Bhargav BV: కన్నడలో సుప్రీమ్ స్టార్‌గా తెలుగువాడు- క్లాసిక్ హిట్ సాంగ్ టైటిల్‌తో మూవీ- హీరో భార్గవ్ స్వీయదర్శకత్వం కూడా!

Bhargav BV Tholisari Mimmalni Choosindi Modalu Movie Puja Ceremony: కన్నడ సినీ ఇండస్ట్రీలో సుప్రీమ్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న తెలుగు వాడు భార్గవ్ బీవీ హీరోగా, దర్శకత్వం వహిస్తున్న సినిమా తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆ వివరాలపై చూద్దాం.

Published on: Aug 15, 2026, 10:55:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Bhargav BV Tholisari Mimmalni Choosindi Modalu Movie Puja Ceremony: కన్నడ చిత్ర పరిశ్రమలో 'సుప్రీమ్ స్టార్'గా పేరు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా "తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు". ఈ చిత్రంలో మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

కన్నడలో సుప్రీమ్ స్టార్‌గా తెలుగువాడు- క్లాసిక్ హిట్ సాంగ్ టైటిల్‌తో మూవీ- హీరో భార్గవ్ స్వీయదర్శకత్వం కూడా!
కన్నడలో సుప్రీమ్ స్టార్‌గా తెలుగువాడు- క్లాసిక్ హిట్ సాంగ్ టైటిల్‌తో మూవీ- హీరో భార్గవ్ స్వీయదర్శకత్వం కూడా!

హీరోనే దర్శకత్వం

ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ప్రొడ్యూసర్ బండి నాగరాజు నిర్మిస్తున్నారు. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సినిమాకు హీరో అయిన భార్గవ్ బీవీనే దర్శకత్వం వహిస్తున్నారు.

సూపర్ హిట్ క్లాసిక్ సాంగ్ తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనుంది.

శుక్రవారం (ఆగస్ట్ 14) హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు పూజా కార్యక్రమం

ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా, ఫిలింఛాంబర్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. డైరెక్టర్ దశరథ్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ వీరశంకర్ స్క్రిప్ట్ అందజేశారు.

అనంతరం జరిగిన ప్రెస్ మీట్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మద్దినేని రమేష్ మాట్లాడుతూ.. "ఈ రోజు మా మూవీ పూజా కార్యక్రమాలకు అతిథులుగా వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి, అశోక్ కుమార్ గారికి, దశరథ్ గారికి, ఇతర పెద్దలందరికీ కృతజ్ఞతలు" తెలిపారు.

భార్గవ్ తెలుగువారే

"భార్గవ్ తెలుగు వారే. ఆయన కన్నడలో సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. మా మూవీలో మీనాక్షి జైస్వాల్, అరియా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో మా చిత్ర షూటింగ్ జరపబోతున్నాం. అక్టోబర్ కల్లా మూవీ చిత్రీకరణ పూర్తి చేసి రిలీజ్‌కు రెడీ చేస్తాం" అని మద్దినేని రమేష్ పేర్కొన్నారు.

ప్రొడ్యూసర్ బండి నాగరాజు మాట్లాడుతూ.. "ఒక మంచి కథతో మా సినిమాను నిర్మిస్తున్నాం. భార్గవ్ కన్నడలో ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు. స్టార్‌గా ఎదిగారు. ఆయన మా చిత్రంలో హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. మా మూవీ షూటింగ్ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి బెంగళూరులోని ఒక విలేజ్‌లో ప్రారంభిస్తాం" అని చెప్పారు.

నాలుగు మంచి సాంగ్స్

"రెండు షెడ్యూల్‌ లో సినిమా చిత్రీకరణ పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాం. మా సినిమాకు రోహిత్ నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చారు. అలాగే టెక్నీషియన్స్, నటీనటులు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు" అని నిర్మాత బండి నాగరాజు వెల్లడించారు.

నటుడు కాదంబరి కిరణ్ మాట్లాడుతూ.. "తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు సినిమాను దర్శక నిర్మాతలు చాలా మంచి కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటిస్తున్నాను. బండి నాగరాజు, మద్దినేని రమేష్ వంటి మిత్రులు నటుడిగా నన్ను ప్రోత్సహిస్తున్నారు. ఈ సినిమాకు మీరంతా సహకారం అందిస్తారని కోరుకుంటున్నా" అని కోరారు.

దర్శకుడిగానూ ప్రతిభ

"శ్రావణ శుక్రవారం ప్రారంభమైన ఈ సినిమాకు అంతా మంచే జరిగాలని కోరుకుంటున్నా. ఈ సినిమాతో భార్గవ్ హీరోగానే కాదు దర్శకుడిగానూ తన ప్రతిభ చూపించబోతున్నారు. ప్రొడ్యూసర్ బండి నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మద్దినేని రమేష్ నా వెల్ విషర్స్. ఈ చిత్రంలో ఒక మంచి క్యారెక్టర్‌లో మీకు కనిపించబోతుండటం సంతోషంగా ఉంది" అని యాక్టర్ కిల్లి క్రాంతి చెప్పుకొచ్చారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More