Kajal Aggarwal: సల్మాన్ కోసం గంటల పాటు వేచి చూడాల్సి వచ్చింది.. సౌత్ నుంచి బాలీవుడ్ పంక్చువాలిటీ నేర్చుకోవాలి: కాజల్
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ మరోసారి సంచలన కామెంట్స్ చేసింది. ఈసారి బాలీవుడ్ ను నిందిస్తూ సౌత్ ఇండస్ట్రీని చూసి నేర్చుకోవాలంటూ ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏమన్నదో చూడండి.
Kajal Aggarwal: నటి కాజల్ అగర్వాల్ బాలీవుడ్ ప్రొడక్షన్ కల్చర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలలో అగ్ర హీరోయిన్ గా రాణిస్తున్న ఈ బ్యూటీ.. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో సౌత్ సినిమాల్లో ఉండే క్రమ శిక్షణ, సమయ పాలన బాలీవుడ్‌లో అస్సలు ఉండవని ఓపెన్‌గా చెప్పేశారు.

సల్మాన్ కోసం వేచి చూడాల్సి వచ్చింది
'సికిందర్' సినిమా షూటింగ్ సమయంలో బాలీవుడ్ సుల్తాన్ సల్మాన్ ఖాన్ కోసం తను గంటల తరబడి వెయిట్ చేయాల్సి వచ్చిందని కాజల్ గుర్తుచేసుకున్నారు. చిన్నప్పటి నుంచి సల్మాన్ తన క్రష్ అయినప్పటికీ.. ఆయన సెట్స్‌కి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో రావడం వల్ల తనకు చాలా టైమ్ వేస్ట్ అయిందన్నారు. సౌత్ మేకర్స్ పాటించే టైమింగ్స్‌కి అలవాటు పడిన తనకు, ఆ వెయిటింగ్ టైమ్‌లో ఏమీ తోచక సెట్‌లోనే ఉన్న జిమ్‌లో కసరత్తులు చేసేదాన్నని నవ్వుతూ చెప్పారు.
సౌత్ వర్సెస్ బాలీవుడ్.. పాత్రల ఎంపికపై క్లారిటీ
హిందీలో ఎక్కువ సినిమాలు చేయకపోవడానికి కూడా కారణం ఉందన్నారు కాజల్. సౌత్‌లో తనకి లభించిన ఇంటెన్స్, వైవిధ్యమైన రోల్స్ బాలీవుడ్‌లో రాలేదని, కేవలం యావరేజ్ క్యారెక్టర్ల కోసం టైమ్ వేస్ట్ చేసుకోవడం ఇష్టం లేకనే హిందీకి దూరంగా ఉన్నానని స్పష్టం చేశారు.
అలాగే ఒకప్పుడు సౌత్ సినిమాల్లో హీరోయిన్ల బొడ్డు చూపించడం, గ్లామర్‌కే ప్రాధాన్యం ఇవ్వడం ఉండేదని, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయి అద్భుతమైన హీరోయిన్ సెంట్రిక్ కథలు వస్తున్నాయని కొనియాడారు. కంటెంట్ ఆధారిత ప్రాజెక్టులకు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందని చెప్పారు.
సౌత్ క్వీన్‌గా దశాబ్దాల ప్రయాణం
2004 లో 'క్యో...! హో గయా నా' మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ఆ తర్వాత టాలీవుడ్‌లో అడుగుపెట్టి తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నారు. రామ్ చరణ్ తో చేసిన 'మగధీర' సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పగా, ఆ తర్వాత 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'బిజినెస్ మేన్', 'తుపాకీ', 'మెర్సల్', 'వివేగం' లాంటి ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్స్‌తో దశాబ్దానికి పైగా సౌత్ ఇండియన్ క్వీన్‌గా ఏలారు.
హిందీలో అజయ్ దేవగన్ సరసన 'సింగం', అక్షయ్ కుమార్ తో 'స్పెషల్ 26' చిత్రాల్లో నటించి అక్కడ కూడా మంచి మార్కులు కొట్టేశారు.
'ది ఇండియా స్టోరీ' నుండి 'రామాయణం' వరకు..
కాజల్ అగర్వాల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. శ్రేయాస్ తల్పడే లీడ్ రోల్ లో వస్తున్న 'ది ఇండియా స్టోరీ' చిత్రంలో కాజల్ కీలక పాత్ర పోషించారు. చేతన్ డికె డైరెక్ట్ చేసిన ఈ సినిమా జీ స్టూడియోస్ ప్రెజెంటేషన్ లో జులై 24న థియేటర్లలోకి రాబోతోంది.
దీనితో పాటు బాలీవుడ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ నితేష్ తివారీ 'రామాయణం'లో కాజల్ భాగమయ్యారు. రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి బిగ్ స్టార్ క్యాస్టింగ్ తో వస్తున్న ఈ విజువల్ వండర్ మొదటి భాగం 2026 దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి విడుదల కానుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


