Trisha Krishnan: విజయ్‌తో రిలేషన్షిప్‌పై స్పందించని త్రిష.. ఎయిర్‌పోర్టు వీడియో వైరల్

Trisha Krishnan: విజయ్ తో రిలేషన్షిప్ పై నటి త్రిష స్పందించలేదు. తాజాగా ఎయిర్‌పోర్టులో కనిపించిన ఆమెను మీడియా దీనిపై ప్రశ్నించగా.. ఏమీ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయింది. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది.

Mar 13, 2026, 16:17:11 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తమిళ స్టార్ హీరో విజయ్‌తో కలిసి పెళ్లి వేడుకకు హాజరైన తర్వాత త్రిష తొలిసారిగా చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో కనిపించింది. ఈ క్రమంలో రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు ఆమె ఎక్కడా అసహనం వ్యక్తం చేయకుండా, మౌనంగానే సమాధానం ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

Trisha Krishnan: విజయ్‌తో రిలేషన్షిప్‌పై స్పందించని త్రిష.. ఎయిర్‌పోర్టు వీడియో వైరల్
Trisha Krishnan: విజయ్‌తో రిలేషన్షిప్‌పై స్పందించని త్రిష.. ఎయిర్‌పోర్టు వీడియో వైరల్

ప్రశ్నల వర్షం.. త్రిష మౌనం

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇటీవలే చెన్నైలో జరిగిన ఒక వివాహ వేడుకకు వీరిద్దరూ కలిసి హాజరు కావడంతో నెట్టింట రకరకాల చర్చలు మొదలయ్యాయి. ఈ పరిణామాల తర్వాత త్రిష తొలిసారిగా చెన్నై విమానాశ్రయంలో మీడియా కంట పడింది.

వైట్ టీ-షర్ట్, బ్లాక్ ప్యాంట్స్, డెనిమ్ జాకెట్ ధరించి స్టైలిష్‌గా ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న త్రిషను చూడగానే రిపోర్టర్లు చుట్టుముట్టారు. ముఖ్యంగా హీరో విజయ్‌తో కలిసి పెళ్లికి వెళ్లడంపై తలెత్తిన వివాదం గురించి ప్రతినిధులు ఆమెను సూటిగా ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలేవీ విననట్టుగా త్రిష చాలా ప్రశాంతంగా తన దారిన తాను వెళ్ళిపోయింది. ఎక్కడా సహనం కోల్పోకుండా, ఎవరికీ సమాధానం చెప్పకుండానే తన స్టాఫ్‌తో కలిసి ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివాదానికి నేపథ్యం ఇదే..

ప్రముఖ నిర్మాత కల్పతి సురేష్ కుమారుడి పెళ్లి వేడుకలో విజయ్, త్రిష జంటగా కనిపించడం చర్చకు దారితీసింది. ఇదే సమయంలో విజయ్ భార్య సంగీత కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం, అందులో విజయ్‌కు ఒక నటితో వివాహేతర సంబంధం ఉందంటూ పేర్కొనడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే త్రిష పేరు తెరపైకి వచ్చింది.

విజయ్ రియాక్షన్ ఏంటి?

మరోవైపు తన రాజకీయ పార్టీ 'తమిళగ వెట్రి కళగం' (TVK) ర్యాలీలో విజయ్ ఈ వివాదాలపై పరోక్షంగా స్పందించాడు. "గత కొంతకాలంగా నా గురించి కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయి. అవి మిమ్మల్ని (అభిమానులను) బాధపెడుతున్నాయని నాకు తెలుసు. మీరు బాధపడితే నేను తట్టుకోలేను. ఆ సమస్యలను నేను చూసుకుంటాను, మీరు వాటి గురించి పట్టించుకోవద్దు. ప్రజల సమస్యలపై దృష్టి పెడదాం" అని విజయ్ వ్యాఖ్యానించాడు.

రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న తరుణంలో విజయ్ వ్యక్తిగత జీవితం, అతని ఆఖరి చిత్రం 'జననాయగన్' సెన్సార్ చిక్కుల్లో పడటం వంటి అంశాలు ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More