ఓటీటీలోకి మరో కన్నడ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. భయంకరంగా ఉన్న టీజర్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే
జీ5 ఓటీటీ నుంచి మరో ఆసక్తికరమైన కన్నడ వెబ్ సిరీస్ రాబోతోంది. 'కాటేర', 'రాబర్ట్' వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల దర్శకుడు తరుణ్ సుధీర్ నిర్మించిన ఈ సిరీస్ పేరు 'రాక్షస'. విజయ్ రాఘవేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు.
కన్నడ ఓటీటీ కంటెంట్‌పై జీ5 (Zee5) ప్రత్యేక దృష్టి సారించింది. వరుసగా 'అయ్యన మానే', 'శోధ', 'మారిగల్లు' వంటి ఒరిజినల్స్‌ను విడుదల చేసిన ఈ ప్లాట్‌ఫామ్.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే 'రాక్షస'. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని జీ5 అధికారికంగా ప్రకటించింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ కానుంది.

'కాటేర' డైరెక్టర్ నిర్మాణంలో..
జీ5 ఓటీటీ వరుసగా కన్నడ వెబ్ సిరీస్ లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. తాజాగా రాక్షస పేరుతో మరొక సిరీస్ ను తీసుకొస్తోంది. కన్నడ ఇండస్ట్రీలో 'చౌక', 'రాబర్ట్', ఇటీవల వచ్చిన బ్లాక్‌బస్టర్ 'కాటేర' వంటి చిత్రాలను తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ తరుణ్ సుధీర్ ఈ సిరీస్‌ను నిర్మిస్తుండటం విశేషం.
గతంలో వచ్చిన జీ5 వెబ్ సిరీస్‌లు పెద్దగా ప్రభావం చూపలేకపోయినా.. తరుణ్ సుధీర్ నిర్మాణ విలువలు ఈ సిరీస్‌కు ప్లస్ అవుతాయని, ఇది కచ్చితంగా హిట్టు కొడుతుందని కన్నడనాట భారీ అంచనాలు ఉన్నాయి.
ఉత్తర కర్ణాటక నేపథ్యంలో..
తాజాగా విడుదలైన టీజర్‌లో కథ గురించి పెద్దగా రివీల్ చేయకపోయినప్పటికీ, ఈ సిరీస్ ఉత్తర కర్ణాటక నేపథ్యంలో సాగుతుందని అర్థమవుతోంది. విజయ్ రాఘవేంద్ర ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అప్పన్న, మయూరి, అవినాష్, అభిజిత్ రావు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ రాఘవేంద్రకు ఇది రెండో వెబ్ సిరీస్. గతంలో అతడు 'హకునా మటాటా' అనే థ్రిల్లర్ సిరీస్‌లో నటించారు.
విజయ్ రాఘవేంద్ర డబుల్ ధమాకా
విచిత్రమేమిటంటే.. హీరో విజయ్ రాఘవేంద్రకు ఫిబ్రవరి 20 చాలా స్పెషల్ డే కాబోతోంది. అదే రోజు అతడు నటించిన 'సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం' (సీతారాం బెనోయ్ సీక్వెల్) అనే సినిమా థియేటర్లలో విడుదలవుతోంది. అటు థియేటర్లో, ఇటు ఓటీటీలో (రాక్షస) ఒకేరోజు అతడు సందడి చేయనున్నాడు.
సినిమాలో అతడు పోలీస్ ఆఫీసర్‌గా హత్యల మిస్టరీని ఛేదిస్తుండగా.. 'రాక్షస' సిరీస్‌లో అతని పాత్ర ఏంటి అనేది ఇంకా సస్పెన్స్‌గానే ఉంది. ఇందులో కూడా కాకీ చొక్కా వేస్తారా లేక విభిన్నమైన పాత్రలో కనిపిస్తారా అనేది చూడాలి. ఇటీవల 'రిప్పన్ స్వామి' సినిమాతో అతడు తన ఇమేజ్ మార్చుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


