...
...
Next Story

Kangana Ramdev Baba: బాబా రామ్‌దేవ్, కంగనా వివాదం సుఖాంతం.. రాఖీ వేళ సోదరుడిగా భావించిన హీరోయిన్.. మరి తాప్సీతో ఎప్పుడు?

Kangana Ranaut Baba Ramdev Fight Ends: జెన్-జీ (Gen Z) యువతపై ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలతో బాబా రామ్‌దేవ్‌తో మొదలైన మాటల యుద్ధం ఎట్టకేలకు సమసిపోయింది. రక్షాబంధన్ సందర్భాన్ని పురస్కరించుకుని రామ్‌దేవ్‌ పంపిన శుభాకాంక్షలు, మిఠాయిలను స్వీకరిస్తూ కంగనా ఈ రచ్చకు ముగింపు పలికారు.

Published on: Aug 29, 2026, 11:13:16 IST
Advertisement

Kangana Ranaut Baba Ramdev Fight Ends: బాలీవుడ్ హీరోయిన్, భాజపా లోక్‌సభ సభ్యురాలు కంగనా రనౌత్, యోగా గురు బాబా రామ్‌దేవ్ మధ్య గత కొద్ది రోజులుగా సాగుతున్న ఘాటైన వ్యాఖ్యల పర్వానికి తెరపడింది. 'జెన్-జీ' (Gen Z) యువతను ఉద్దేశించి కంగనా రనౌత్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు చినికి చినికి గాలివానలా మారి, వీరిద్దరి మధ్య వ్యక్తిగత దూషణల వరకు వెళ్లింది.

వివాదం ఎలా మొదలైందంటే?

బాబా రామ్‌దేవ్, కంగనా వివాదం సుఖాంతం.. రాఖీ వేళ సోదరుడిగా భావించిన హీరోయిన్.. మరి తాప్సీతో ఎప్పుడు?
బాబా రామ్‌దేవ్, కంగనా వివాదం సుఖాంతం.. రాఖీ వేళ సోదరుడిగా భావించిన హీరోయిన్.. మరి తాప్సీతో ఎప్పుడు?

అయితే రక్షాబంధన్ వేడుకల వేళ వీరిద్దరూ పాత వైరాన్ని మరచి వివాదానికి శుభం కార్డ్ వేశారు. ఇటీవల ఒక కార్యక్రమంలో కంగనా రనౌత్ మాట్లాడుతూ నేటి తరం యువతను 'గట్టర్ జనరేషన్' అని సంబోధించారు. ఈ వ్యాఖ్యలపై బాబా రామ్‌దేవ్ మండిపడ్డారు. "యువతను అలా అనడం వికృత మనస్తత్వానికి నిదర్శనం. ఆమె చిన్నతనం, గతం ఎలాంటిదో అందరికీ తెలుసు" అని రామ్‌దేవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దీంతో కంగనా అంతే ఘాటుగా రీకౌంటర్ ఇచ్చారు. నా వ్యక్తిగత జీవితం, గతం గురించి మాట్లాడే హక్కు మీకు లేదని స్పష్టం చేశారు. పతాంజలి తప్పుడు ప్రకటనల వ్యవహారంలో రామ్‌దేవ్‌కు సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ సోషల్ మీడియాలో సెటైర్లు వేశారు.

రాఖీ పండుగ వేళ రామ్‌దేవ్ శాంతి మంత్రం

ఇరుపక్షాల మధ్య వాతావరణం వేడెక్కడంతో బాబా రామ్‌దేవ్ వివాదాన్ని ఇక్కడితో ఆపేయాలని నిర్ణయించుకున్నారు. దేశంలో ద్వేషం, శత్రుత్వానికి తావుండకూడదని, ఏ సమస్యనైనా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు.

'అన్నయ్య రామ్‌దేవ్' అంటూ కంగనా స్పందన

"ఈ రక్షాబంధన్ సందర్భంగా కంగనాకు మిఠాయిలు పంపి శుభాకాంక్షలు తెలుపుతాను. వివాదాలు కాకుండా సంభాషణలు మాత్రమే జరగాలి" అని రామ్‌దేవ్ విలేకరులతో పేర్కొన్నారు. రామ్‌దేవ్ ప్రతిపాదనపై కంగనా రనౌత్ వెంటనే సానుకూలంగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రామ్‌దేవ్ వీడియోను షేర్ చేస్తూ ఒక ప్రత్యేక నోట్ రాసారు.

అయితే, కంగనా, మరో హీరోయిన్ తాప్సీ మధ్య కూడా వివాదం జోరుగానే సాగుతున్న విషయం తెలిసిందే. తనను చీప్ కాపీ అని కంగనా అనడంపై పలుమార్లు రియాక్ట్ అయిన తాప్సీ సెటైర్లు వేసింది. కంగనా పెంపకం, ప్రవర్తనపై ఘాటుగా వ్యాఖ్యలు చేసింది తాప్సీ.

అంతే ఘాటుగా తాప్సీపై కూడా కంగనా రిప్లై ఇచ్చింది. "తల్లిదండ్రుల పెంపకం ప్రస్తావించి నువ్వేంటో నిరూపించుకున్నావ్. ప్రతిసారీ హెడ్‌లైన్ల కోసం నా పేరు వాడుకుంటుంది. మీ తల్లిదండ్రులను చూస్తే జాలేస్తోంది. ఎందుకంటే వాళ్లు నాలాంటి అసలైన మనిషిని కాకుండా చీప్ కాపీని కన్నారేంటని" అని కంగనా రాసుకొచ్చింది.

బాబా రామ్‌దేవ్‌తో రాజీపై కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

ఏదైనా పండుగ సందర్భంగా కలిస్తే!

బాబా రామ్‌దేవ్, కంగనా వివాదానికి తెరపడిన నేపథ్యంలో తాప్సీతో కూడా వార్ ఎప్పుడు ముగుస్తుందని సినీ ప్రేక్షకులు, నెటిజన్స్ అనుకుంటున్నారు. రాఖీలాగే ఏదైనా పండుగ సందర్భంగా కంగనా, తాప్సీ కలిసిపోతే ఈ హీరోయిన్ల వార్ ముగుస్తుందని ఆశిస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe