Rajinikanth: డీఎంకే బెదిరించిందా? రజనీకాంత్ మౌనం వెనుక అసలు నిజం ఇదే.. కాలమే సమాధానం చెబుతుందంటూ ట్వీట్..

Rajinikanth: తమిళనాడు రాజకీయాలు ఎన్నికల వేళ రక్తి కడుతున్నాయి. తాజాగా రజనీకాంత్ రంగంలోకి దిగిన దళపతి విజయ్ టీవీకే పార్టీ నేత చేసిన కామెంట్స్ కు కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కాలమే సమాధానం చెబుతుందంటూ అతడు అనడం గమనార్హం.

Mar 17, 2026, 14:59:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నటుడు నుండి రాజకీయ నాయకుడిగా మారిన దళపతి విజయ్ టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున చేసిన కామెంట్స్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ మౌనం వీడాడు. డీఎంకే (DMK) బెదిరింపుల వల్లే రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదని ఆధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై రజనీకాంత్ మంగళవారం (మార్చి 17)న తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఒక అఫీషియల్ స్టేట్‌మెంట్ రిలీజ్ చేశాడు.

Rajinikanth: డీఎంకే బెదిరించిందా? రజనీకాంత్ మౌనం వెనుక అసలు నిజం ఇదే.. కాలమే సమాధానం చెబుతుందంటూ ట్వీట్.. (PTI)
Rajinikanth: డీఎంకే బెదిరించిందా? రజనీకాంత్ మౌనం వెనుక అసలు నిజం ఇదే.. కాలమే సమాధానం చెబుతుందంటూ ట్వీట్.. (PTI)

రజనీకాంత్ ఏమన్నాడంటే?

తమిళంలో రాసిన ఆ స్టేట్‌మెంట్‌లో రజనీకాంత్ ఇలా అన్నాడు. "నాపై చేసిన ఈ తప్పుడు వ్యాఖ్యలను ఖండిస్తూ, నాకు సపోర్ట్‌గా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తమిళనాడు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి, తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ నైనార్ నాగేంద్రన్, కేంద్ర మంత్రి ఎల్. మురుగన్, తమిళనాడు మంత్రి రఘుపతి, తిరుమావళవన్, ఎస్.పి. వేలుమణి, నా ఫ్రెండ్ అన్నామలై, అర్జునమూర్తి, అన్బుమణి రామదాస్, జి.కె. వాసన్, జాన్ పాండియన్, పుగళేంది.. ఇలా వివిధ పార్టీలకు చెందిన పొలిటికల్ లీడర్లందరికీ థాంక్స్." అని చెప్పాడు.

ఆయన ఇంకా ఆ నోట్ లో మాట్లాడుతూ.. "నన్ను సపోర్ట్ చేసిన అమీర్, జి. ధనంజయన్ లాంటి నా సినీ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కి, నక్కీరన్ గోపాల్, రంగరాజ్ పాండే లాంటి మీడియా మిత్రులకు, వీటన్నింటికీ మించి నన్ను ఎప్పుడూ పైకి లేపే నా దైవ సమానమైన ఫ్యాన్స్‌కు థాంక్స్. కాలం మాట్లాడదు, కానీ వేచి చూసి సరైన సమాధానం చెబుతుంది" అని పేర్కొన్నాడు.

అసలు వివాదం ఏంటి?

మార్చి 12న జరిగిన ఒక నిరసనలో విజయ్ కి చెందిన టీవీకే పార్టీ జనరల్ సెక్రటరీ ఆధవ్ అర్జున మాట్లాడుతూ.. డీఎంకే ఫ్యామిలీ రజనీకాంత్‌ను బెదిరించిందని, అందుకే ఆయన పాలిటిక్స్ లోకి రాకుండా ఆగిపోయారని ఆరోపించారు.

గతంలో అంటే డిసెంబర్ 2020లో రజనీకాంత్ తను పార్టీ పెడుతున్నట్లు, 2021 అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేస్తానని అనౌన్స్ చేశాడు. కానీ ఆ తర్వాత తన హెల్త్ కండిషన్ సరిగ్గా లేకపోవడాన్ని 'దేవుడు ఇచ్చిన హెచ్చరిక'గా భావించి రాజకీయాల్లోకి వచ్చే ప్లాన్ క్యాన్సిల్ చేసుకున్నాడు. ఎలక్టోరల్ పాలిటిక్స్ లోకి రాకుండానే ప్రజలకు సేవ చేస్తానని అప్పుడు చెప్పాడు.

మరోవైపు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) రీసెంట్ గా అనౌన్స్ చేసిన ప్రకారం.. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న కౌంటింగ్ ఉంటుంది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More