Kamakshi Bhaskarla: తెలుగు ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలే తక్కువ-స్టేజీపైనే ఏడ్చేసిన కామాక్షి భాస్కర్ల- వీడియో
Kamakshi Bhaskarla: ‘మా ఊరి పొలిమేర’ ఫేమ్ కామాక్షి భాస్కర్ల ఎమోషనల్ అయింది. స్టేజీపై మాట్లాడుతూ ఏడ్చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు తక్కువంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ వీడియో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు ఇక్కడ చూసేయండి.
Kamakshi Bhaskarla: సీనియర్ దర్శకుడు ఎం.ఎస్. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘అగధ’ (Agadha) ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయింది.

కామాక్షి భాస్కర్ల ఎమోషనల్
హారర్ థ్రిల్లర్ అగధ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కామాక్షి భాస్కర్ల కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
"నేను 2017 ఆగస్టులో ఇండియాకి వచ్చాను. ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో ఏళ్లయినా, ఒక సినిమాలో మెయిన్ లీడ్ రోల్ సాధించడానికి నాకు 9 ఏళ్లు పట్టింది. తెలుగు ఇండస్ట్రీలో తెలుగమ్మాయిలకు అవకాశాలు రావడం చాలా తక్కువ అనేది అందరికీ తెలిసిన సత్యమే. కానీ ఇప్పుడిప్పుడే పరిశ్రమలో మార్పు వస్తోంది’’ అని కామాక్షి ఎమోషనల్ అయింది.
కన్నీళ్లు పెట్టుకుంటూ
‘‘నాపై నమ్మకంతో ఎంఎస్ రాజు ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ ఇచ్చారు. నన్ను నమ్మినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. ఇంకో పదేళ్లయిన తర్వాత కూడా నా కెరీర్ కు పునాది రాయి వేసింది ఎంఎస్ రాజు గారు అని చెప్తా" అని కామాక్షి కన్నీళ్లు పెట్టుకుంది.
బ్యాక్‌గ్రౌండ్ లేకుండా
తన కుటుంబం అందించిన ప్రోత్సాహం, ఎదుర్కొన్న సవాళ్ల గురించి కామాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. "ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి ఈ స్థాయికి రావడం ఒక పెద్ద విజయం. నా విజయం వెనుక నా కుటుంబం ఎన్నో త్యాగాలు చేసింది" అని కామాక్షి పేర్కొంది.
‘‘డాక్టర్ కెరీర్ ను వదిలేసి సినిమాల్లోకి వచ్చినప్పుడు చాలా మంది చాలా మాటలన్నారు. కానీ అవేవీ నా దగ్గర వరకు రాకుండా నా ఫ్యామిలీ చూసుకుంది’’ అని కామాక్షి తెలిపింది.
అగధ గురించి
సీనియర్ ఫిల్మ్ మేకర్ ఎంఎస్ రాజు ఫస్ట్ టైమ్ దర్శకత్వం వహించిన హారర్ థ్రిల్లర్ సినిమానే అగధ. ఇందులో కామాక్షి భాస్కర్ల, శ్రావణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవిక విజయ్ కుమార్, భాను చందర్, వనిత విజయ్ కుమార్ తదితరులు నటించారు.
పాతాళ లోకం నుంచి పుట్టుకొచ్చే ఓ భయంకరమైన దుష్ట శక్తి అగధ ఏం చేసింది? దాన్ని ఎలా అంతం చేశారు? అనే కథతో ఈ మూవీని ఎంఎస్ రాజు తీర్చిదిద్దారు. ఈ మూవీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేశారు. అగధ 2 కూడా వస్తుందని మేకర్స్ ప్రకటించారు.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper


