ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఉత్కంఠగా ట్రైలర్.. చంపేది మొసలా.. సీరియల్ కిల్లరా?
జీ5 (Zee5) ఓటీటీ వేదికగా మరో ఆసక్తికరమైన కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'రాక్షస' (Raakshasa) విడుదలకు సిద్ధమైంది. విజయ్ రాఘవేంద్ర పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (Zee5) తన నాలుగో కన్నడ ఒరిజినల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'రాక్షస' పేరుతో తెరకెక్కిన ఈ సిరీస్ ఫిబ్రవరి 20 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుహాన్ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్‌ను ప్రముఖ నిర్మాత తరుణ్ సుధీర్ నిర్మించాడు. ఇందులో కన్నడ నటుడు విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో, మరోసారి పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడు. మొత్తం 7 ఎపిసోడ్లు ఉండే ఈ సిరీస్, ఒక్కో ఎపిసోడ్ దాదాపు 25 నిమిషాల నిడివితో ఉంటుంది.

మొసలి vs సీరియల్ కిల్లర్.. స్టోరీ ఇదీ..
ఉత్తర కర్ణాటకలోని సౌదత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కథ జరుగుతుంది. అక్కడ విజయ్ రాఘవేంద్ర ఎస్.ఐ హనుమప్ప పాత్రలో నటిస్తున్నాడు. ఆ ప్రాంతంలో ఒక మనుషులను తినే మొసలి తిరుగుతుందనే భయం ప్రజల్లో ఉంటుంది. స్థానిక కుమ్మరి సంఘం జరుపుకునే పండగ సమయంలో నది ఒడ్డున ఒక మనిషి శరీర భాగాలు దొరుకుతాయి. అందరూ ఇది మొసలి పనే అని భావిస్తారు.
కానీ సౌదత్తి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల్లో సగం మంది కనిపించకుండా పోయిన వారే ఉండటం ఎస్.ఐ హనుమప్పను కలవరపెడుతుంది. వీరంతా ఏమయ్యారు? ఆనవాళ్లు లేకుండా ఎలా మాయమయ్యారు? ఇది నిజంగా జంతువుల దాడివల్ల జరుగుతుందా? లేక దీని వెనుక ఏదైనా క్రూరమైన కుట్ర ఉందా అనేది హనుమప్ప ఎలా ఛేదించాడు అన్నదే ఈ వెబ్ సిరీస్ కథ.
తమిళ హిట్టు 'విలంగు' రీమేక్?
ఈ రాక్షస వెబ్ సిరీస్ ట్రైలర్ చూస్తుంటే.. దీనిని 2022లో వచ్చిన సూపర్ హిట్ తమిళ వెబ్ సిరీస్ 'విలంగు' (Vilangu) ఆధారంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విమల్ హీరోగా నటించిన ఆ సిరీస్.. ఒక సీరియల్ కిల్లర్ థీమ్‌తో, కుల వివక్ష వంటి సామాజిక అంశాలను టచ్ చేస్తూ సాగుతుంది. హిందీలో కూడా ఇది 'జానవర్' (Janaawar) పేరుతో రీమేక్ అయ్యింది. ఇప్పుడు కన్నడలో 'రాక్షస'గా వస్తోంది. ఒరిజినల్ కథకు ఎంత దగ్గరగా తీశారు, ఏమైనా మార్పులు చేశారా అనేది ఫిబ్రవరి 20న తెలుస్తుంది.
విజయ్ రాఘవేంద్ర డబుల్ ధమాకా
విశేషమేమిటంటే.. విజయ్ రాఘవేంద్ర నటించిన సినిమా 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్' కూడా ఇదే రోజు (ఫిబ్రవరి 20) థియేటర్లలో విడుదలవుతోంది. ఇది అతని గత సినిమా 'సీతారామ్ బెనోయ్'కి సీక్వెల్. అంటే ఒకే రోజు అతని వెబ్ సిరీస్ ఓటీటీలో, సినిమా థియేటర్లో సందడి చేయనున్నాయి. 'రాక్షస'లో ఎంఎస్ జహంగీర్, అవినాష్ యెలండూర్, మయూరి క్యాతరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


