Khushbu Sundar Trisha: విజయ్ భార్య సంగీత విడాకుల కేసు.. త్రిషపై వస్తున్న ఆరోపణలపై ఖుష్బూ సుందర్ షాకింగ్ కామెంట్స్!
Khushbu Sundar Trisha: దళపతి విజయ్, త్రిష కృష్ణన్ ల పబ్లిక్ అప్పియరెన్స్ పై వస్తున్న ఆన్‌లైన్ చర్చలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పుడు వీళ్ల రిలేషన్ షిప్ పుకార్లపై సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ రియాక్టయ్యారు. త్రిషపై ఆమె ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, టాప్ హీరోయిన్ త్రిష మధ్య రిలేషన్ షిప్ రూమర్లు తెగ వైరల్ గా మారాయి. తన భర్తకు మరో హీరోయిన్ తో సంబంధం ఉందని విజయ్ భార్య సంగీత విడాకులు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయ్, త్రిష కలిసి బయట కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు ఈ విషయంలో త్రిషపై ఖుష్బూ సుందర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

ఖుష్బూ సుందర్ కామెంట్లు
విజయ్ తో త్రిష రిలేషన్ రూమర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో త్రిషకు సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ సపోర్ట్ గా నిలిచారు. డీకోడర్ తో మాట్లాడుతూ.. ‘‘దురదృష్టవశాత్తు ఇప్పుడు మనం ఉన్న కాలంలో తుమ్మినా కూడా దానిని వేరేవాళ్లపై నెట్టేయాలని చూస్తున్నారు. నాకు వారిద్దరి (విజయ్, త్రిష) గురించి తెలుసు. త్రిష నాకు చాలా దగ్గరి మనిషి. నేను కలిసిన అత్యంత గౌరవప్రదమైన మహిళల్లో ఆమె ఒకరు. అత్యంత సెన్సిటివ్ సోల్’’ అని ఖుష్బూ సుందర్ చెప్పారు.
ఫొటోగ్రాఫర్లు ఇక్కడా
పాపరాజీ (ఫొటోగ్రాఫర్లు) కల్చర్, సోషల్ మీడియా గురించి కూడా ఖుష్బూ సుందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘మనల్ని అన్ని చోట్లా వెంబడించే పాపరాజీల గురించి నేను మాట్లాడాలని అనుకోవడం లేదు. దీన్ని ముంబయిలో చూసేవాళ్లం. ఇక్కడ కాదు. కానీ దురదృష్టవశాత్తు ఇది ఇక్కడ ప్రారంభమవుతోంది’’ అని ఖుష్పూ పేర్కొన్నారు.
శాడిస్టిక్ ఆనందం
‘‘కొంతమంది తమ సమస్యల కంటే కూడా ఇతరుల జీవితాల గురించి పట్టించుకుంటారు. ఇతరులపై కామెంట్లు చేసి శాడిస్టిక్ ఆనందం పొందుతారు. వాళ్ల గురించి ఎవరూ పట్టించుకోరు. ఈ విషయం వాళ్లకు తెలియదు. అలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తూ టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు’’ అని ఖుష్బూ సుందర్ క్రిటిక్స్ పై ఘాటుగానే వ్యాఖ్యానించారు.
విజయ్ విడాకుల కేసు
దళపతి విజయ్ నుంచి విడాకులు కావాలని అతని భార్య సంగీత కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తన భర్తకు మరో హీరోయిన్ తో అక్రమ సంబంధం ఉందని సంగీత సంచలన ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలోనే విజయ్, త్రిష ఇటీవల ఓ నిర్మాత కొడుకు వెడ్డింగ్ రిసెప్షన్ కు కలిసి వెళ్లారు. దీంతో వీళ్లు రిలేషన్ షిప్ లో ఉన్నారనే ప్రచారం మరింత జోరందుకుంది.
విజయ్ జీవితాన్ని నాశనం చేస్తుందంటూ త్రిషపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఈ ప్రచారంపై త్రిష లేదా విజయ్ ఇంకా స్పందించలేదు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


