Kajal Aggarwal Ramayana: 4 వేల కోట్లతో రామాయణం.. ఇండియా ఇప్పటివరకు చూడని అద్భుతం ఇది.. మండోదరి కాజల్ అగర్వాల్ కామెంట్స్

Kajal Aggarwal On Ramayana Movie: దర్శకుడు నితీష్ తివారీ విజువల్ వండర్‌గా తెరకెక్కిస్తున్న రామాయణం సినిమాపై మండోదరిగా చేస్తున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హాలీవుడ్ స్థాయి సాంకేతికతతో, ప్రపంచంలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో వస్తున్న రామాయణ విశేషాలు ఇవే.

Published on: Jun 8, 2026, 13:25:45 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kajal Aggarwal On Ramayana Movie: ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న మైథలాజికల్ చిత్రం 'రామాయణం' కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 'దంగల్' ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.

4 వేల కోట్లతో రామాయణం.. ఇండియా ఇప్పటివరకు చూడని అద్భుతం ఇది.. మండోదరి కాజల్ అగర్వాల్ కామెంట్స్
4 వేల కోట్లతో రామాయణం.. ఇండియా ఇప్పటివరకు చూడని అద్భుతం ఇది.. మండోదరి కాజల్ అగర్వాల్ కామెంట్స్

తాజా ఇంటర్వ్యూలో కాజల్ అగర్వాల్

అలాగే, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణాసురుడిగా చేస్తున్నాడు. ఈ మహా కావ్యంలో రావణుడి భార్య 'మండోదరి' పాత్రను పోషిస్తున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తాజా ఇంటర్వ్యూలో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక 'వెరైటీ ఇండియా'తో ఆమె ముచ్చటించారు.

అత్యున్నత ప్రమాణాలతో

"ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు సరికొత్త అనుభూతి కలిగింది. ఎందుకంటే ఇది సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన ప్రొడక్షన్. భారతదేశం ఇప్పటివరకు వెండితెరపై ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడూ చూసి ఉండదు" అని కాజల్ అగర్వాల్ తెలిపారు.

"నటీనటులుగా మాకు కూడా ఇలాంటి ఒక భారీ విజువల్ వండర్‌లో భాగమవ్వడం ఇదే మొదటిసారి. మన గుండెలకు ఎంతో దగ్గరగా ఉండే అచ్చమైన భారతీయ కథను ప్రపంచ స్థాయి సాంకేతికతతో చెప్తున్నారు" అని కాజల్ అగర్వాల్ ఆనందం వ్యక్తం చేశారు.

ప్రపంచ సినిమా చరిత్రలోనే భారీ బడ్జెట్!

రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ పౌరాణిక చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, నటుడు యశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారతీయ సినిమా చరిత్రలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన చిత్రాల జాబితాలో నిలిచేలా దీనిని ప్లాన్ చేశారు.

ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ రెండు భాగాల మేకింగ్, ప్రమోషన్ల ఖర్చు (ల్యాండింగ్ కాస్ట్) అక్షరాలా రూ. 4000 కోట్లు (500 మిలియన్ డాలర్లు) దాటుతుందని అంచనా. మన దేశంలో ఇప్పటివరకు వచ్చిన 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి' వంటి భారీ చిత్రాల బడ్జెట్లను కూడా ఇది దాటేసి సరికొత్త రికార్డు సృష్టించింది.

హాలీవుడ్ సినిమాకు గట్టి పోటీ

"మా రామాయణం కేవలం ఒక భారతీయ సినిమా మాత్రమే కాదు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఏ భారీ హాలీవుడ్ ప్రాజెక్ట్‌కైనా ఇది గట్టి పోటీ ఇస్తుంది. హాలీవుడ్ అద్భుతాలు 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' లేదా 'అవతార్' కంటే ఎంతో ముందే మన పురాణాలు పుట్టాయి. ఆ సినిమాల్లో కనిపించే విజువల్ గ్రాండియర్, ఎమోషనల్ జర్నీ మన రామాయణంలో అంతకంటే అద్భుతంగా కనిపిస్తాయి" అని నమిత్ మల్హోత్రా ధీమా వ్యక్తం చేశారు.

ఊహించని స్థాయిలో నటీనటులు

ఈ సినిమాలో నటీనటుల ఎంపిక కూడా ఊహించని స్థాయిలో ఉంది. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడితో పాటు పరశురాముడి పాత్రలోనూ కనిపిస్తారని సమాచారం. సీతాదేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి, లక్ష్మణుడిగా రవి దూబే, హనుమంతుడిగా బాలీవుడ్ యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ నటిస్తున్నారు. అలాగే దశరథ మహారాజు పాత్రలో పాత తరం రాముడు అరుణ్ గోవిల్ నటిస్తుండటం విశేషం.

రామాయణం టీజర్ టాక్

గత ఏప్రిల్ నెలలో విడుదల చేసిన ఈ సినిమా గ్లింప్స్/టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యతపై పెదవి విరవగా, రాముడి పాత్రకు రణ్‌బీర్ కపూర్ సెట్ కాలేదంటూ సోషల్ మీడియాలో విమర్శలు కూడా వచ్చాయి. అయినప్పటికీ ఈ సినిమాపై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

బాక్సాఫీస్ బరిలోకి వచ్చేది ఎప్పుడంటే?

ఈ ప్రతిష్టాత్మక పౌరాణిక దృశ్యకావ్యం రామాయణం సినిమాను పండుగ సీజన్లలో విడుదల చేసేందుకు మేకర్స్ ముహూర్తం ఖరారు చేశారు. మొదటి భాగాన్ని దీపావళి 2026 కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

ఇక రావణ సంహారం, అయోధ్య పట్టాభిషేకం వంటి కీలక ఘట్టాలతో కూడిన రెండో భాగాన్ని దీపావళి 2027లో విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. భారతీయ పండుగ సంస్కృతికి, సెంటిమెంట్లకు అద్దం పట్టేలా ఈ రిలీజ్ డేట్లను ఎంపిక చేశారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More