Mega 158: చిరు 'మెగా 158' లో సడన్ చేంజ్.. హనీ రోజ్ ఎందుకు తప్పుకుంది? కూలీ బ్యూటీ రచితా రామ్ ఎంట్రీ వెనుక అసలు ట్విస్ట్!

Mega 158: మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న 'మెగా 158' (Mega 158) మూవీ కాస్టింగ్‌లో మేకర్స్ ఊహించని మార్పు జరిగినట్లు సమాచారం. హనీ రోజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. రజనీకాంత్ 'కూలీ' ఫేమ్ రచితా రామ్ ఆ కీలక పాత్రలోకి వచ్చిందని తెలిసింది.

Published on: Jun 7, 2026, 08:15:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Mega 158: 'వాల్తేరు వీరయ్య' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో అనౌన్స్ అయిన హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'మెగా 158'. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుగుతోంది.

చిరు 'మెగా 158' లో సడన్ చేంజ్.. హనీ రోజ్ ఎందుకు తప్పుకుంది? (instagram)
చిరు 'మెగా 158' లో సడన్ చేంజ్.. హనీ రోజ్ ఎందుకు తప్పుకుంది? (instagram)

తప్పుకొన్న హనీ రోజ్

కన్నడ టాప్ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో టాలీవుడ్‌ డెబ్యూ ఇస్తూ నిర్మిస్తున్న ఈ మెగా 158 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఈ సినిమా కాస్టింగ్ గురించిన ఒక క్రేజీ అప్‌డేట్ ఇప్పుడు ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం మొదట అనుకున్న 'వీరసింహారెడ్డి' ఫేమ్ హనీ రోజ్ (Honey Rose) ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలిసింది.

రచితా రామ్ ఇన్

హనీ రోజ్ స్థానంలో కన్నడ డింపుల్ క్వీన్ రచితా రామ్ (Rachita Ram) రంగంలోకి దిగిందని సమాచారం. చిరంజీవితో కలిసి ఆమె నటిస్తుందని అంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల ఇన్‌సైడ్ టాక్ ప్రకారం.. ఈ సినిమాలో సదరు పాత్రకు సంబంధించిన కాల్‌షీట్స్, పొల్లాచ్చి షెడ్యూల్ టైమింగ్స్ కు హనీ రోజ్ ముందు ఓకే చెప్పింది. కానీ మరికొన్ని మలయాళ చిత్రాల డేట్స్‌తో ఇవి క్లాష్ అయ్యాయి.

మెగాస్టార్ చిరంజీవి సినిమా కోసం మిగతా ప్రాజెక్టులను హోల్డ్‌లో పెట్టడం ప్రాక్టికల్‌గా కుదరకపోవడంతోనే, హనీ రోజ్ పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకుందని తెలిసింది. ఆమె అడ్వాన్స్ కూడా రిటర్న్ చేసినట్లు సమాచారం.

బాబీ మైండ్ గేమ్ క్యారెక్టర్!

హనీ రోజ్ ప్లేస్‌లోకి రచితా రామ్ రావడం వెనుక డైరెక్టర్ బాబీ ఒక పక్కా ప్లాన్ వేశారని తెలుస్తోంది. సూపర్ స్టార్ రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన 'కూలీ' (Coolie) సినిమాలో రచితా రామ్ ఒక పవర్ ఫుల్ నెగెటివ్ షేడ్ ఉన్న రోల్ చేసింది.

మలుపు తిప్పే క్యారెక్టర్

'మెగా 158' లో కూడా రచితా రామ్ పాత్ర కేవలం వచ్చిపోయే గ్లామర్ రోల్ కాదని టాక్. కథలో హీరో (చిరంజీవి) కి, ఆయన కూతురిగా నటిస్తున్న అనస్వర రాజన్ (Anaswara Rajan) కి మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ అండ్ డ్రామా సీన్స్‌ను డ్రైవ్ చేసే నెగెటివ్ టచ్ ఉన్న గ్రే షేడ్ క్యారెక్టర్ అని సమాచారం. అందుకే 'కూలీ' లో రచితా రామ్ పర్ఫార్మెన్స్, క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బాబీ ఆమెను లైన్‌లోకి తెచ్చాడంటా. ఇప్పటికే ఈ కన్నడ బ్యూటీ పొల్లాచ్చి షెడ్యూల్‌లో జాయిన్ అయిపోయినట్లు ఇన్సైడ్ రిపోర్ట్.

టాలీవుడ్‌లోకి కన్నడ, మలయాళ పవర్ హౌస్

మెగా 158 సినిమా కాస్టింగ్ అంతా చాలా ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. ఒకవైపు మలయాళ యంగ్ సెన్సేషన్ అనస్వర రాజన్ చిరు కూతురిగా నటిస్తుండగా, ఇప్పుడు కన్నడ స్టార్ హీరోయిన్ రచితా రామ్ కూడా తోడైంది. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ అనౌన్స్‌మెంట్ త్వరలోనే రానుంది.

People Also Ask (FAQ)

ప్రశ్న: 'మెగా 158' సినిమాలో హనీ రోజ్ స్థానంలో ఎవరు నటిస్తున్నారు?

జవాబు: మలయాళ నటి హనీ రోజ్ డేట్స్ అడ్జస్ట్ కాక తప్పుకోవడంతో, ఆమె ప్లేస్‌లోకి కన్నడ పాపులర్ స్టార్, రజనీకాంత్ 'కూలీ' మూవీ ఫేమ్ రచితా రామ్‌ను ఎంపిక చేశారు.

ప్రశ్న: 'మెగా 158' సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతోంది?

జవాబు: ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం తమిళనాడులోని పొల్లాచ్చి పరిసర ప్రాంతాల్లోని లొకేషన్లలో శరవేగంగా జరుగుతోంది.

ప్రశ్న: ఈ సినిమాలో చిరంజీవి కూతురిగా నటిస్తున్న హీరోయిన్ ఎవరు?

జవాబు: 'నేరు' వంటి సూపర్ హిట్ మలయాళ చిత్రాల్లో నటించిన యంగ్ బ్యూటీ అనస్వర రాజన్.. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కూతురిగా ఒక కీలకమైన ఎమోషనల్ పాత్రలో నటిస్తోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More