ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు మళ్లీ చేతులు కలిపారు. అయితే ఇద్దరూ తెరపైన కలిసి కనిపించడం లేదు. కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. రజనీకాంత్ లీడ్ రోల్లో నటించబోతున్నాడు. తలైవా 173 మూవీ అనౌన్స్‌మెంట్ బుధవారం (నవంబర్ 5) జరిగింది. కమల్ ఏం ట్వీట్ చేశాడో చూడండి.
రజనీకాంత్ హీరో, కమల్ హాసన్ ప్రొడ్యూసర్

ఓ సూపర్ స్టార్ హీరోగా, మరో సూపర్ స్టార్ ప్రొడ్యూసర్ గా సినిమా వస్తుండటం ఎంతో ఆసక్తి రేపుతోంది. ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న కాంబినేషన్ రానే వచ్చింది. స్క్రీన్ పై రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించనున్నారన్న వార్తల నేపథ్యంలో ఈ ఇద్దరూ చేతులు కలిపినా.. ఒకరు హీరో, మరొకరు ప్రొడ్యూసర్ అని మాత్రం ఊహించలేదు. ఈ విషయాన్ని కమల్ హాసన్ బుధవారం (నవంబర్ 5) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. అంతేకాదు ఈ సినిమా 2027 పొంగల్ సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చెప్పాడు.
“గాలిలా, వర్షంలా, నదిలా.. వర్షంలా కురుద్దాం.. ఎంజాయ్ చేద్దాం.. జీవిద్దాం.. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్ లో సుందర్ సి డైరెక్షన్ లో నా డియర్ ఫ్రెండ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్నాడు. తలైవా173, పొంగల్ 2027” అనే క్యాప్షన్ తో కమల్ ట్వీట్ చేశాడు.
28 ఏళ్ల తర్వాత మళ్లీ..
రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషనే కాదు ఈ సినిమా ద్వారా మరో కాంబినేషన్ కూడా 28 ఏళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అది రజనీకాంత్, డైరెక్టర్ సుందర్ చేతులు కలపడం. ఈ ఇద్దరూ చివరిగా 1997లో వచ్చిన అరుణాచలం మూవీ చేశారు. ఇప్పుడు 28 ఏళ్ల తర్వాత మరోసారి ఈ తలైవా 173 కోసం ఒక్కటయ్యారు. అంతేకాదు ఈ సినిమా ద్వారా రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ తన 44వ వార్షికోత్సవం జరుపుకుంటోంది.
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా కమల్ హాసన్, రజనీకాంత్ చేతులు కలిపిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించనున్నారన్న వార్తల నేపథ్యంలో అది జరగకపోవడం కాస్త నిరాశకు గురి చేసింది. అయితే ఈ ఇద్దరూ మరో సినిమా కోసం పని చేయనున్నారని, దీనికి డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉందని కూడా వార్తలు వచ్చాయి. గతంలో రజనీకాంత్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఆ మూవీ అనౌన్స్‌మెంట్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
{{/usCountry}}ఈ మూవీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా కమల్ హాసన్, రజనీకాంత్ చేతులు కలిపిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ ఇద్దరూ కలిసి తెరపై కనిపించనున్నారన్న వార్తల నేపథ్యంలో అది జరగకపోవడం కాస్త నిరాశకు గురి చేసింది. అయితే ఈ ఇద్దరూ మరో సినిమా కోసం పని చేయనున్నారని, దీనికి డైరెక్టర్ ఫైనల్ కావాల్సి ఉందని కూడా వార్తలు వచ్చాయి. గతంలో రజనీకాంత్ కూడా ఇదే విషయం చెప్పాడు. ఆ మూవీ అనౌన్స్‌మెంట్ కోసం ఇప్పుడు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
{{/usCountry}}