Kajal The India Story: మన ప్లేట్లలోకి స్లో పాయిజన్.. కాజల్ అగర్వాల్ థ్రిల్లర్ 'ది ఇండియా స్టోరీ' రిలీజ్ డేట్ ఫిక్స్..
Kajal The India Story: కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే లీడ్ రోల్స్‌లో వస్తున్న మోస్ట్ పవర్‌ఫుల్ సోషియో-పొలిటికల్ థ్రిల్లర్ 'ది ఇండియా స్టోరీ' (The India Story). దేశంలో ఎన్నో ప్రాణాలను ముంచేస్తున్న ఆహార కల్తీ, వ్యవసాయంలో కెమికల్స్, పురుగుమందుల మితిమీరిన వాడకం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది.
Kajal The India Story: మనం ప్రతిరోజూ తినే ఆహారం ఎంత వరకు సురక్షితం? పంటపొలాల నుంచి మన ప్లేట్లలోకి ఎలాంటి విషం వచ్చి చేరుతోంది? కార్పొరేట్ కంపెనీల నిర్లక్ష్యం సామాన్యుల జీవితాలను ఎలా బలి తీసుకుంటోంది? సరిగ్గా ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన, సమాజంలో ఎవరూ మాట్లాడటానికి ఇష్టపడని ఒక విపత్తు చుట్టూ తెరకెక్కిన సినిమానే 'ది ఇండియా స్టోరీ'.

జీ స్టూడియోస్ సమర్పణలో, ఎమ్ఐజీ ప్రొడక్షన్స్ అండ్ స్టూడియోస్ బ్యానర్‌పై సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ సినిమాకు 'స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్' (Slow Poison in Progress) అనే పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్ పెట్టారు. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే నటించారు.
జులై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల
సుదీర్ఘ కాలంగా షూటింగ్ జరుపుకుంటూ ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించిన ‘ది ఇండియా స్టోరీ’ మూవీ జులై 24, 2026 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. కేవలం హిందీలోనే కాకుండా సౌత్ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ తెలుగు, తమిళ భాషల్లో కూడా ఒకేసారి ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.
ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. "నిజం కోసం ఒక పోరాటం.. ప్రతి కుటుంబం కోసం ఒక యుద్ధం" అంటూ మేకర్స్ షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మనల్ని సాకుతున్న భూమే.. మనల్ని మింగేస్తే?
ఈ సినిమా కేవలం ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబానికి సంబంధించిన కథ కాదు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న ఒక పెద్ద నెట్‌వర్క్ గురించిన విస్మయం కలిగించే నిజం. వ్యవసాయ రంగంలో రసాయనాలు, నాణ్యత లేని పురుగు మందుల వాడకం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు ఎలా వ్యాపిస్తున్నాయి, దీని వెనుక కార్పొరేట్ కంపెనీల స్కాములు ఎలా సాగుతున్నాయి అనే తీవ్రమైన అంశాలను డైరెక్టర్ చేతన్ డికె చాలా రా అండ్ రస్టిక్‌గా చూపించబోతున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఇందులో సినిమా సీన్లు కాకుండా, దేశంలో జరుగుతున్న ఆహార కల్తీ, పురుగుమందుల దాడుల గురించిన రియల్ న్యూస్ ఫుటేజ్, డేటా కార్డ్‌లను ఉపయోగించి ఆడియన్స్‌లో ఒక తెలియని భయాన్ని, ఆలోచనను రేకెత్తించారు.
సరికొత్త కాంబినేషన్‌లో ఎమోషనల్ డ్రామా
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే తొలిసారి కలిసి నటిస్తున్న ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు చాలా ఇంటెన్స్‌గా ఉండబోతున్నాయి. వీరితో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితుడైన మురళీ శర్మ, మనీష్ వాధ్వా, డీకే చేతన్, అతుల్ తివారీ, కమలేష్ సావంత్, త్రిష శారద వంటి భారీ తారాగణం కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నిశాంత్ భాగవత్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకు మంగేష్ ధాక్డే అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. సమాజానికి ఒక కన్నువిప్పులా మారబోతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


