాని హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం అవుతోంది.

"రామ్ చరణ్ గారు మై కరెంట్ ఫేవరెట్"

ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో జయకృష్ణను ఘట్టమనేని ఫ్యామిలీ కాకుండా వేరే ఎవరు ఇష్టమైన నటుడని ప్రశ్నించగా, ఆయన వెంటనే రామ్ చరణ్ పేరు చెప్పారు. "రామ్ చరణ్ గారు మై కరెంట్ ఫేవరెట్ హీరో. ఆయన స్టార్ కంటే కూడా ఓ మంచి యాక్టర్, పర్ఫార్మర్. స్టార్ అనేది మన చేతుల్లో లేదు. అది ఆడియెన్స్ కు నచ్చితే వచ్చేది. ఇండస్ట్రీలో ఒక సినిమా చేయడం గొప్ప విషయమే. కానీ సుదీర్ఘకాలం నిలదొక్కుకుంటూ ఒక బిగ్ స్టార్‌గా రూపాంతరం చెందడం నిజంగా మైండ్ బ్లోయింగ్ అచీవ్‌మెంట్" అని జయకృష్ణ పేర్కొన్నారు.

రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమాతో గ్లోబల్ వైడ్‌గా సంపాదించిన క్రేజ్, ఆ తర్వాత పాన్-ఇండియా రేంజ్‌లో నటిస్తున్న తీరు తనను ఎంతగానో ఇన్‌స్పైర్ చేసిందని చెప్పారు. మెగా పవర్ స్టార్ సాధించిన విజయం యంగ్ జెనరేషన్ నటులకు ఎంతో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.

తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో ఇంటెన్స్ లవ్ డ్రామా

తిరుపతి పుణ్యక్షేత్రం బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ప్రేమకథలో వాసు బాబు, మంగ అనే ప్రేమికుల పాత్రల్లో జయకృష్ణ, రాషా తడాని నటించారు. క్యూట్ లవ్ స్టోరీగా ప్రారంభమై ఊహించని వివాదంతో రియలిస్టిక్ యాక్షన్ డ్రామాగా మారే ఈ స్క్రిప్ట్‌లో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు 'వెంకటప్పయ్య నాయుడు' అనే పవర్‌ఫుల్ విలన్ రోల్‌లో కనిపిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్‌ను వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ప్రసిద్ధ నిర్మాత సి. అశ్వనీదత్ సమర్పిస్తుండగా, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పి. కిరణ్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ బాబును 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా పరిచయం చేసిన అశ్వనీదత్, ఇప్పుడు మళ్లీ దశాబ్దాల తర్వాత అదే ఘట్టమనేని వారసుడి డెబ్యూ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తుండటం విశేషం.

జి.వి. ప్రకాష్ మ్యూజిక్.. జులై 30న రిలీజ్

నేషనల్ అవార్డు విన్నర్ జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు అందించిన మెలోడీ పాటలు, మాస్ యాక్షన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. రీసెంట్ గా విడుదలైన 'రావే చెలియా' సాంగ్‌కు ఆడియన్స్ నుంచి వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది.

సూపర్ స్టార్ కృష్ణ లెగసీని, దివంగత రమేష్ బాబు జ్ఞాపకాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యతతో జయకృష్ణ వెండితెరకు వస్తున్నారు. జులై 30న విడుదల కాబోతున్న 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో ఈ యంగ్ హీరో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More