Sekhar Master: జానీ మాస్టర్ తో వివాదం.. శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఇదే.. ఇండైరెక్ట్ గా ఆమెనే టార్గెట్ చేశారా?

Sekhar Master Vs Janny Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య వాగ్వాదం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై శేఖర్ మాస్టర్ రియాక్టయిన వీడియో వైరల్ గా మారింది. అసలు శేఖర్ మాస్టర్ ఏం చెప్పాడు? ఈ వివాదానికి కారణం ఏంటో ఇక్కడ చూసేయండి.

Published on: Jul 13, 2026, 11:16:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sekhar Master Vs Janny Master: టాలీవుడ్ లో ఇప్పుడు తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్స్ అసోసియేషన్ గొడవ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే తెలుగులో టాప్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య వాగ్వాదం కూడా కలకలం రేపింది. ఈ వివాదంపై శేఖర్ మాస్టర్ రియాక్టయిన వీడియో తాజాగా వైరల్ గా మారింది. ఇది సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

జానీ మాస్టర్ తో వివాదం.. శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఇదే.. ఇండైరెక్ట్ గా ఆమెనే టార్గెట్ చేశారా? (x)
జానీ మాస్టర్ తో వివాదం.. శేఖర్ మాస్టర్ రియాక్షన్ ఇదే.. ఇండైరెక్ట్ గా ఆమెనే టార్గెట్ చేశారా? (x)

శేఖర్ మాస్టర్ రియాక్షన్

డ్యాన్సర్స్ అసోసియేషన్ లో విభేధాలు, జానీ మాస్టర్ తో వివాదం గురించి శేఖర్ మాస్టర్ రియాక్టయ్యాడు. ‘‘మా 24 క్రాఫ్ట్స్ కు ముఖ్యమైంది ఫెడరేషనే. ఎన్నికలు జరిగినా, ఏది జరిగినా వాళ్లు వస్తారు. ఇప్పుడు డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ కు పడట్లేదు. ఫెడరేషన్ వాళ్లు వచ్చారు’’ అని శేఖర్ మాస్టర్ చెప్పాడు.

ఫెడరేషన్ కే

‘‘ఇప్పుడు ఓటింగ్ పెట్టాలన్నారు. ఫెడరేషన్ వాళ్లకు వీళ్ల తీరు నచ్చట్లేదు. అందుకే ఫెడరేషన్ వాళ్లు బాయ్ కాట్ చేశారు. మాకు ఏ ప్రాబ్లమ్ జరిగినా ఫెడరేషన్ కే చెప్పుకుంటాం. వాళ్లతోనే మేం పని చేయాల్సింది. వాళ్లే బాయ్ కాట్ చేస్తే మేం ఎలా ఉంటామని బయటకు వచ్చేశాం’’ అని శేఖర్ మాస్టర్ వివరించాడు.

ఈగో ప్రాబ్లమ్

ఇతర కొరియోగ్రాఫర్లు, డ్యాన్సర్లలో కొంతమంది కూడా డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రతినిధులపై విమర్శలు గుప్పించారు. ‘‘డ్యాన్సర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరు నచ్చక 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారు. అప్పుడు సుమలత, జానీ మాస్టర్ కూడా రాజీనామా చేశారు. కానీ ఇప్పుడేమో రాజీనామా చేయలేదంటున్నారు. ఫెడరేషన్ వాళ్లేమో ఆ 10 మందిని తిరిగి అసోసియేషన్ లోకి తీసుకోవాలని చెప్పారు’’ అని ఓ డ్యాన్స్ మాస్టర్ చెప్పాడు.

‘‘అలా కాదని సుమలత, జానీ మాస్టర్ కోసమే ఒపీనియన్ పోల్ పెట్టారు. పెడితే అందరికీ ఒపీనియన్ పోల్ పెట్టాలి. మేం అదే అడిగాం. ఇక్కడ ఈగో ప్రాబ్లమ్ ఉంది. వీళ్లు లీడర్స్ గా కాదు ఓనర్స్ గా బిహేవ్ చేస్తున్నారు’’ అని ఆ డ్యాన్స్ మాస్టర్ నిప్పులు చెరిగాడు.

ఆమెనే టార్గెట్

ఈ డ్యాన్సర్స్ అసోసియేషన్ మొత్తం వ్యవహారంలో ప్రెసిడెంట్ సుమలత పేరు హాట్ టాపిక్ గా మారింది. జానీ మాస్టర్ భార్యనే ఈ సుమలత. ఆమె అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన దగ్గర నుంచి ఎన్నికలు, సభ్యత్వ విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరి పరస్పర ఘర్షణల వరకూ వెళ్లింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More