Thriller Web Series: సూపర్ హిట్ కన్నడ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

Thriller Web Series: కన్నడ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ వస్తోంది. అయ్యన మనే అనే ఆ సిరీస్ అక్టోబర్ 23 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. అయితే అసలు తొలి సీజన్ లో జరిగిందేంటి? ఈ సిరీస్ కథేంటో ఇక్కడ తెలుసుకోండి.

Published on: Oct 9, 2026, 21:21:31 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Thriller Web Series: దక్షిణాది ఓటీటీ స్పేస్‌లో సస్పెన్స్, ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్లకు ఎప్పుడూ ఉండే డిమాండే వేరు. రీసెంట్‌గా ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5) వేదికగా కన్నడ తొలినాళ్లలోని వెబ్ సిరీస్‌లలో ఒకటిగా ఆడియన్స్ ముందుకు వచ్చిన పీరియడ్ సైకలాజికల్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'అయ్యన మనే' (Ayyana Mane). ఇప్పుడీ వెబ్ సిరీస్ రెండో సీజన్ కూడా రాబోతోంది. అక్టోబర్ 23 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది.

Thriller Web Series: సూపర్ హిట్ కన్నడ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే
Thriller Web Series: సూపర్ హిట్ కన్నడ వెబ్ సిరీస్ రెండో సీజన్ వచ్చేస్తోంది.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రిలీజ్ డేట్ ఇదే

'దియా' సినిమాతో సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న నటి ఖుషీ రవి (Khushee Ravi) ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్‌ను టాలెంటెడ్ డైరెక్టర్ రమేష్ ఇందిరా తెరకెక్కించారు.

జీ5 ఓటీటీలో అయ్యన మనే సీజన్ 2

జీ5 కన్నడ ఓటీటీ ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ స్ట్రీమింగ్ తేదీని శుక్రవారం (అక్టోబర్ 9) తన ఎక్స్ అకౌంట్ ద్వారా అనౌన్స్ చేసింది. “అక్టోబర్ 23న రహస్యాల వెనుక ఉన్న రహస్యం కూడా బయటపడబోతోంది. ఖుషీ రవి, అక్షయ నాయక, అనిరుధ్ ఆచార్య, ఖుషీ చంద్రశేఖర్ నటిస్తున్నారు. రమేష్ ఇందిర డైరెక్టర్ చేశారు” అనే క్యాప్షన్ తో జీ5 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది.

అయ్యన మనే తొలి సీజన్ లో ఏం జరిగిందంటే?

శ్రుతి నాథ్, చిత్ర సంయుక్తంగా నిర్మించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 1990ల కాలం నాటి చిక్కమగళూరు పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. ఒక పెద్ద రాచరికపు తరహా రాజభవనంలో అడుగుపెట్టిన నవవధువుకు ఎదురైన భయంకరమైన అనుభవాలు, ఆ ఇంటి వెనుక ఉన్న శాపం, దాగి ఉన్న డార్క్ సీక్రెట్స్ చుట్టూ కథ రసవత్తరంగా సాగుతుంది.

కథ విషయానికి వస్తే.. జూజీ (ఖుషీ రవి) అనే అమాయకపు పల్లెటూరి అమ్మాయి దుష్యంత్ (అక్షయ్ నాయక్) అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని 'అయ్యన మనే' అనే పెద్ద గృహంలోకి అడుగుపెడుతుంది. ఆ ఇంటికి పెద్ద దిక్కుగా నాగలాంబికే (మానసి సుధీర్) అనే కఠినమైన అత్తగారు వ్యవహరిస్తూ ఉంటుంది. అయితే జూజీ ఆ ఇంట్లో కాలు పెట్టిన పెళ్లి రోజే ఆమె మామగారు అనుమానాస్పద స్థితిలో మరణిస్తారు. ఇది జూజీ తెచ్చిన అపశకునమేనని ఇంటి సభ్యులు నిందిస్తారు.

కానీ కాలం గడిచేకొద్దీ ఆ ఇంట్లోకి కోడళ్లుగా వచ్చిన మహిళలు ఒక్కొక్కరుగా వింత పరిస్థితుల్లో చనిపోతున్నారనే చేదు నిజం జూజీకి తెలుస్తుంది. ఆ ఇంట్లో ఏదో శాపం ఉందా? లేక కుటుంబ సభ్యుల్లోనే ఎవరో ఒకరు సైకో కిల్లర్‌గా మారి ఈ హత్యలు చేస్తున్నారా? తన ప్రాణాలను కాపాడుకోవడానికి జూజీ ఏం చేసింది? అనేది తొలి సీజన్ లో చూడొచ్చు.

టెక్నికల్ వాల్యూస్, నటీనటుల పర్ఫార్మెన్స్

ఈ వెబ్ సిరీస్‌లో మెయిన్ లీడ్ చేసిన ఖుషీ రవి తన సీరియస్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్‌తో సిరీస్‌ను ఒంటిచేత్తో నడిపించింది. భయం, నిస్సహాయత, తనను తాను రక్షించుకోవాలనే పట్టుదలను ఆమె కళ్లలోనే పండించింది. అత్తగారి పాత్రలో మానసి సుధీర్ నెగెటివ్ షేడ్స్ ఉన్న గంభీరమైన నటనతో ఆకట్టుకోగా, అక్షయ్ నాయక్, అనిరుధ్ ఆచార్య, హితా చంద్రశేఖర్ తమ పాత్రలకు తగిన న్యాయం చేశారు.

దర్శకుడు రమేష్ ఇందిరా 90ల కాలం నాటి వాతావరణాన్ని, దైవ ప్రకోపానికి సంబంధించిన విశ్వాసాలను సరిగ్గా ఎలివేట్ చేశారు. రాహుల్ రాయ్ సినిమాటోగ్రఫీ, లో-కీ లైటింగ్ సిరీస్‌కి కావాల్సిన సస్పెన్స్ మూడ్‌ను క్రియేట్ చేసింది. ప్రతి ఎపిసోడ్ కేవలం 18 నిమిషాల నిడివితో 6 ఎపిసోడ్లు మాత్రమే ఉండటంతో బింజ్ వాచ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సీరియల్ ఛాయలు అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ, సస్పెన్స్ మర్డర్ మిస్టరీలను ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు జీ5లో అందుబాటులో ఉన్న 'అయ్యన మనే' ఒక గుడ్ టైమ్‌పాస్ వాచ్. ఒకవేళ ఇప్పటి వరకూ చూసి ఉండకపోతే రెండో సీజన్ వచ్చే ముందే చూసేయండి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More