Sekhar vs Jani Master: శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్.. పెద్ద గొడవ.. వీడియో వైరల్.. వివాదంలో అసలు ట్విస్ట్!
Sekhar vs Jani Master: టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ కొరియోగ్రాఫర్లుగా కొనసాగుతున్నారు శేఖర్, జానీ మాస్టర్. తాజాగా వీళ్లిద్దరి మధ్య గొడవ కలకలం రేపుతోంది. ఇద్దరు గట్టిగా అరుచుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలేం జరిగిందో ఇక్కడ చూసేయండి.
Sekhar vs Jani Master: శేఖర్ మాస్టర్ వర్సెస్ జానీ మాస్టర్ మధ్య ఘర్షణ ఇప్పుడు టాలీవుడ్ లో సంచలనం తెలుగు కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్‌లో టాలీవుడ్ టాప్ మాస్టర్స్ శేఖర్, జానీ మధ్య జరిగిన హీటెడ్ డిబేట్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

శేఖర్ వర్సెస్ జానీ మాస్టర్
ఆదివారం (జూలై 12) సాయంత్రం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ గా మారింది. ఇందులో టాప్ కొరియోగ్రాఫర్లు అయిన శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ వాగ్వాదానికి దిగినట్లు ఉంది. చుట్టూ చాలా మంది ఉన్నారు. మధ్యలో శేఖర్ మాస్టర్ పై జానీ మాస్టర్ గట్టిగా మాట్లాడినట్లు కూడా కనిపించింది. పోలీసుల జోక్యం కూడా ఈ వీడియోలో కనిపించింది.
ఏమైందంటే?
తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్ ఎన్నికలు, మెంబర్ షిప్ విషయాల గురించే శేఖర్, జానీ మాస్టర్ కు మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. ఫెడరేషన్ అనుమతి లేకుండా బై ఎలక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడంతో వివాదం ముదిరిందని అంటున్నారు.
జానీ మాస్టర్ భార్య
తెలుగు ఫిల్మ్ డ్యాన్సర్ అసోసియేషన్ కు జానీ మాస్టర్ భార్య సుమలత అధ్యక్షురాలిగా ఉన్నారు. అయితే ఆమె ఏకపక్ష నిర్ణయాలపై అసోసియేషన్ మెంబర్లలో తీవ్ర వ్యతిరేకత ఉందని సమాచారం. ఈ మేరకు 10 మంది డ్యాన్సర్లు రాజీనామా చేశారని కూడా అంటున్నారు.
అయితే దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇక ఇప్పుడు ఫెడరేషన్ సభ్యుల్లో మెజారిటీ వాళ్లకు తెలియకుండానే బై ఎలక్షన్ నిర్వహించేందుకు సిద్ధం కావడం అగ్నికి ఆజ్యం పోసినట్లయిందని చెప్తున్నారు.
టాప్ కొరియోగ్రాఫర్లు
ఇప్పుడు టాలీవుడ్ లో శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్లుగా సినిమాలకు పని చేస్తున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్.. ఇలా టాప్ స్టార్ల సినిమాలకు కొరియోగ్రాఫీ చేస్తున్నారు. అలాంటి టాప్ కొరియోగ్రాఫర్ల మధ్య ఈ వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఈ వైరల్ వీడియోపై ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఏదీ రాలేదు. అసోషియేస్ కానీ లేదా జానీ మాస్టర్ కానీ, శేఖర్ మాస్టర్ కానీ ఇంకా దీనిపై రియాక్ట్ కాలేదు. ఏదేమైనా ఇద్దరు టాప్ కొరియోగ్రాఫర్లు ఇలా కోపం ప్రదర్శించడం మాత్రం ఇప్పుడు తీవ్ర చర్చనీయాశంగా మారింది. మరి ఈ వివాదం చివరకు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


