Chiranjeevi: సీక్రెట్ గా మెగా 158 లో చిరంజీవి లుక్ ? రామ్ చరణ్ విజిట్ నుంచి జానీ మాస్టర్ ఇష్యూ వరకు మేకర్స్ మైండ్ గేమ్!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మెగా 158’. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి మెగాస్టార్ వింటేజ్ లుక్ ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. అయితే, ఈ లుక్‌ను బయటకు రాకుండా మూవీ టీమ్ సీక్రెసీ మెయింటైన్ చేస్తోందని టాక్.

Published on: Jul 16, 2026, 13:53:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Chiranjeevi: టాలీవుడ్‌లో ఒక సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి కేవలం టీజర్లు, ట్రైలర్లు మాత్రమే అవసరం లేదు.. కొన్నిసార్లు "నిశ్శబ్దం" లేదా "రహస్యం" కూడా పని చేస్తోంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘మెగా 158’ మూవీ విషయంలో మేకర్స్ ఇదే ప్లాన్ చేస్తున్నారని టాక్.

సీక్రెట్ గా మెగా 158 లో చిరంజీవి లుక్ ? రామ్ చరణ్ విజిట్ నుంచి జానీ మాస్టర్ ఇష్యూ వరకు మేకర్స్ మైండ్ గేమ్! (x)
సీక్రెట్ గా మెగా 158 లో చిరంజీవి లుక్ ? రామ్ చరణ్ విజిట్ నుంచి జానీ మాస్టర్ ఇష్యూ వరకు మేకర్స్ మైండ్ గేమ్! (x)

సీక్రెట్ గా చిరంజీవి లుక్

బాబీ కొల్లి డైరెక్షన్ లో చిరంజీవి ఇప్పుడు ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. ఈ మూవీలో చిరంజీవి లుక్ మాత్రం ఇంకా రివీల్ కాలేదు. సినిమా సెట్స్ నుంచి ఫొటోలు వస్తున్నా అందులో చిరంజీవి ముఖం మాత్రం కనిపించడం లేదు.

రామ్ చరణ్ విజిట్

ఇటీవల ఫాదర్స్ డే సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటిస్తున్న మెగా 158 సెట్స్‌కు వచ్చాడు. సాధారణంగా ఇలాంటి క్రేజీ మూమెంట్స్ జరిగినప్పుడు తండ్రి-కొడుకుల కాంబో ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తాయి.

కానీ ఇక్కడే మేకర్స్ ఒక ప్లాన్డ్ స్ట్రాటజీని ప్లే చేశారు. సోషల్ మీడియాలో కేవలం రామ్ చరణ్ సింగిల్ ఫోటోలను మాత్రమే రిలీజ్ చేశారు తప్ప, చిరంజీవితో ఉన్న ఒక్క ఫ్రేమ్‌ను కూడా బయటకు రానివ్వలేదు. దీనితో చిరు లుక్‌పై ఫ్యాన్స్‌లో క్యూరియాసిటీ డబుల్ అయింది.

కేవలం బ్యాక్ ప్రొఫైల్ మాత్రమే

ఇక టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య నడుస్తున్న ఒక అంతర్గత విభేదాన్ని పరిష్కరించడానికి మెగాస్టార్ స్వయంగా చొరవ తీసుకున్నారు. వారిద్దరినీ సినిమా సెట్స్‌కు పిలిపించి, మాట్లాడి, కలిసి లంచ్ కూడా చేశారు. ఈ ఇష్యూ సాల్వ్ అవ్వడం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది.

అయితే, ఈ లంచ్ మీటింగ్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు కూడా.. చిరంజీవి కేవలం వెనుక వైపు నుంచి కూర్చున్న విజువల్స్ మాత్రమే కనిపించాయి. ఫ్రంట్ లుక్ కంప్లీట్‌గా హైడ్ చేశారు.

సర్ ప్రైజ్ కోసమేనా?

బాబీ కొల్లి-చిరంజీవి కాంబోలో గతంలో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మెగాస్టార్‌కు ఎలాంటి వింటేజ్ మాస్ సక్సెస్ ఇచ్చిందో మనకు తెలిసిందే. ఈ సారి మెగా 158 లో అంతకంటే పవర్‌ఫుల్ అండ్ సర్ప్రైజింగ్ మేకోవర్‌ను ప్లాన్ చేసినట్లు టాక్.

అందుకే లుక్‌ను లీక్ కాకుండా దాస్తున్నారని అంటున్నారు. దీని వల్ల రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, సెట్స్‌లో మొబైల్స్ వాడకంపై పూర్తి కంట్రోల్ ఉంటుంది. రెండు, ఫస్ట్ లుక్ లేదా గ్లింప్స్ రిలీజ్ చేసినప్పుడు వచ్చే డిజిటల్ వ్యూస్ రికార్డ్ బ్రేకింగ్ స్థాయిలో ఉంటాయి. ఈ ప్లాన్డ్ సస్పెన్స్ సినిమాకు థియేట్రికల్ బిజినెస్ పరంగా భారీ క్రేజ్ తెచ్చిపెడుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More