Kamal Haasan: కల్కి 2 షూటింగ్ కోసం విమానంలో ఎకానమీ క్లాస్‌లో వెళ్లిన కమల్ హాసన్.. మేకర్స్ ఏమన్నారంటే?

Kamal Haasan: లోకనాయకుడు కమల్ హాసన్ తన సింప్లిసిటీతో మరోసారి అందరి హృదయాలను గెలుచుకున్నారు. 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ షూటింగ్ కోసం ఆయన లగ్జరీ ప్రయాణాలను కాదని, సాధారణ ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణించి సెట్స్‌కు చేరుకున్నారు. దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ప్రశంసల వర్షం కురిపించింది.

Published on: May 19, 2026, 16:03:16 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Kamal Haasan: పాన్-ఇండియా రేంజ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 'కల్కి 2898 ఏడీ' మూవీకి సీక్వెల్ రూపకల్పన వేగంగా జరుగుతోంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్‌లో 'సుప్రీం యాస్కిన్' పాత్రలో మెరిసిన లోకనాయకుడు కమల్ హాసన్.. తాజాగా ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే ఈ స్టార్ హీరో.. షూటింగ్ స్పాట్‌కు రావడానికి ఎంచుకున్న మార్గం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

Kamal Haasan: కల్కి 2 షూటింగ్ కోసం విమానంలో ఎకానమీ క్లాస్‌లో వెళ్లిన కమల్ హాసన్.. మేకర్స్ ఏమన్నారంటే?
Kamal Haasan: కల్కి 2 షూటింగ్ కోసం విమానంలో ఎకానమీ క్లాస్‌లో వెళ్లిన కమల్ హాసన్.. మేకర్స్ ఏమన్నారంటే?

ఎకానమీ క్లాసులో ప్రయాణం

సాధారణంగా స్టార్ హీరోలు షూటింగ్స్ కోసం ప్రైవేట్ జెట్లు, లగ్జరీ కార్లను ఉపయోగిస్తుంటారు. కానీ కమల్ హాసన్ వీటన్నింటికీ భిన్నంగా సాధారణ ప్రయాణికుడిలా ఎకానమీ క్లాస్ ఫ్లైట్‌లో ప్రయాణించారు.

విమానంలో ఆయన సాధారణ సీట్లో కూర్చుని ఫోన్ చూసుకుంటున్న ఫొటోను చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది.

వైజయంతీ మూవీస్ ప్రశంసలు

కమల్ హాసన్ తీసుకున్న ఈ నిర్ణయంపై టాలీవుడ్ దిగ్గజ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ స్పందించింది.

"చిత్ర పరిశ్రమ ఆర్థికంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో.. కమల్ హాసన్ గారు ప్రైవేట్ జెట్లు, లగ్జరీ ప్రయాణాలను వదులుకుని ఎకానమీ ఫ్లైట్‌లో నేరుగా షూటింగ్ సెట్స్‌కు రావడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. సినిమా రంగంలో రాబోయే మంచి మార్పులకు ఇది మొదటి అడుగు" అని వైజయంతీ మూవీస్ ట్వీట్ చేసింది.

ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలో సినిమాల బడ్జెట్, నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోతున్నాయనే చర్చ నడుస్తోంది. ఇలాంటి సమయంలో కమల్ లాంటి లెజెండరీ నటుడు స్వయంగా ఖర్చులు తగ్గించేలా అడుగులు వేయడం అందరినీ ఆకర్షిస్తోంది.

ఖర్చులు తగ్గించాలంటూ కమల్ లేఖ

చిత్ర నిర్మాణ వ్యయం తగ్గించడంపై కమల్ హాసన్ కొన్ని రోజుల క్రితమే ఒక బహిరంగ లేఖ రాశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో చిత్ర పరిశ్రమపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేవలం కింది స్థాయి కార్మికులపై భారం వేయకుండా.. అవసరం లేని చోట వృథా ఖర్చులను అరికట్టాలని పిలుపునిచ్చారు.

భారీ కాన్వాయ్ కల్చర్, అనవసర విదేశీ ప్రయాణాలు, ప్లానింగ్ లోపాలు, షూటింగ్ ఆలస్యం వంటి వాటిని అదుపు చేయాలని ఆయన పరిశ్రమ పెద్దలను కోరారు. ఈ లేఖను కూడా వైజయంతీ మూవీస్ అప్పట్లోనే రీపోస్ట్ చేస్తూ, బాధ్యతాయుతమైన చర్యల గురించి మాట్లాడినందుకు కమల్‌ను అభినందించింది.

షూటింగ్ విశేషాలు.. ఇతర ప్రాజెక్టులు

కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో కలిసి కల్కి సీక్వెల్ షూటింగ్‌ను చకచకా పూర్తి చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ 'గిరఫ్తార్' సినిమాలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కల్కి సీక్వెల్ కోసం జతకట్టడం విశేషం. అమితాబ్ కూడా సోషల్ మీడియాలో కమల్‌ను కౌగిలించుకున్న ఫొటోలను షేర్ చేస్తూ తన ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభాస్, దీపికా పదుకోన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన కల్కి మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించిన సంగతి తెలిసిందే.

మరోవైపు కమల్ హాసన్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. 'జైలర్' ఫేమ్ నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఆయన ఒక సినిమాలో నటిస్తున్నారు. అలాగే అన్బరివు ద్వయంతో మరో యాక్షన్ సినిమా లైన్‌లో ఉంది. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ కమల్ బిజీగా ఉన్నారు. రజనీకాంత్ మూవీ, అలాగే శివకుమార్ మురుగేషన్ దర్శకత్వంలో శివకార్తికేయన్ నటిస్తున్న 'సేయోన్' చిత్రాలను ఆయన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్‌లో కమల్ హాసన్ పాత్ర ఏమిటి?

ఈ మైథో-సైన్స్ ఫిక్షన్ చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన విలన్ అయిన 'సుప్రీం యాస్కిన్' పాత్రను పోషిస్తున్నారు. సీక్వెల్‌లో ఆయన పాత్ర మరింత శక్తివంతంగా ఉండబోతోంది.

2. సినిమా ఖర్చులు తగ్గించడంపై కమల్ హాసన్ ఎలాంటి సూచనలు చేశారు? సినిమా బడ్జెట్ నియంత్రణలో ఉండాలంటే అనవసర విదేశీ ప్రయాణాలు, భారీ కాన్వాయ్ (ఎంటోరేజ్) కల్చర్, ప్లానింగ్ లోపాల వల్ల జరిగే షూటింగ్ ఆలస్యాన్ని అరికట్టాలని కమల్ హాసన్ ఇండస్ట్రీకి సూచించారు.

3. కమల్ హాసన్ ప్రస్తుతం నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రాలు ఏవి?

ఆయన తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై రజనీకాంత్ సినిమాతో పాటు, శివకార్తికేయన్ నటిస్తున్న 'సేయోన్' చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More