Toxic Vs Premada Oorali: బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా సంచలనం.. యష్ 'టాక్సిక్' రికార్డులను తిరగరాసిన 'ప్రేమద ఊరాలి'!

Toxic Vs Premada Oorali: చిన్న సినిమాగా థియేటర్లకు వచ్చిన కన్నడ మూవీ ప్రేమద ఊరాలి బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. కర్ణాటకలో యష్ లేటెస్ట్ మూవీ టాక్సిక్ రికార్డును ఈ ప్రేమద ఊరాలి మూవీ బ్రేక్ చేసింది. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా క్రియేట్ చేస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. 

Published on: Oct 15, 2026, 06:08:08 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

Toxic Vs Premada Oorali: కన్నడ చిత్ర పరిశ్రమ (శాండల్‌వుడ్) లో ఒక చిన్న సినిమా ‘ప్రేమద ఊరాలి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాన్ని సృష్టిస్తోంది. కేవలం లక్షల రూపాయల వసూళ్లతో తన ప్రయాణాన్ని ప్రారంభించిన ఈ చిత్రం, ప్రస్తుతం ప్రేక్షకుల నుంచి వస్తున్న బలమైన పాజిటివ్ టాక్‌తో తుఫానులా దూసుకుపోతూ చరిత్ర సృష్టిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా సంచలనం.. యష్ 'టాక్సిక్' రికార్డులను తిరగరాసిన 'ప్రేమద ఊరాలి'!
బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమా సంచలనం.. యష్ 'టాక్సిక్' రికార్డులను తిరగరాసిన 'ప్రేమద ఊరాలి'!

కర్ణాటకలో రికార్డు కలెక్షన్లు

ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘ప్రేమద ఊరాలి’ తాజాగా శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో ఒక భారీ మైలురాయిని అధిగమించింది. 2026 సంవత్సరానికి గానూ కర్ణాటకలో అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో గ్లోబల్ స్టార్ యష్ నటించిన హై-బడ్జెట్ యాక్షన్ డ్రామా 'టాక్సిక్' (Toxic) కలెక్షన్ల రికార్డును సైతం ఇది దాటేసింది.

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్

కేవలం రూ.2 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ప్రేమద ఊరాలి సినిమాకు ఈ స్థాయి వసూళ్లు రావడం ట్రేడ్ వర్గాలను సైతం షాక్ కు గురిచేస్తోంది. విడుదలైన మొదటి రోజు కేవలం కొన్ని లక్షల వసూళ్లతో నెమ్మదిగా ప్రారంభమైన ఈ చిత్రం, కేవలం 20 రోజుల్లోనే దాదాపు రూ.62.22 కోట్ల నెట్, రూ.72.71 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి సంచలనం సృష్టించింది. ఓవరాల్‌గా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటుతూ రూ.100 కోట్ల క్లబ్ వైపు అడుగులు వేస్తోంది.

టాక్సిక్ ఫెయిల్యూర్

భారీ అంచనాల మధ్య భారీ బడ్జెట్‌తో విడుదలైన యష్ 'టాక్సిక్' సినిమా ఆశించిన స్థాయిలో రాణించలేక డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా కర్ణాటక వ్యాప్తంగా సాధించిన లైఫ్‌టైమ్ వసూళ్లను, స్టార్ వాల్యూ లేని ఈ చిన్న కన్నడ చిత్రం ప్రేమద ఊరాలి కేవలం మూడు వారాల్లోనే అధిగమించి శాండల్‌వుడ్ ట్రేడ్ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డును నెలకొల్పింది.

హృదయానికి హత్తుకునే సినిమా కథ

ప్రేమద ఊరాలి ఒక స్వచ్ఛమైన గ్రామీణ నేపథ్యంలో సాగే ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా. కర్ణాటకలోని ఒక పల్లెటూరి వాతావరణంలో, సాంప్రదాయ ఆలోచనలు గల తండ్రి నాగన్న, సిటీ లైఫ్‌ను తిరస్కరించి వ్యవసాయాన్ని నమ్ముకున్న అతని కొడుకు సంతు చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

వీరి జీవితంలోకి అమెరికా నుంచి వచ్చిన రుక్మిణి ప్రవేశించిన తర్వాత జరిగిన మార్పులు, కుటుంబ బంధాలు, అమాయకత్వంతో కూడిన ప్రేమ, సామాజిక విలువలను హృదయానికి హత్తుకునేలా ఈ సినిమాలో ఆవిష్కరించారు.

కథలో బలం ఉంటే స్టార్ హీరోలు లేకపోయినా, భారీ బడ్జెట్ లేకపోయినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని 'ప్రేమద ఊరాలి' చిత్రం మరోసారి నిరూపించింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More