OTT Blockbuster: ఓటీటీ బ్లాక్‌బస్టర్.. చిన్న బడ్జెట్ మెగా హిట్.. కన్నడనాట పెను సంచలనం.. టాక్సిక్‌కు ముచ్చెమటలు.. కానీ..
OTT Blockbuster: కన్నడలో ప్రస్తుతం ఓ చిన్న సినిమా పెను సంచలనం సృష్టిస్తోంది. యశ్ టాక్సిక్ మూవీని కూడా మించిపోయి పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఆ మూవీ ఏంటి? ఇది ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందన్న వివరాలు చూద్దాం.
OTT Blockbuster: కన్నడ బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా 'ప్రేమద ఊరలి' (Premada Oorali) ప్రస్తుతం మూడో వారంలోకి అడుగుపెట్టి థియేటర్లలో దుమ్ములేపుతోంది. హీరో శ్రీరామ్ (Sriram), టెర్రిఫిక్ యాక్టర్ రంగాయణ రఘు (Rangayana Raghu) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 70 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

అయితే ఈ సినిమా థియేట్రికల్ రన్ సక్సెస్‌ఫుల్‌గా సాగుతుండటంతో, ఓటీటీ ప్రియులు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ఓటీటీ, శాటిలైట్ హక్కులపై వస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ క్లారిటీ ఇచ్చారు.
థియేటర్లే మా ఫస్ట్ ప్రయారిటీ అంటున్న మేకర్స్
సోషల్ మీడియాలో 'ప్రేమద ఊరలి' (ప్రేమతో నిండిన ఊరు అని అర్థం) సినిమా ఓటీటీ, టెలివిజన్ ప్రీమియర్ తేదీల గురించి రకరకాల వార్తలు వైరల్ అవుతున్న తరుణంలో.. లీడ్ యాక్టర్ శ్రీరామ్ సినిమా టీమ్ తరఫున అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతానికి ఏ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ తోనూ లేదా శాటిలైట్ ఛానెల్‌తోనూ ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ప్రేక్షకులు ఈ అందమైన ప్రేమకథను, తండ్రీకొడుకుల భావోద్వేగ బంధాన్ని కేవలం బిగ్ స్క్రీన్ పైనే అనుభవించాలని తాము కోరుకుంటున్నట్లు మేకర్స్ తెలిపారు. థియేట్రికల్ రన్ ముగిసే వరకు డిజిటల్ రిలీజ్ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఒకవేళ ఓటీటీ డేట్ ఫిక్స్ అయితే అధికారిక ఛానెల్స్ ద్వారానే అనౌన్స్ చేస్తామని స్పష్టం చేశారు.
చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ షేక్ చేస్తూ..
మనోజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తపస్విని పూణచ్ఛ, రామిక శివు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఎంబీఏ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ విలేజ్ లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామాకు సంగీతం, ఎమోషనల్ సీన్స్ ప్రధాన బలంగా నిలిచాయి. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలైనప్పటికీ, మౌత్ టాక్‌తో కర్ణాటక వ్యాప్తంగా ఏకంగా 1,100 పైచిలుకు షోలతో ఈ సినిమా దూసుకుపోతోంది. యశ్ నటించిన టాక్సిక్ మూవీకి కూడా ముచ్చెమటలు పట్టించింది.
కన్నడ నాట థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. రూరల్ కర్ణాటకలో అయితే మూవీని చూడటానికి ప్రేక్షకులు ఎగబడుతున్నారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురుస్తూనే ఉంది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ కావడం విశేషం. అయితే ఈ మూవీ ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభిమానులు మాత్రం ఇంకొంతకాలం థియేటర్లలోనే ఈ మ్యాజికల్ లవ్ స్టోరీని ఎంజాయ్ చేయాల్సి ఉంటుందన్నది స్పష్టమైంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


