Kamakshi Bhaskarla: ఇండస్ట్రీలో కమిట్‌మెంట్‌పై కామాక్షి భాస్కర్ల షాకింగ్ కామెంట్స్.. ఇంకేంటి అంటారు.. ఆలస్యంగా తెలిసింది
Kamakshi Bhaskarla: సినిమా ఇండస్ట్రీలో కమిట్‌మెంట్, క్యాస్టింగ్ కౌచ్ పదాలకు అర్థమేంటో అందరికీ తెలుసు. అయితే ఈ హాట్ టాపిక్ పై తాజాగా హీరోయిన్ కామాక్షి భాస్కర్ల చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Kamakshi Bhaskarla: టాలీవుడ్ హీరోయిన్ కామాక్షి భాస్కర్ల ఇండస్ట్రీలో కమిట్‌మెంట్, క్యాస్టింగ్ కౌచ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయని, అయితే ఎలా అంటే మాత్రం తనకు జరిగితే చెప్పగలనని చెప్పింది. ఇంకేంటి, మరి ఏంటి అంటూ అడుగుతారని ఆమె అనడం గమనార్హం.

కమిట్‌మెంట్‌పై కామాక్షి కామెంట్స్
మా ఊరి పొలిమేర సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి భాస్కర్ల.. తాజాగా ఫిల్మీ ఫోకస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా కమిట్‌మెంట్ పై ప్రశ్నించినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే..
“ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతున్నాయా అంటే జరుగుతున్నాయి.. ఎంతవరకు ఎవరితో అన్నది నేను చెప్పలేను. నాకు జరిగితే నేను చెప్పగలను. ఇండస్ట్రీకి డబ్బులున్న చాలా మంది ఇన్వెస్టెర్లు వచ్చేస్తారు. వాళ్లంతా తమకు తాము ప్రొడ్యూసర్లం అని చెప్పుకుంటారు. డైరెక్టర్లం కావాలని కలలు కనే ఎంతో మంది వాళ్ల ముందు క్యూ కడుతుంటారు. అలాంటి వాళ్లను వీళ్లు మాయ చేస్తారు. ఇది కేవలం అమ్మాయిలకే కాదు.. డైరెక్టర్లు కావాలని వస్తున్న అబ్బాయిలకూ జరుగుతోంది” అని ఆమె అనడం గమనార్హం.
వాళ్లంతా సోకాల్డ్ ప్రొడ్యూసర్లు
కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన తమకు తాము వాళ్లు ప్రొడ్యూసర్లమని చెప్పుకుంటారని, అసలు ప్రొడక్షన్ అంటే ఓ క్రాఫ్ట్ అని కామాక్షి చెప్పింది. రామానాయుడు, అల్లు అరవింద్, సురేష్, స్వప్న దత్ లాంటి వాళ్లు నిజమైన ప్రొడ్యూసర్లు అని ఆమె అభిప్రాయపడింది.
ఇంకేంటి అని అడుగుతారు
కేవలం డబ్బు ఉండి ప్రొడ్యూసర్లు అని చెప్పుకుంటున్న వాళ్లు హీరోయిన్లు కావాలని కలలు కంటున్న వారిని కమిట్‌మెంట్ అడుగుతారని, నేరుగా కాకుండా ఇంకేంటి? మరేంటి అని అడుగుతారని కామాక్షి చెప్పింది. తనకు ఈ విషయం తెలియడానికి మూడేళ్లు పట్టిందని, మొదట్లో ఎవరైనా అడిగితే తాను చాలా కమిటెడ్ గా పని చేస్తానని చెప్పేదాన్నని, కానీ ఆ పదానికి అర్థం వేరే ఉందని తర్వాత తెలిసిందని ఆమె చెప్పింది. కామాక్షి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
డాక్టర్ నుంచి స్టార్ హీరోయిన్‌గా మారి..
కామాక్షి భాస్కర్ల కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ (MBBS) డాక్టర్. మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగానికొచ్చి మిస్ తెలంగాణ టైటిల్ గెలుచుకున్నారు. ఆ తర్వాత యాక్టింగ్ పై ఉన్న ప్యాషన్‌తో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.
షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె 'మా ఊరి పొలిమేర' ఓటీటీ రిలీజ్‌తో ఒక్కసారిగా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆ సినిమాలో ఆమె నటనకు, ఇంటెన్స్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'మా ఊరి పొలిమేర 2' బాక్సాఫీస్ దగ్గర రూ. 30 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఆమె కెరీర్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది.
ఓటీటీలో బిజీ బిజీగా కామాక్షి లైనప్
కేవలం సినిమాలే కాకుండా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కూడా కామాక్షి భాస్కర్ల డిమాండ్ విపరీతంగా పెరిగింది. అక్కినేని నాగచైతన్య లీడ్ రోల్ చేసిన హిట్ వెబ్ సిరీస్ 'దూత' (Dhootha)లో ఆమె ఒక పవర్‌ఫుల్ రోల్ ప్లే చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు.
అలాగే అంజలి నటిస్తున్న 'ఝాన్సీ' సిరీస్, 'మిక్స్ అప్', 'ఓం భీమ్ బుష్' వంటి డిఫరెంట్ ప్రాజెక్టులతో వరుసగా అలరిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి తన సొంత టాలెంట్‌తో వరుస ఆఫర్లు దక్కించుకుంటున్న కామాక్షి కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


